సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు, ప్రభుత్వ అలసత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు ఎన్.రామ్‌చందర్ రావు సోమవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతులు పడుతున్న కష్టాలు, పండ్ల రైతుల ఇబ్బందులు, వలస కార్మికుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటాం అంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొను గోళ్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం స్పం దించడం లేదన్నారు. ప్రభుత్వ విధి విధానాలను కొనుగోలు కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ కార్యకర్తల ను ఇబ్బంది పెట్టినా లాక్‌డౌన్ సహకరిం చామని తెలిపారు. ఇప్పటికైనా తమ సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు.
గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తున్న బండి సంజయ్, చిత్రంలో ఎన్.రామ్‌చందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్
Comments
Please login to add a commentAdd a comment