ఘజియాబాద్: విధుల్లో తనపై స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని ఒక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. ఖోడా కాలనీలోని రద్దీగా ఉండే మార్కెట్‌లోకి గత రాత్రి ఒక కారు అతివేగంగా దూసుకుపోవడంతో సుమారు 10 మంది వరకు గాయపడ్డారు. వారిలో కొందరిని కౌషంబీ ఆస్పత్రికి తరలించారు.
బాధితులను పరామర్శించేం దుకు సహిదాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్‌పాల్ శర్మ ఆస్పత్రిని సందర్శించారు. కాగా, డ్యూటీ డాక్టర్ తమకు సరిగా వైద్యం అందించలేదని బాధితురాలు ఒకరు ఎమ్మెల్యేకు ఫిర్యాదుచేయడంతో అతడి అనుచరులు డాక్టర్ గుప్తాతో వాగ్వాదానికి దిగారు. కాగా, ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తనపై దౌర్జన్యం చేశాడని గుప్తా ఫిర్యాదుచేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఇంద్రపురం పోలీస్‌స్టే షన్ అధికారి హరిదయాల్ యాదవ్ తెలిపారు.
ఎమ్మెల్యేపై డాక్టర్ ఫిర్యాదు
Published Tue, Aug 19 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement
Advertisement