![Husband Family Harassments, Woman Who Complained To The SP - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/21/women-shadow.jpg.webp?itok=r5RMq7VN)
సాక్షి, రాజంపేట: అత్తింటి వేధింపులు భరించలేక వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన ఓ అభాగ్యురాలు.. జిల్లా ఎస్పీ అన్బురాజ్‌ను ఆశ్రయించింది. మూడు రోజుల క్రితం జన్మించిన మగశిశువును తన నుంచి లాక్కుని పుట్టింటికి వెళ్లగొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీని బాధితురాలు వేడుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్షక్ వాహనంలో బాధితురాలిని స్వస్థలమైన రాజంపేటకు తరలించారు. అత్తింటి వేధింపులకు గురైన బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని రాజంపేట డిఎస్పీని ఎస్పీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment