compliants
-
నగరానికి వరుణుడి సైరన్!..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజామున గాలి దుమారంతో కూడిన భారీ వర్షం దడ పుట్టించింది. నగర అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వర్షాకాలంలోగా ముంపు ముప్పు తప్పించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించినప్పటికీ, చెప్పుకోదగిన స్థాయిలో పనులు జరగలేదు. దీంతో ముంపుముప్పు పొంచే ఉంది. గంటసేపు కురిసిన ఒక్కవానకే వాస్తవ పరిస్థితి కళ్లకు కట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. రోడ్లపై జనసంచారం లేని సమయం, సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా గండం గట్టెక్కినప్పటికీ, వర్షాకాలంలో తలెత్తనున్న అసలు సినిమాకు టీజర్ రిలీజ్ అయిందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వరద సమస్యలకు పరిష్కారం చూపే నాలాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్‌లోగా ఇరవై శాతమే పూర్తికాగలవని అధికారులే చెబుతుండటంతో ఈసారీ వాన కష్టాలు పునరావృతం కానున్నాయని తెలుస్తోంది. వర్షాలు కూడా తోడైతే పనులు జరిగే పరిస్థితే ఉండదు. ఈ నేపథ్యంలో, అధికారులు తక్షణ చర్యలకు సిద్ధం కావాల్సిన పరిస్థితిని ప్రకృతి హెచ్చరించింది. డీసిల్టింగ్ పనులు సైతం పూర్తికాకపోవడంతో వరద, డ్రైనేజీ కలగలసి పారిన చిత్రాలు కనిపించాయి. నాలాల పనులు పూర్తికానందున నీటినిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటన తోడిపోయాల్సిన చర్యలు తప్పని పరిస్థితి నెలకొంది. ముప్పు.. తప్పేదెప్పుడు? నగరంలో వాన కురిసిందంటే చాలు ప్రధాన రహదారులే చెరువులుగా మారే రంగమహల్ జంక్షన్, మైత్రీవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, ఆర్పీ రోడ్, ఆలుగడ్డబావి, కార్ఖానా మెయిన్‌రోడ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కేబీఆర్ పార్క్, మైలాన్షోరూమ్ (బంజారాహిల్స్), బయోలాజికల్ ఈ లిమిటెడ్,(రామ్‌నగర్), నిజాంకాలేజ్, ఖైరతాబాద్, అయోధ్య జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్తగా ఇతర ప్రదేశాలు నీటినిల్వ ప్రాంతాలుగా మారాయి. జరిగింది కొంతే.. జరగాల్సింది ఎంతో.. సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణ తదితర పనులు మొదలు పెట్టినా, పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లోని పనులే ఇందుకు నిదర్శనం. నాగమయ్యకుంట నాలా ఆధునికీకరణ పనులు 7 శాతం జరిగాయి. మోహిని చెరువు నుంచి మూసీ నది వరకు వరద కాల్వ పనులు 10 శాతం పూర్తయ్యాయి. యాప్రాల్‌లో నాగిరెడ్డిచెరువు–కాప్రాచెరువు వరదకాలువ పనులు 18 శాతం జరిగాయి. మన్సూరాబాద్ చిన్నచెరువు–బండ్లగూడ చెరువు పనులు 7 శాతం జరిగాయి. బండ్లగూడ చెరువు–నాగోల్ చెరువు పనులు 20 శాతం పూర్తయ్యాయి. నూరినగర్ –డెక్కన్ ప్యాలెస్ వరకు 14 శాతం జరిగాయి. జల్పల్లి ఫిరంగి నాలా– క్యూబా కాలనీ వరకు 3 శాతం మాత్రమే జరిగాయి. సాతం చెరువు నుంచి లంగర్‌హౌస్ (వయా మోతీ దర్వాజా) డ్రెయిన్ పనులు 10 శాతం జరిగాయి. నదీం కాలనీ నుంచి సాతం చెరువు వరకు పనులు 6 శాతం జరిగాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వీటికి అటూఇటూగా పనులు జరిగాయి. ఫిర్యాదులెన్నో.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్కు 48 ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు ఫిర్యాదులందగా తొలగించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇతర మాధ్యమాల ద్వారా నీటి నిల్వ లు, చెట్లు కూలిన ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ జోన్లో 71 ప్రాంతాల్లో, సికింద్రాబాద్ జోన్లో 54 ప్రాంతాల్లో, చార్మినార్ జోన్లో 35 ప్రాంతాల్లో నీటినిల్వలు తొలగించారు. ఖైరతాబాద్‌జోన్‌లో 42, సికింద్రాబాద్జోన్లో 7, చార్మి నార్ జోన్లో 3 కూలిన చెట్లను తొలగించారు. వర్షాల సమస్యలపై జీహెచ్ఎంసీ కంట్రోల్‌రూమ్ 04021111111 లేదా 04029555500 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ పేర్కొంది. -
గవర్నర్ దృష్టికి రైతు సమస్యలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు, ప్రభుత్వ అలసత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు ఎన్.రామ్‌చందర్ రావు సోమవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతులు పడుతున్న కష్టాలు, పండ్ల రైతుల ఇబ్బందులు, వలస కార్మికుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటాం అంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొను గోళ్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం స్పం దించడం లేదన్నారు. ప్రభుత్వ విధి విధానాలను కొనుగోలు కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ కార్యకర్తల ను ఇబ్బంది పెట్టినా లాక్డౌన్ సహకరిం చామని తెలిపారు. ఇప్పటికైనా తమ సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు. గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తున్న బండి సంజయ్, చిత్రంలో ఎన్.రామ్‌చందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ -
పంజాగుట్ట పీఎస్ లో లొంగిపోయిన సి.కల్యాణ్
-
పంజాగుట్ట పీఎస్‌లో లొంగిపోయిన సి.కల్యాణ్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ బుధవారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మహిళపై దాడి చేసిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై చేయి చేసుకున్నారంటూ సి.కల్యాణ్ పై ఏప్రిల్ 28న డాక్టర్ కవిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్‌కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్‌పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మహిళా డాక్టర్‌పై చేయి చేసుకున్న నిర్మాత
-
మహిళా డాక్టర్‌పై చేయి చేసుకున్న నిర్మాత సి.కల్యాణ్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై చేయి చేసుకున్నారంటూ ఆయనపై ఓ మహిళా డాక్టర్ ...జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ ఫ్లాట్ విషయంలో తనను సి.కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ డాక్టర్ కవిత తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం నిమిత్తం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో 11 ఫ్లాట్స్‌కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది. సి. కల్యాణ్ కూడా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి సి.కల్యాణ్ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు సంబంధించి తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని డాక్టర్ కవిత అర్థరాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సి. కల్యాణ్‌పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. -
ఎస్ఎంఎస్ చాలు
సాక్షి, ముంబై: పోలీసు స్టేషన్లలో మీ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోకపోతే నేరుగా తనకు నేరుగా ఎస్ఎంఎస్ చేయాలని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ముంబైకర్లకు పిలుపునిచ్చారు. 7738133133, 7738144144 ఫోన్ నంబర్లకు సంక్షిప్త సమాచారం పంపించాలన్నారు. ముంబై మహాలక్ష్మి సమీపంలోని శక్తి మిల్లు కంపౌండ్‌లో ఓ మహిళ ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిగిన అనంతరం సత్యపాల్ సింగ్ అప్రమత్తమయ్యారు. మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులపై నేరుగా డిప్యూటీ కమిషనర్లు దృష్టిసారించాలని ఆదేశాలు జారీ చేశారు. శక్తిమిల్లు కంపౌండ్‌లో అత్యాచారం సంఘటన అనంతరం తొలిసారిగా ఓ మరాఠీ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళల ఫిర్యాదులు మహిళా పోలీసులే తీసుకోవాలి. దీనిపై అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే అకతాయిలపై కఠిన చర్యలు చేపడతామ’ని చెప్పారు. దీంతోపాటు ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం... మహిళల సమస్యలు పెరిగాయా..? మహిళల సమస్యలు పెరగడం కాదు. ఫిర్యాదులు నమోదుచేసే వారి సంఖ్య పెరిగింది. ఢిల్లీలో నిర్భయ సంఘటన అనంతరం మహిళల చేసే ప్రతి ఫిర్యాదును స్వీకరించేలా చర్యలు చేపట్టాం. ఈ ప్రక్రియ సరిగా కొనసాగుతోందా?, లేదా? అని పర్యవేక్షించే బాధ్యత జాయింట్ కమిషనర్ (లా ఆర్డర్)కు అప్పగించాం. దీంతో పాటు నెలకొకసారి అయా అంశాలను స్వయంగా సమీక్షిస్తున్నా. ఈ చర్యలతో అనేక మంది మహిళలు ఫిర్యాదులు నమోదు చేసేందుకు నిర్భయంగా పోలీసుస్టేషన్లకు వస్తున్నారు. ఈవ్‌టీజింగ్ చేసే అకతాయిలను కొంత మేర అడ్డుకట్టవేయడంలో కూడా సఫలీకృతమయ్యాం. రైళ్లలో మహిళలపై దాడులు పెరిగిన నేపథ్యంలో వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ‘శక్తి మిల్లు’ ఘటన తర్వాత మీరు తీసుకున్న చర్యలే ంటి? పోలీసు స్టేషన్లన్నింటిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లు మరింత మెరుగుపరిచే విషయంపై దృష్టిసారించాం. కొన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంది. వాటిని భర్తీ చేస్తున్నాం. వీరికి కేవలం మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులను నమోదుచేసుకునే బాధ్యతలు అప్పగించాం. ఏసీపీ, డీసీపీలు పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ప్రతిసారీ వీరి పనితీరు సమీక్షిస్తారు. కొన్ని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన మహిళలను పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి కదా..? వాస్తవమే.. ఇందుకోసమే మహిళల కోసం పోలీసు స్టేషన్లలో ప్రత్యేక ఫిర్యాదుల సెంటర్లు ఏర్పాటుచేశాం. అయితే వీటి గురించి అనేక మందికి ఇంకా తెలియదు. దీంతో ఈ ప్రత్యేక ఫిర్యాదుల సెంటర్ల గురించి తెలిపే బోర్డులను పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం. రెండు మూడు రోజులలో బోర్డులు అమర్చనున్నారు. ఈ బోర్డుపై సంబంధిత ఫిర్యాదు సెంటర్లోని ప్రముఖ మహిళ పోలీసు అధికారి పేరు, సెల్ నంబర్ తదితర వివరాలుంటాయి. దీంతో మహిళలకు ఫిర్యాదులు చేయడంలో ఇబ్బందులు రాకపోవచ్చు. మహిళలకు నమ్మకం కలిగించడంలో పోలీసుల వైఫల్యంపై మీ స్పందన..? దీనికి అనేక కారణాలున్నాయి. పోలీసులపై మహిళలందరిలో విశ్వాసం, నమ్మకం పెరిగేందుకు అన్ని విధాలా పోలీసు శాఖ ప్రయత్నిస్తోంది. దీనికోసం అన్ని పోలీసు స్టేషన్ల బయట ఫిర్యాదుల పెట్టెను అమర్చాం. దీంతోపాటు మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా 103 ఫోన్ నంబర్‌ను కేటాయించాం. అలాగే నా ఫోన్ నెంబర్లు7738133133, 7738144144 కు నేరుగా ఎస్ఎంఎస్ చేయవచ్చు. ఈ ఎస్ఎంఎస్లను స్వయంగా ప్రతి రోజు ఉదయం పరిశీలిస్తాను. వెబ్సైట్లలో కూడా ఫిర్యాదులు చేసే వెసులుబాటును కల్పించాం. మాపై నమ్మకం ఉంచే మహిళలకు సరైన మద్దతు అందిస్తాం. ‘ఐఈఎస్’ అనే మహిళల సాఫ్ట్వేర్ ఏమైంది..? ఈ సాఫ్ట్వేర్ పథకం కూడా కొనసాగుతోంది. అయితే దీనికి కొన్ని పరిమితులున్నాయి. ఇందుకోసం ప్రత్యేక పద్ధతిలోనే ఫోన్ చేయగలుగుతారు. ఆ సౌకర్యంలేనివారు పైన పేర్కొన్నట్టుగా తమ సమస్యలను పోలీసులకు తెలపాలి. ‘విద్యార్థినుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించండి’ ముంబై: రాష్ర్టవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు మహిళా సమస్యల పరిష్కారాల కమిటీ విభాగాలు చురుగ్గా పనిచేసేలా పర్యవేక్షించాలని రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ కోరారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఎన్డీటీ ఉమెన్స్ యూనివర్సిటీలో శనివారం జరిగిన సెమినార్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు తల్లిదండ్రులతోపాటు అధ్యాపకులు కూడా కృషి చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్, రెచ్చగొట్టే మాటలు, అసభ్య పదజాలం ఉపయోగించడం, దుష్ర్పవర్తన తదితర అంశాలను ఎదుర్కొనేందుకు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు.