condomes
-
కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్
ప్రముఖ కండోమ్ బ్రాండ్ మేన్‌కైండ్ ఫార్మా ఏప్రిల్ 25న ఐపీఓకు రానుంది. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్‌లు, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ల విక్రయాలతో పాపులర్ బ్రాండ్‌గా పేరొందింది. మెడికల్ సేల్స్‌మెన్స్‌గా మొదలై రూ.43,264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన జునేజా సోదరుల సక్సెస్ స్టోరీ.. ఢిల్లీకి చెందిన డ్రగ్ కంపెనీ, కండోమ్ మేకర్ మేన్‌కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ని ఏప్రిల్ 25న ప్రారంభించి, ఏప్రిల్ 27న ముగించడానికి సిద్ధంగా ఉంది. అనిశ్చిత ఆర్థికపరిస్థితుల మధ్య 2023లో ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన ఏడో ఐపీఓ ఇది. మెడికల్ సేల్స్మెన్లా ప్రయాణం మొదలుపెట్టి రూ. 43,264 కోట్లకు చేర్చారు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా. జునేజా సోదరులుగా పేరొందిన వీరు ఒంటరిగానే మొదలు పెట్టారు. పట్టుదలతో, మొక్కవోని దీక్షతో కంపెనీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో మధ్య తరగతిని ఆకర్షించడంలో జునేజా సోదరుల మేనేజ్మెంట్ స్కిల్స్, కార్పొరేట్ వ్యూహం నిదర్శనంగా నిలిచింది. అతితక్కువ సమయంలోనే విక్రయాల్లో దూసుకు పోతూ దిగ్గజాలకు దడ పుట్టించారు. ఛైర్మన్ రమేష్ సీ జునేజా 1974లో కీఫార్మా అనే కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఫార్మా దిగ్గజం లుపిన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 1994లో తను స్థాపించిన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1995లో తన సోదరుడు రాజీవ్ జునేజాతో కలిసి మేన్కైండ్ని ప్రారంభించారు. ఇందుకు వారి ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలు మాత్రమే. 25మంది వైద్య ప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలతో, 600 మందికిపైగా శాస్త్రవేత్తల బృందంతో పనిచేస్తోంది. అతిపెద్ద నెట్‌వర్క్‌తో నాలుగు యూనిట్లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నడుపుతోంది. 2022లో ఫోర్బ్స్ డేటా ప్రకారం 34500 కోట్ల రూపాయల నికర విలువ జునేజా సోదరుల సొంతం. మేన్ కైండ్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.43,264 కోట్లు. దేశీయ విక్రయాల పరంగా ఇది భారతదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ. గత సంవత్సరం, డిసెంబర్ 2022 నాటికి, దాని ఏకీకృత లాభం రూ.996.4 కోట్లు. తొలి తొమ్మిది నెలల ఆదాయం రూ.6697 కోట్లు. మ్యాన్‌ఫోర్స్ కండోమ్ బ్రాండ్ రూ. 462 కోట్లకు పైగా దేశీయ విక్రయాలతో ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉందని పేర్కొంది. ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ల విక్రయం రూ. 184.40 కోట్లు. ముఖ్యంగా కంపెనీ నెట్వర్క్ విస్తరణకు, విజయానికి కారణం కంపెనీ సీఈవోగా రాజీవ్ జునేజా. రమేష్ జునేజా సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, రాజీవ్ కాలేజీ డ్రాప్ అవుట్. అలాగే జునేజా సోదరుల మేనల్లుడు అర్జున్, ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షిస్తుండగా. మరో మేనల్లుడు శీతల్ అరోరా, గైనకాలజీ, డెర్మటాలజీ డ్రగ్స్ మార్కెటింగ్ విభాగం లైఫ్స్టార్ను బాధ్యతలను చూస్తుండటం విశేషం.కంపెనీ వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి పలు ఫార్మ ఫార్ములేషన్స్తోపాటు, అనేక వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఐపీఓ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా 40,058,844 ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ జాబితా చేయాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకులు రమేష్ జునేజా , రాజీవ్ జునేజా, సీఈవో శీతల్ అరోరా, కెయిర్న్‌హిల్ CIPEF, కెయిర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ ,లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026 1,080గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు మే 3న ఇన్వెస్టర్లకు కేటాయించిన తరువాత మే 8న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. Autism is a development disorder where children have problems with social communication and interaction, restricted or repetitive behaviors or interests. Let's learn more about Autism and bridge the gap created by social stigma. #AutismAwarenessDay #MankindPharma #ServingLife pic.twitter.com/5WPKIqvIUi — Mankind Pharma (@Pharma_Mankind) April 2, 2023 -
‘కండోమ్’ వ్యాఖ్యలపై సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశం!
పాట్నా: శానిటరీ పాడ్లపై ఓ విద్యార్థి ప్రశ్నకు వెటకారంగా ‘కండోమ్’లు పంచమని అడుగుతారేమో అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా చిక్కుల్లో పడ్డారు. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటంతో ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్‌పై చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్‌గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం నితీశ్ కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలిసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర మహిళలకు అన్ని విధాల సహాయం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారిని ప్రవర్తన ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా అదనపు చీఫ్ సెక్రెటరీ ర్యాక్ ఆఫీసర్, బిహార్ మహిళా, శిశు సంక్షేమ కమిషన్ హెడ్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘సాశక్త్ భేటీ.. సమృద్ధ బిహార్’ పేరుతో యూనిసెఫ్ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 27న పాట్నాలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని లేచి ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు, యూనిఫాం ఇస్తున్నప్పుడు శానిటరీ పాడ్లు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించింది. దీనికి ఐఏఎస్ అధికారిని వెటకారంగా సమాధానం ఇచ్చారు. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఇదీ చదవండి: వీడియో: శానిటరీ పాడ్స్‌పై ప్రశ్న.. ఐఏఎస్ అధికారిణి వివరణతో షాక్ తిన్న విద్యార్థినులు -
ఇచ్చుకుంటూ పోతే.. రేపు ఫ్రీగా కండోమ్‌లు పంచాలంటారు!
వైరల్: ఆమె ఒక ఐఏఎస్ అధికారిణి. అదీ మహిళాశిశు సంక్షేమ శాఖకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. స్కూల్ స్టూడెంట్స్ అందునా అమ్మాయిలు చేసిన విజ్ఞప్తికి ఆమె స్పందించిన తీరుపై మండిపడుతున్నారంతా. ఊరకుంటే.. కండోమ్‌లు కూడా ఫ్రీగా పంచాలని అడుగుతారంటూ విద్యార్థులను ఉద్దేశించి వెటకారంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కంపరం పుట్టిస్తున్నాయి. బీహార్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. దీనికి ఆ ఐఏఎస్ అధికారిని ఇచ్చిన వివరణలు, ఆ అమ్మాయితో పెట్టుకున్న వాగ్వాదం.. ఆమెను చిక్కుల్లో పడేసింది. సాశక్త్ భేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో యునిసెఫ్ మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో మంగళవారం సాయంత్రం పాట్నాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి డబ్ల్యూసీడీసీ ఎండీ హర్జోత్ కౌర్ హాజరయ్యారు. అయితే.. కార్యక్రమానికి హాజరైన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో మొదలైన వ్యవహారం.. వాడీవేడిగా సాగింది. ఉచిత ప్రకటనలు చేసే ప్రభుత్వం.. రూ.20-30 ఖర్చు చేసి ఉచితంగా శానిటరీ పాడ్లు అందించలేదా? అని స్టూడెంట్ ప్రశ్నించింది. దానికి హర్జోత్ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్జోత్ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్జోత్. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్జోత్ కౌర్ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారిణి-విద్యార్థినులకు మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. -
కండోమ్‌లు మందులు కావు!
కండోమ్‌లు మందులు కావా? కావనే మద్రాస్ హైకోర్టు చెబుతోంది. ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రాతిపదికగా తీసుకుంటే అవి మందులు కావని, అందువల్ల వాటికి ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల కింద గరిష్ఠ ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని కోర్టు చెప్పింది. టీటీకే ప్రొటెక్టివ్ డివైజెస్ లిమిటెడ్ దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివలింగంలతో కూడిన బెంచి విచారించింది. జాతీయ ఔషధ ధరల సంస్థ కండోమ్‌లకు గరిష్ఠ ధర నిర్ణయించడానికి వీల్లేదని తెలిపింది. కేవలం నిర్ధారిత ఫార్ములేషన్లు, డోసేజిలతో కూడిన మందులకు మాత్రమే ఎన్పీపీఏ ధరలు నిర్ణయించగలదన్న విషయం చట్టంలో స్పష్టంగా ఉందని గతంలో ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అందువల్ల కండోమ్‌లకు డోసేజి అంటూ ఏమీ ఉండదు కాబట్టి.. వాటి ధరను నిర్ణయించడానికి వీల్లేదని చెప్పింది. ఎన్పీపీఏ ఇచ్చిన ఉత్తర్వులను పలు కండోమ్ తయారీ సంస్థలు కోర్టులో సవాలు చేశాయి. అందులో భాగంగానే చెన్నైకి చెందిన టీటీకే సంస్థ మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ మద్రాసు హైకోర్టు కూడా కండోమ్‌లకు ధర నిర్ణయించే అధికారం ఎన్‌పీపీఏకు లేదని స్పష్టం చేసింది. గరిష్ఠ ధర నిర్ణయించడం వల్ల వాటి ఉత్పత్తిపై దుష్ప్రభావం పడుతుందని, దానివల్ల జనాభా నియంత్రణకు కూడా ఇబ్బంది అవుతుందని కంపెనీలు వాదిస్తున్నాయి. బేసిక్, యుటిలిటీ కండోమ్‌లకు ఒకే ధర సీలింగ్ నిర్ణయిస్తే తమకు చాలా సమస్య తలెత్తుతుందని అన్నాయి.