ట్రంప్‌కు ఫోన్ చేసిన హిల్లరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడాన్ని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అంగీకరించారు. ఓటమిని అంగీకరించిన హిల్లరీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్(270) దాటిన తరువాత హిల్లరీ తనకు ఫోన్ చేశారని, విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపినట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రచారంలో హిల్లరీ క్లింటన్ తనకు దీటైన పోటీని ఇచ్చినట్టు ట్రంప్ న్యాయార్క్‌లోని హెచ్‌క్యూలో చేపట్టిన విజయోత్సవ ప్రసంగంలో చెప్పారు.
విదేశాంగమంత్రిగా హిల్లరీ గణనీయమైన సేవలందించారని కొనియాడారు. ఇక ప్రజలందరి కోసం సమైక్యంగా నడవాల్సిన రోజులు వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను రెండింతలు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కాగ అంచనాలకు భిన్నంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్ హవా సాగించారు. దీంతో హిల్లరీ వెనుకంజలో పడిపోయి, ట్రంప్ అధ్యక్ష పీఠానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రరాజ్యానికి అతిపెద్ద వయస్కుడిగా అధ్యక్ష పదవి చేపడుతున్న వ్యక్తి కూడా ట్రంపే.