రూ. 35 కోట్ల నిధుల సమీకరణకు ల్యాంకో ఇన్ఫ్రా నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (సీసీడీ) జారీ ద్వారా రూ. 35 కోట్లు దాటకుండా నిధుల్ని సమీకరించాలని ల్యాంకో ఇన్ఫ్రాటెక్ నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్ 30న బోర్డు సమావేశం జరుపుతున్నామని, ఆ తర్వాత వాటాదారుల అనుమతితో సీసీడీలను జారీ చేయనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.