
‘పుణె ప్రమాదం’ ఘటనలో డాక్టర్ల నిర్వాకం
యశవంతపుర: ఐ లవ్ యూ అని మహిళకు పదే పదే మెసేజ్‌లు పంపి వేధిస్తున్న పోకిరీని ఆమె పాదరక్షతో దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన బాగలకోట జిల్లా ఇళకల్ పట్టణంలో జరిగింది. యాసిన్ అనే యువకుడు నివేదిత అనే మహిళను ప్రేమించాలని వాట్సాప్‌లో సందేశాలు పంపసాగాడు.
ఇద్దరూ పెళ్లయి కుటుంబాలు ఉన్నవారే. కానీ యాసిన్ బుద్ధి పెడదారి పట్టింది. తనను ప్రేమించాలని ఆమెను వెంటపడసాగాడు. దీంతో ఆదివారం ఆక్రోశానికి గురైన మహిళ యాసిన్ ఇంటికి వచ్చి అతన్ని చెప్పుతో చితకబాదింది. తప్పయిపోయిందని పోకిరీ దండాలు పెట్టాడు. స్థానికులు ఆమెకు సర్దిచెప్పి పంపారు.