Private hospital doctor
-
నల్లగా మారిన మహిళ చేయి.. కారణం తెలిస్తే షాక్
చండీఘడ్: గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వినిత, సర్పరాజ్ దంపతులు. అయితే, వినిత దుండహేరా గ్రామంలోని పార్క్ అనే ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్ 23న గర్భ విచ్చిత్తి చేయించుకుంది. ఆ తర్వాత డాక్టర్లు ఆమెకు యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. ఆమె కుడి చెయి క్రమంగా నల్లగా మారింది. వెంటనే, ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులను మార్చారు. అయినా ఆమెలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆమెను ఎక్స్‌రే తీశారు. దీంట్లో ఆమె చేయి నల్లగా మారడంతోపాటు, శరీరం ఇన్ఫెక్షన్కు గురైందని తెలిసింది. కాగా, ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పార్క్ వైద్య సిబ్బంది సలహ ఇచ్చారు. గర్భాస్రావం తర్వాత అధిక మోతాదులో యాంటీ బయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే తన భార్యకు ఇలా జరిగిందని సర్పరాజ్ ఆరోపించాడు. కాగా, తన భార్యను తీసుకొని వెంటనే ఢిల్లీలోని ఆసుపత్రికి చేరుకున్నాడు. వినితను అక్కడి వైద్యులు పరీక్షించారు. ఆమె కుడి చేయి పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురైందని వెంటనే తొలగించాలని తెలిపారు. దానికోసం చాలా ఖర్చుఅవుతుందని కూడా తెలిపారు. అసలే.. కొవిడ్ కారణంగా సర్పరాజ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాగా, తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇప్పటివరకు నెట్టుకొచ్చానని తెలిపాడు. కాగా, వీరికి ఒక ఎన్జీవో ఆహరాన్ని అందిస్తుంది. తాను ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకూడా భరించే స్థితిలో లేనని పేర్కొన్నాడు. ఈ దారుణంపై గురుగ్రామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
కడుపు నొప్పి అని వెళ్తే..
-
ఆపరేషన్‌ను మధ్యలో ఆపేసిన వైద్యుడు
అచ్చంపేట రూరల్ (మహబూబ్ నగర్): రోజురోజుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రు ల్లో కాసుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్లు చేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలను పొగొడుతున్నారు. రోగం నయం చేస్తారని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఏకంగా కాటికే పంపిస్తున్నారు. అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడపుతున్న ఓ ప్రభుత్వ వైద్యుడు.. ఓ మహిళ గర్భసంచిలోని గడ్డను తొలగిస్తానని ఆపరేషన్ ప్రారంభించి.. అది పూర్తి చేయకుండానే మధ్యలో నే ఆపి కుట్లువేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల కథ నం ప్రకారం.. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గండికోట అనితకు కడుపులో తరుచూ నొప్పి రావడంతో గత నెలలో అచ్చంపేటలోని డీబీఎం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అన్ని టెస్టులు చేశారు. స్కానింగ్ తీశారు. మహిళ గర్భసంచిలో గడ్డ ఉందని వైద్యుడు తారాసింగ్ గుర్తించారు. మహిళకు రక్తం తక్కువగా ఉందని ఇటీవల రక్తం ఎక్కించారు. బుధవారం ఉదయం మహిళకు ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించారు. అయితే సదరు మహిళ గర్భసంచిలో గడ్డ అతుకులు అతుకులుగా ఉందని గ్రహించి.. ఆపరేషన్ పూర్తి చేయకుండానే వెంటనే కుట్లు వేశారు. విషయం తెలుసుకున్న ఆ మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ తారాసింగ్ ఉప్పునుంతలలోని పీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా అతని సొంత ప్రైవేటు ఆసుపత్రి కావడంతో మహిళకు ఆపరేషన్ చేశారు. మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. అయితే ఈ విష యం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బాధితురాలి బంధువుల ఫోన్ల ద్వారా బయటపడింది.ఈ విషయమై డాక్టర్ తారాసింగ్‌ను వివరణ కోరగా గతంలోనే మహిళకు రెండు ఆపరేషన్లు జరిగాయని, బుధవారం ఉదయం ఆపరేషన్ చేసి చూడగా గర్భసంచిలో అతుకులు ఉన్నాయని, మళ్లీ నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేయవచ్చనే ఉద్దేశంతో కుట్లు వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళలకు ఎలాంటి అపాయం లేదన్నారు. -
ఎమ్మెల్యేపై డాక్టర్ ఫిర్యాదు
ఘజియాబాద్: విధుల్లో తనపై స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని ఒక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. ఖోడా కాలనీలోని రద్దీగా ఉండే మార్కెట్లోకి గత రాత్రి ఒక కారు అతివేగంగా దూసుకుపోవడంతో సుమారు 10 మంది వరకు గాయపడ్డారు. వారిలో కొందరిని కౌషంబీ ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరామర్శించేం దుకు సహిదాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్‌పాల్ శర్మ ఆస్పత్రిని సందర్శించారు. కాగా, డ్యూటీ డాక్టర్ తమకు సరిగా వైద్యం అందించలేదని బాధితురాలు ఒకరు ఎమ్మెల్యేకు ఫిర్యాదుచేయడంతో అతడి అనుచరులు డాక్టర్ గుప్తాతో వాగ్వాదానికి దిగారు. కాగా, ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తనపై దౌర్జన్యం చేశాడని గుప్తా ఫిర్యాదుచేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇంద్రపురం పోలీస్‌స్టే షన్ అధికారి హరిదయాల్ యాదవ్ తెలిపారు.