కాంగ్రెస్ నాయకురాలిపై రెండు కేసులు
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: చెన్నై అన్నానగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అన్నానగర్ పాడికుప్పం ప్రాంతానికి చెందిన కల్పన (45) కాంగ్రెస్ నిర్వాహకురాలు. రెండేళ్ల ముందు శ్రీపెరంబుదూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సంతానం కుమారుడు నవీన్‌కుమార్ (21)కి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు తీసి ఇస్తానని *4.5 లక్షలు కల్పన తీసుకుంది. కానీ సీటు తీసివ్వలేదు. నవీన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి కల్పనను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
కల్పనపై మరో కేసు
పాడి మన్నూర్ పేటకు చెందిన రూబి (47) బుధవారం తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో చెన్నై ఈస్టు కోస్టు రోడ్డులో ఇల్లు తీసి ఇస్తానని చెప్పడంతో రెండు విడతలుగా 23 లక్షల నగదును తన కుమార్తె మేరీతో కలిసి కల్పనకు ఇచ్చాను. కాని ఇల్లు తీసి ఇవ్వలేదు. దీంతో నగదు తిరిగి ఇవ్వాలని కోరాం. అందుకు ఆమె *23 లక్షలకు చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో పోలీసులు కల్పనపై మరో కేసు నమోదు చేశారు.