Competition testing
-
పోటీ పరీక్షలకు... ఇంట్లోనే పాఠాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఏఎస్, ఐఈఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టాలంటే... కఠోరమైన సాధన, శిక్షణ, విశ్లేషణా నైపుణ్యం... ఇలా చాలా అస్త్రాలతో సన్నద్ధమవ్వాలి. ఇందుకోసం మెట్రో నగరాల్లోని టాప్ కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాలి. అలా అని అందరూ తమ పిల్లల్ని శిక్షణ కేంద్రాలకు పంపించలేరు. ఆర్థిక సమస్యలు ఒక కారణమైతే.. దూరం, భద్రత వంటివి మరో కారణం! అలాకాక తమ పిల్లాడు ఇంట్లోనే దేశంలోని ఐఐటీ, ఐఐఎం వంటి టాప్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పాఠాలు ప్రత్యక్షంగా వినే వీలుంటే? ఎంచక్కా ఇంట్లో నుంచే పోటీ పరీక్షలకు సిద్ధంకావచ్చు కదా!! ఇదే ఆలోచన ఇద్దరు అన్నదమ్ముల్ని స్టార్టప్ వైపు నడిపించింది. అదే నియోస్టెన్సిల్. పూర్తి వివరాలు సంస్థ కో–ఫౌండర్ కుశ్ బీజల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.‘‘మాది రాజస్తాన్‌లోని మారుమూల గ్రామం. మా పేరెంట్స్ ఆర్థికంగా కాస్త ఉన్నవారు కావటంతో కోల్‌కతాలోని టాప్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పించారు. నాకు ఐఐటీ అహ్మదాబాద్‌లో, మా తమ్ముడు లవ్ బీజల్కు ఐఐఎం ఢిల్లీలో సీటొచ్చింది. మా పేరెంట్స్లా అంతా తమ పిల్లల్ని మెట్రో నగరాల్లోని ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌కు పంపించలేరని.. ఫీజులు భరించలేరని మేం అర్థం చేసుకున్నాక... దీనికి పరిష్కారం వెదికే క్రమంలో 2014లో రూ.15 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా నియోస్టెన్సిల్ను ఆరంభించాం. 300 కోర్సులు; 60 మంది టీచర్లు.. సివిల్స్, ఐఈఎస్, ఎస్ఎస్ఎసీ, బ్యాంకింగ్, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ నియోస్టెన్సిల్‌లో ఉంది. ప్రస్తుతం 300 కోర్సులున్నాయి. శిక్షణ కోసం సివిల్ సర్వీస్ శిక్షణ సంస్థలు, రిటైర్డ్ ఐఐటీ, ఐఐఎంలు, టాప్ కాలేజీల ప్రొఫెస ర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా ఫ్లాట్‌ఫాంలో 60 మంది టీచర్లున్నారు. ఒకే సబ్జెక్ట్‌లో నలుగురైదుగురు టీచర్లుంటారు. అభ్యర్థి తనకు నచ్చిన ప్రొఫెసర్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసిన సమయం, తేదీ ప్రకారం ప్రత్యక్ష పాఠాలుంటాయి. ఆ సమయానికి అభ్యర్థి లైవ్‌లో పాఠం వినలేకుంటే దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో వీలున్నప్పుడల్లా వినే వీలుంటుంది. ఆన్లైన్ ప్రత్యక్ష పాఠాలతో పాటు టెస్ట్ సిరీస్, కౌన్సెలింగ్, బృంద చర్చలు, స్టడీ మెటీరియల్ వంటివి కూడా అందిస్తాం. నియోస్టెన్సిల్, టీచర్లకు 50:50.. కోర్సును బట్టి ధరలు రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉన్నాయి. అభ్యర్థులు చెల్లించే ఫీజులో 50 శాతం టీచర్లకు, మిగిలింది కంపెనీకి. ఇప్పటిదాకా నియోస్టెన్సిల్‌లో 3 లక్షల మంది యూజర్లున్నారు. వీరిలో 6 వేల మంది పెయిడ్ యూజర్లు. ప్రస్తుతం ఏడాదికి 3 వేల మంది అభ్యర్థులు మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను 7 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.15 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగిసేలోగా టీచర్ల సంఖ్యను 150కి, కోర్సుల సంఖ్యను వెయ్యికి చేర్చాలని లకి‡్ష్యంచాం. హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం.. ఆన్లైన్ పాఠాలతో పాటు ఆఫ్‌లైన్‌లో హైదరాబాద్, జైపూర్‌లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. వీటిల్లో టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. స్థానికంగా ఉండే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో మా సేవలను వినియోగించుకోవచ్చు. త్వరలోనే దేశంలో మరో 20 ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఐఐటీ, ఐఐఎం ఎంట్రన్స్ కోర్సులను కూడా ప్రారంభిస్తాం. రెండేళ్లలో విదేశీ కోర్సులు, ఉద్యోగాలపై కూడా లైవ్ పాఠాలు ప్రారంభిస్తాం. 33 కోట్ల నిధుల సమీకరణ.. మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. డిసెంబర్‌కి ఈ సంఖ్యను 80కి చేరుస్తాం. ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎం అండ్ ఎస్ పార్టనర్స్, ప్యారగాన్ ట్రస్ట్, జబాంగ్, యూనికామర్స్ ఫౌండర్ల నుంచి రూ.6 కోట్లు సమీకరించాం. అనలిటకల్ ఆధారిత టెస్ట్ ప్రాక్టీస్ పోర్టల్ టెస్ట్కేఫ్నూ కొనుగోలు చేశాం. ఈ ఏడాది ముగిసేనాటికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మరో ఎడ్యుటెక్ స్టార్టప్‌ను కొనుగోలు చేయనున్నాం. అలాగే రూ.33 కోట్ల నిధుల సమీకరిస్తాం’’ అని కుశ్ వివరించారు. -
కరెంట్ అఫైర్స్
సాహిత్య పురస్కారాలు – విజేతలు కాంపిటీటివ్ గైడెన్స్ వివిధ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో అవార్డులు అందుకున్నవారు – ఇచ్చే సంస్థలు/వ్యక్తులపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ అవార్డులు, ఇటీవల కాలంలో వాటిని అందుకున్న విజేతల గురించి తెలుసుకుందాం.. జ్ఞాన్‌పీఠ్ అవార్డ్: మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని 1965 నుంచి ప్రదానం చేస్తున్నారు. అవార్డ్ గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. తొలి గ్రహీత మలయాళం రచయిత జి.శంకర కురూప్. 52వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 27న ప్రముఖ బెంగాలీ రచయిత శంఖఘోష్ (2016 సంవత్సరానికి)కు ప్రదానం చేశారు. ఆయన 2011లో పద్మభూషణ్ కూడా అందుకున్నారు. మూర్తీదేవి అవార్డ్: భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ఈ అవార్డ్‌ను తొలిసారి 1983లో కన్నడ రచయిత సి.కె.నాగరాజరావుకు ప్రదానం చేసింది. అవార్డ్ కింద రూ.నాలుగు లక్షల నగదును అందజేస్తారు. 2016కు ఈ అవార్డును ప్రముఖ మల యాళీ రచయిత, పాత్రికేయుడు ఎం.పీ. వీరేంద్ర కుమార్ అందుకున్నారు. ఆయన రాసిన ‘హైమవత భూవిల్’ అనే పుస్తకానికి అవార్డ్ దక్కింది. ఇది 30వ మూర్తీదేవి అవార్డ్. ఎం.పీ.వీరేంద్రకుమార్ మలయాళం దినపత్రిక మాతృభూమి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. 2015లో ఈ పురస్కారం తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్‌కు ‘అనంత జీవనం’ అనే పుస్తకానికి లభించింది.సరస్వతీ సమ్మాన్: కె.కె.బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఏర్పాటు చేసింది. దీని కింద రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. 1991లో ప్రముఖ హిందీ రచయిత హరివంశరాయ్ బచ్చన్‌కు మొదటిసారి ఈ పురస్కారం దక్కింది. 2016కు ఈ అవార్డ్‌ను ప్రముఖ కొంకణి రచయిత మహాబలేశ్వర్ సెయిల్‌కు మార్చి 9న ప్రకటించారు. ఆయన రాసిన ‘హాథాన్’ అనే నవలకు ఈ పురస్కారం లభించింది. వ్యాస్ సమ్మాన్: కె.కె. బిర్లా ఫౌండేషన్ కేవలం హిందీ రచనలు చేసేవారికి 1991లో వ్యాస్ సమ్మాన్‌ను ఏర్పాటు చేసింది. దీని కింద రూ.3.50 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. వ్యాస్ సమ్మాన్ 2016కు ప్రముఖ హిందీ రచయిత సురేంద్ర వర్మకు లభించింది. ఆయన రాసిన ప్రముఖ నవల ‘కాట్నా షమీకా వృక్షః పద్మ పంఖరి కో ధార్ సే’ పురస్కారం దక్కించుకుంది. ఆయన 26వ వ్యాస్ సమ్మాన్ గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ సాహిత్య అకాడమీ.. గతేడాది డిసెంబర్ 21న 24 భాషల్లో అవార్డులను ప్రకటించింది. వీటిని ఫిబ్రవరి 22న ప్రదానం చేశారు. నగదు బహుమతి రూ. లక్ష. ‘రజనీ గంధ’ అనే కవితా సంపుటికి తెలుగు రచయిత పాపినేని శివశంకర్‌కు ఈ పురస్కారం లభించింది. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ -
పోటీ పరీక్షలకు మరో 8 పుస్తకాలు
సిద్ధం చేస్తున్న తెలుగు అకాడమీ వారంలో ఒకటి, నెలాఖరుకు మరో 7 అందుబాటులోకి తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ మరో 8 కొత్త పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో మరో 8 పుస్తకాలను సిద్ధం చేయిస్తోంది. ఈ నెలాఖరులోగా వాటిని అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి 12 రకాల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంటర్మీడియెట్ లో మార్పు చేసిన పుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన కోణం, పూర్తి విశ్లేషణలతో ఈ పుస్తకాలను అకాడమీ అందుబాటులోకి తెస్తోంది. వీటితోపాటు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పుస్తకాన్ని అకాడమీ ప్రత్యేకంగా ముద్రిస్తోంది. మరో వారంలో ఇది అందుబాటులోకి రానుంది. కొత్త పుస్తకాల్లోని ప్రత్యేకాంశాలు.. త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరి త్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్ల కాలం, అసఫ్జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగా ణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు వంటి అంశాలను అకాడమీ పొందుపరుస్తోంది. ఇంటర్ పుస్తకాల్లోనూ తెలంగాణ సంబంధ అంశాలు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పుస్తకాల్లోనూ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయని, అవి కూడా అభ్యర్థులకు ఉపయోగపడతాయని అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. వాటిలో తెలంగాణ చరిత్ర, భౌగోళిక, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న పుస్తకాలు . తెలంగాణ చరిత్ర-సంస్కృతి తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర అవతరణ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి {పభుత్వ పాలన శాస్త్రం సమాజ శాస్త్రం తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం జనరల్ స్టడీస్ ఇదివరకే అందుబాటులో ఉంచినవి ఇండియన్ జియోగ్రఫీ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సోషియాలజీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ భారత రాజ్యాంగం {పభుత్వ పాలన శాస్త్రం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర -
‘సాక్షి స్పెల్‌బి’ ఫైనల్‌కు సాయిసుజన్
ఇబ్రహీంపట్నం: ‘సాక్షి స్పెల్‌బి-2014’ పోటీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ తరఫున కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సాయిసుజన్ అర్హత సాధించాడు. ఫైనల్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది విద్యార్థులు ఎంపికవ్వగా అందులో కొండపల్లి గ్రామం నుంచి సాయిసుజన్ కూడా ఉన్నారు. ఇటీవల విజయవాడలో సెమీ పరీక్ష రాసి ఫైనల్‌కి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ విద్యార్ధి కొండపల్లిలోని నాగార్జున విద్యానికేతన్‌లో రెండో తరగతి చదువుతున్నారు. ఫైనల్ పరీక్ష డిసెంబర్ 5న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరగనుందని సాయిసుజన్ తల్లి దుర్గారాణి తెలిపారు. తమ స్కూల్‌కి చెందిన విద్యార్థి ఈ పరీక్షకు ఎంపికకావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ సర్దార్ సాహెబ్, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.