complained to the police
-
అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు : కొండా రాజీవ్ గాంధీ
-
‘నేను నపుంసకుడిని.. తొలి రేయిలోనే భార్యకు షాక్’
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): ఎన్ఆర్ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. తొలి రేయిలోనే భర్త తాను నపుంసకుడినని చెప్పడంతో ఆ యువతి కంగు తింది. పైగా అదనపు కట్నం తెస్తే కాపురానికి తీసుకెళతానని భార్య, ఆమె తరఫు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల దాడికి సైతం పాల్పడ్డాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేసే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. వరుడి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు త్వరలో చదువు కోసం కెనడా వెళతాడని, అక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాడని, పెళ్లి చేసుకుని భార్యనూ తీసుకెళతాడని చెప్పారు. వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో వధువు తల్లిదండ్రులు మంచి సంబంధం అని చెప్పి సుమారు రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి వివాహం చేశారు. వివాహం జరిగిన రోజు రాత్రే కార్యం నిమిత్తం వధువును విజయవాడ తీసుకువెళ్లారు. తొలిరాత్రి గదిలోకి వెళ్లిన ఆమెకు భర్త తాను నపుంసకుడినని, సంసారానికి పనికిరానని చెప్పడంతో కంగుతింది. బయట ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డాడు. మరుసటి రోజు విజయవాడలో వరుడి తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌కు వచ్చిన తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు వధువు అసలు విషయం చెప్పుకుని భోరున విలపించింది. దీంతో వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను తెనాలిలోని పుట్టింటికి తీసుకొచ్చేశారు. అనంతరం ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా, రిసెప్షన్ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, వాటిని తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్ చేశారు. అంతకు కొద్ది రోజుల ముందు తెనాలి పినపాడుకు వచ్చిన వీరు, యువతి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తెనాలి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ... బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. భర్త ఒక్కసారిగా షాక్ -
బాలుడి వింత ఫిర్యాదు.. పోలీసులు షాక్
తిరువనంతపురం : ఓ ఎనిమిదేళ్ల బాలుడు చేసిన ఫిర్యాదు చూసి కేరళ పోలీసులు షాక్ తిన్నారు. తన అక్కతోపాటుగా ఐదుగురు బాలికలను అరెస్ట్ చేయాలని అతడు పోలీసులును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. మూడో తరగతి చదువుతున్న ఉమర్ నాదిర్ అనే బాలుడు లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లి తన స్నేహితులతో ఆడుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అతని అక్క, ఇరుగుపొరుగున ఉన్న ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఇంట్లోనే దొంగ-పోలీసు, లూడో వంటి ఆటలు ఆడుకుంటున్నారు. దీంతో ఉమర్ వారితో కలిసి ఆడుకోవాలని చూశాడు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పగా.. అందుకు వారు అంగీకరించలేదు. (చదవండి : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) ఇదే విషయాన్ని ఉమర్ తన తండ్రికి చెప్పాడు. ఇందుకు ఆయన పోలీసులుకు ఫిర్యాదు చేయమని జోక్ చేశాడు. అయితే దానిని సీరియస్‌గా తీసుకున్న ఉమర్.. ఇంగ్లిష్‌లో ఓ ఫిర్యాదు రాసి ఉంచుకున్నాడు. అదే సమయంలో వేరే కేసు విషయంపై తన ఇంటి సమీపంలోకి వచ్చిన పోలీసులకు ఆ లేఖను అందజేశాడు. తన అక్క, ఆమె స్నేహితులు తనను వాళ్లతో కలిసి ఆడనివ్వడం లేదని తెలిపాడు. ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోవడం లేదని.. అందుకే వాళ్లని అరెస్ట్ చేయాలని కోరాడు. (చదవండి : 5 లక్షల సలహాల్లో ఎక్కువ వాటికే: కేజ్రీవాల్) అయితే అప్పటికే సాయంత్రం కావడంతో.. రేపు ఉదయం సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు ఉమర్‌కు చెప్పారు. హామీ ఇచ్చినట్టుగానే మరుసటి రోజు ఉదయం ఉమర్ ఇంటి వెళ్లిన పోలీసులు ఉమర్‌తో కలిసి ఆడుకోవాల్సిందిగా అతని అక్కకు, మిగతా బాలికలకు సూచించారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. అయితే తమ్ముడు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని అస్సలు ఊహించలేదని ఉమర్ అక్క చెప్పారు. -
అత్తింటి వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు
సాక్షి, రాజంపేట: అత్తింటి వేధింపులు భరించలేక వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన ఓ అభాగ్యురాలు.. జిల్లా ఎస్పీ అన్బురాజ్‌ను ఆశ్రయించింది. మూడు రోజుల క్రితం జన్మించిన మగశిశువును తన నుంచి లాక్కుని పుట్టింటికి వెళ్లగొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీని బాధితురాలు వేడుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్షక్ వాహనంలో బాధితురాలిని స్వస్థలమైన రాజంపేటకు తరలించారు. అత్తింటి వేధింపులకు గురైన బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని రాజంపేట డిఎస్పీని ఎస్పీ ఆదేశించారు. -
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
విద్యార్థినులు, మీడియాను కించపరుస్తూ కామెంట్లు.. పోలీసులకు ఫిర్యాదు కరీంనగర్ క్రైం: పోలీసుల పేరుతో సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 28న విద్యారంగ సమస్యలపై విద్యార్థి నులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. అక్కడ తోపులాట జరి గింది. దీనికి సంబంధించిన ఫొటోలను విద్యార్థులు ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనికి శివరాజు అనే పోలీసు ఫేస్బుక్లో స్పందిస్తూ ‘ఇందులో మీడియా ఒక వైపున మాత్రమే చూపించిందని’ కామెంట్ పెట్టాడు. దీనికి సిరాజ్‌బాషా అనే పోలీస్ డ్రస్‌లో ఉన్న మరో వ్యక్తి విద్యార్థినులపై అసభ్యకరంగా పోస్ట్ చేశాడు. దీనికి తమరన్ శ్రీని వాస్ అనే మరో వ్యక్తి మీడియా, విద్యార్థినులపై రాయలేని విధంగా కామెంట్ చేశాడు. దీనిపై సామా జిక ఉద్యమకారుడు జి.సత్యం కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఎమ్మెల్యేపై డాక్టర్ ఫిర్యాదు
ఘజియాబాద్: విధుల్లో తనపై స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని ఒక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. ఖోడా కాలనీలోని రద్దీగా ఉండే మార్కెట్లోకి గత రాత్రి ఒక కారు అతివేగంగా దూసుకుపోవడంతో సుమారు 10 మంది వరకు గాయపడ్డారు. వారిలో కొందరిని కౌషంబీ ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరామర్శించేం దుకు సహిదాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్‌పాల్ శర్మ ఆస్పత్రిని సందర్శించారు. కాగా, డ్యూటీ డాక్టర్ తమకు సరిగా వైద్యం అందించలేదని బాధితురాలు ఒకరు ఎమ్మెల్యేకు ఫిర్యాదుచేయడంతో అతడి అనుచరులు డాక్టర్ గుప్తాతో వాగ్వాదానికి దిగారు. కాగా, ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తనపై దౌర్జన్యం చేశాడని గుప్తా ఫిర్యాదుచేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇంద్రపురం పోలీస్‌స్టే షన్ అధికారి హరిదయాల్ యాదవ్ తెలిపారు. -
మరో కీచక టీచర్
పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం పోలీసులకు ఫిర్యాదు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా టీచర్‌ను సస్పెండ్ చేసిన డీఈవో చౌడేపల్లె: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో కీచ క టీచర్ వెలుగులోకి వచ్చాడు. పదో తరగతి విద్యార్థినిపై అత్యాచార య త్నానికి పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత విద్యార్థి, సహ విద్యార్థినుల కథనం మేరకు.. మండలంలోని గోసలకురప్పల్లెకు చెందిన విద్యార్థిని (15) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోం ది. ఆదివారం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామని గణితం ఉపాధ్యాయుడు రమేష్‌కుమార్‌రెడ్డి చెప్పడంతో వెళ్లారు. చాలామంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో క్లాసు లు నిర్వహించకుండా విద్యార్థులతో క్లాసులకు సున్నం కొట్టించే పని మొదలుపెట్టాడు. అదే సమయంలో గేమ్స్ రూమ్ తాళాలు తెప్పించాడు. ఒక బాలిక దాహం వేస్తుందని చెప్పడంతో ఆమెకు గేమ్స్ రూమ్ తాళాలిచ్చి నీరు తాగి రమ్మని చెప్పాడు. ఆ బాలిక నీరు తాగుతుండగా వెనుకనే వచ్చిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు వి షయం చెప్పింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు అత న్ని అదుపులోకి తీసుకున్నారు. సహచర ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కీచక ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ ధర్నా చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు డిమాండు చేశా రు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కీచక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నిం చిన కేసులో రమేష్‌కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి ఆదివారం ఫోన్ ద్వా రా ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి, పునరావృతం కాకుం డా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.