Community hospital
-
కు.ని. పరే షాన్
చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు అవస్థలు పడ్డారు. డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో శుక్రవారం చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాలకు చెందిన 104 మంది మహిళలు ఆపరేషన్లకు హాజరయ్యారు. కాగా.. వీరిలో ఇద్దరు వివిధ కార ణాలతో వెనక్కివెళ్లగా.. 102 మంది ఆపరేషన్లు నిర్వహించారు. అయితే ఆస్పత్రి 25 పడకలే కావడంతో కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు నేలపైనే పడకున్నారు. వీరికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం గమనార్హం. - చేవెళ్ల రూరల్ -
తలదించుకునే స్థితిలో వైద్యసేవలు
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాయదుర్గం టౌన్ : రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వైద్యసేవల పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో రూ.3.82 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయనతోపాటు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం చేయాల్సిందే ఎంతో ఉందన్నారు. మాతాశిశు మరణాల సంఖ్య దక్షిణ భారత దేశంలోనే అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 1412 మంది వైద్యులను వివిధ విభాగాల్లో నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆస్పత్రులను అభివృద్ధి, భవనాల మరమ్మతు, మందులు, వైద్యుల కొరత నివారణ, తదితర అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పెలైట్ ప్రాజెక్ట్ ద్వారా అనంతపురం జిల్లాలోని హిందూపురం, రాయదుర్గం ప్రభుత్వాస్పత్రుల్లో 35 రకాల డయాగ్నసిస్ పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో రాష్ట్రానికి రూ.350 కోట్ల నాబార్డు నిధులు సాధించుకున్నామన్నారు. ఇందులో అనంతపురం జిల్లాకే రూ.47 కోట్లు కేటాయించమన్నారు. సరిహద్దు ప్రాంతాలైన రాయదుర్గం, కణేకల్లులోని సీహెచ్సీలో అభివృద్ధి పనులకు రూ.6 కోట్ల నిధులు కేటాయించామన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు త్వరలో రాయదుర్గం ఆస్పత్రికి గైనకాలజిస్ట్, అనేస్తీషియా డాక్టర్, చిన్న పిల్లల వైద్యున్ని నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కాన్పూ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగే విధంగా చూస్తామన్నారు. ఆయన తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్సీలు గేయానంద్, మెట్టు గోవిందరెడ్డి, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, వైస్ చైర్మన్ కడ్డిపుడి మహబూబ్బాష, డీఎహెచ్ఓ ప్రభుదాస్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, డీసీహెచ్ఎస్ సత్యనారాయణ, ఏజేసీ ఖాజామొహిద్దీన్, కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు. -
రాజాం ఆస్పత్రిలో నిలిచిన శస్త్రచికిత్సలు
రాజాం: ఆయన జిల్లాకు మంత్రి. వాస్తవంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడాలి. ఆయన చేస్తున్నది చూస్తే పూర్తి భిన్నం. తమ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం వైద్యశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా ఓ మత్తు వైద్యుడి డిప్యుటేషన్ రద్దు చేయించారు. తమ ఆస్పత్రిలో నియమించుకున్నారు. ఫలితం రాజాంలోని వందపడకల ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రాజాం, విజయనగరంలోని పలు మండలాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో పనిచేస్తున్న మత్తు వైద్యుడు జి.చంద్రమౌళి గత కొద్ది నెలలుగా రాజాం వంద పడకల ఆస్పత్రిలో డిప్యుటేషన్ ప్రాతిపదికన వారంలో మూడు రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో శస్త్రచికిత్సలు సాఫీగా సాగిపోయేవి. అయితే, మంత్రి అచ్చెన్న తన అధికార బలంతో మత్తువైద్యుడికి రాజాంలో డిప్యుటేషన్ రద్దు చేయించడమే కాకుండా తన సొంత నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి ప్రాం తీయ ఆస్పత్రిలో రెండు రోజుల కిందట నియమించుకున్నారు. దీంతో ఇక్కడ శస్త్రచికిత్సలు నిలిచిపోయూయి. ఆస్పత్రికి వచ్చే రోగులను శ్రీకాకుళం రిమ్స్, విశాఖ కేజీహెచ్ వంటి ఆస్పత్రులకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మత్తు వైద్య నిపుణుడు చంద్రమౌళి డిప్యుటేషన్ రద్దు విషయం వాస్తవమేనని రాజాం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గార రవిప్రసాద్ తెలి పారు. శస్త్రచికిత్సలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. మత్తువైద్యుడి డిప్యుటేషన్ రద్దులో మంత్రి తీరును స్థానికులు తప్పుబడుతున్నారు. తక్షణమే వైద్యుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.