Conflicts with wife
-
కనిపించకుండా పోయి అడవిలో శవమై కనిపించింది..
సాక్షి, రాయగడ: జిల్లా పరిధిలోని గుణుపూర్ సమితి, చినసరి గ్రామంలో గౌరి బౌరి(32) అనే వివాహిత మృతదేహాన్ని పోలీసులు శనివారం గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన ఈమె ఇప్పుడు శవమై కనిపించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమెని భర్తే చంపేసి మట్టిలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలిలా ఉన్నాయి.. చినసారి గ్రామానికి చెందిన గౌరి బౌరి(32)ని అదే గ్రామానికి చెందిన సురేందర్ సొబొరొ(38) పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఏదో కారణమై కొన్నాళ్ల క్రితం తగాదాలు మొదలయ్యాయి. ఇలా తరచూ వీరిద్దరూ గొడవ పడుతుండగా ఈనెల 5వ తేదీన ఎప్పటిలాగే సురేందర్ సొబొరొ తన భార్యతో గొడవపడి ఆమెని అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని గ్రామ సమీపంలోని అడవిలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియని వాడిలా తన భార్య కనబడుట లేదని తన అత్తవారికి తెలిపాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన గౌరి తల్లిదండ్రులు గుణుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పొలీసులు సురేందర్ సొబొరొను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే తన భార్యని హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం గౌరి మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
-
రచ్చకెక్కిన ఇంటి గొడవ
చిలకలగూడ : న్యాయస్థానంలో పెండింగ్‌లో భార్యభర్తల వివాదం రచ్చకెక్కింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు భార్యభర్తలు ఇద్దరిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌కు చెందిన నికిల్‌కుమార్‌కు వరంగల్ గిర్మాజీపేటకు చెందిన అపర్ణతో 2016 ఆగస్టులో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. నికిల్‌కుమార్‌తోపాటు అతని కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధిస్తున్నారని అపర్ణ తల్లితండ్రులు వరంగల్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో అత్తవారింట్లో ఉన్న తన వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని అపర్ణ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆదివారం న్యాయవాది, తల్లితండ్రులతో కలిసి పద్మారావునగర్‌లోని నికిల్‌కుమార్ ఇంటికి వచ్చింది. అత్తింటివారు ఆమె అల్మారా, ఇతర వస్తువులు ఇంటి బయట ఉంచారు. అల్మారాలోని బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు లేవని అపర్ణతోపాటు వారి బంధువులు నికిల్‌కుమార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నికిల్‌కుమార్, అపర్ణలను స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో నూ వారు వాగ్వాదానికి దిగడంతో ఇరువురిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. -
తాగిన మైకంలో దారుణం
తాగిన మైకంలో వారు రాక్షసులుగా మారారు. ఒకర కట్టుకున్న భార్యను, మరొకరు సొంత బావమరిదిని తలపై మోది హత్య చేశారు. చోడవరం మండలం కన్నంపాలెం గ్రామంలో భార్యను భర్త హత్య చేయగా, అనకాపల్లి మండలం రేబాక ఎస్సీ కాలనీలో బావను, బావమరిది కొట్టడంతో అతను చికిత్స పొందతూ మృతి చెందాడు చోడవరం : నిద్రిస్తున్న భార్య తలపై మంచం కోడుతో కొట్టి ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కన్నంపాలెం గ్రా మానికి చెందిన బైన వెంకట అప్పన్న దొరకు పాయకరావుపేట మండలం నర్సాపురానికి చెందిన పలెల్ల వెంకటేశ్వరరావు కుమార్తె సుజాతకు ఏడేళ్లు క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా వెంకట అప్పన్నదొర మద్యం సేవించి సుజాతను చితక బాదాడు. తరువాత బయటకు వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి, నిద్రిస్తున్న సుజాత(33)తలపై మంచం కోడుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ఈ విషయం గ్రామంలోని వారికి తెలిసింది ఎంపీటీసీ బైన ఈశ్వరరావు పొలీసులకు ఫిర్యాదు చేసి, మృతురాలి తల్లి దండ్రులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటరమణ, సీఐశ్రీనువాసరావు, ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుజాతతండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, భర్త వెంకటప్పన్నదొరను అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. తల్లి మృతి చెందడంతో కుమార్తెలు సాయిపావని, రోహిణిలు తీవ్రంగా విలపించారు. తుమ్మపాల(అనకాపల్లి): అక్కాబావల గొడవలో కలుగుజేసుకుని, మద్యం మత్తులో బావమరిది దాడిచేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 15న ఎస్.కోటలో జరిగిన పండుగకు వెళ్లేందుకు మండలంలో రేబాక గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న కొండమ్మ 14న సిద్ధమవుతుండగా, తాను వస్తానని ఆమె కొడుకు మారాం చేశాడు. అయితే ఆమె అంగీకరించలేదు. దీంతో తన తండ్రి పొట్నూరి అప్పారావు(35)కు చెప్పాడు. కొడుకును ఎస్.కోట తీసుకెళ్లవలసిందిగా కొండమ్మకు అప్పారావు సూచించాడు. అయితే ఆమె అంగీకరించలేదు. దీంతో కొండమ్మ, అప్పారావు మధ్య గొడవ జరిగింది. భార్యపై అప్పారావు చేయిచేసుకున్నాడు. వీరద్దరి మధ్య గొడవ పెరగడంతో స్థానికులు, కొండమ్మ తల్లిదండ్రులు యర్రంశెట్టి అప్పారావు, వెంకయ్యమ్మలు వచ్చి సర్ది చెప్పారు. ఈ సమయంలో వచ్చిన మద్యం మత్తులో ఉన్న అప్పారావు బావమరిది రాము కర్రతో తలపై బలంగా కొట్టి గాయపరిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి అప్పన్న అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతుడి బావమరిది యర్రంశెట్టి రాము, భార్య కొండమ్మ, అత్తమామలు యర్రంశెట్టి అప్పారావు, వెంకయ్యమ్మపై కేసు పెట్టాడు. రూరల్ ఎస్ఐ ఆదినారాయణరెడ్డి కేసు నమోదు చేసి, వివరాలు సేకరించారు. నిందితుడు రాము పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని రిమైండ్కు తరలిస్తామని ఎస్ఐ చెప్పారు. అప్పారావు దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. -
భార్యతో గొడవపడి ఇంటికి నిప్పు పెట్టాడు!
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన ఇంటికే నిప్పు పెట్టుకున్న ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అపార్టుమెంట్ మొత్తం పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. మైసమ్మగూడకు చెందిన చింతల రాజు, మంజుల, తన ఇద్దరు కుమారులతో కలిసి బహదూర్‌పల్లిలోని మహేశ్ క్యాసిల్ అపార్టుమెంట్‌లోని 204 ఫ్లాట్‌లో ఉంటున్నాడు. శనివారం రాత్రి 10 గంటల తప్పతాగి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైగ అపార్టుమెంట్ మొత్తం అలుముకుంది. స్థానికులు దుండిగల్ పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్కఫ్లాట్స్ ( 201, 203, 205) లో ఉండే వారు సెలవులకు ఊళ్లకు వెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. నిందితుడు రాజును పోలీసులు స్టేషన్‌కు తరలించారు.