Connectivity Project
-
1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్.. కారణం ఇదేనా..
దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్ఎన్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. -
ఢిల్లీ తరహాలో ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ ‘మెట్రో’
దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మెట్రో రైలులో వేగంగా ఎయిర్‌పోర్టుని చేరుకునేలా సరికొత్త ప్రాజెక్టుకు రూపు ఇస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోరైల్ ప్రాజెక్టును రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అక్షరాలా రూ.4 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ మేర ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీంతో రాయదుర్గం నుంచి కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలవుతుంది. ఈ మెట్రో కారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్ల నుంచి విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. రాయదుర్గం నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతున్న విషయం విదితమే. 5 కి.మీకి ఒక స్టేషన్! విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా మట్టి నాణ్యత పరీక్షలు చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. త్వరలో స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టతరానుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిధుల అన్వేషణలో ఎస్పీవీ యంత్రాంగం.. రాయదుర్గం–శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ యంత్రాంగంలో హైదరాబాద్ మెట్రోరైలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ విభాగాలున్నాయి. ప్రస్తుతం ఈవిభాగాల ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్లో సుమారు రూ.వెయ్యి కోట్లను హెచ్ఎంఆర్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టును మొదలుపెడతారా..లేక ఇతర మార్గాల్లో రుణ సేకరణ ద్వారా ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని సమకూర్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నగరంలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో 69.1 కి.మీ మేర మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉంది. చదవండి:కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ? -
ఊర్లే లేవు.. రోడ్డేశారట..
► రోడ్లు వేయకుండానే వేసినట్లుగా రికార్డులు ► పనులు చేయకుండానే నిధులు స్వాహా ► పంచాయతీలో లేని గ్రామాల పేర్లతో పనులు ఉట్నూర్ : గ్రామ పంచాయతీలో లేని గ్రామాలను సృష్టించారు. ఆ రెండు గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్డు కూడా వేసేశారు. అలా కాంట్రాక్టర్ల ధనదాహానికి అధికారుల అవినీతి తోడైంది. ఫలితంగా రోడ్డు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ నిధులు స్వాహా చేశారు. ప్రభుత్వం రూరల్ కనెక్టివిటి ప్రాజెక్ట్(గ్రామీణ అనుసంధాన రోడ్లు)-1 పథకంలో భాగంగా మొదటి విడతలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 1,066 పనులకు గాను ప్రభుత్వం రూ.53 కోట్ల 90 లక్షల 8 వేలు కేటారుుంచింది. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించి పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణమే లేదు ఆర్సీపీ(రూరల్ కనెక్టివిటి ప్రాజెక్టు)-1 పనుల్లో భాగంగా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామం నుంచి సోనాపూర్ వరకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.9.65 లక్షలు కేటారుుంచారు. దొంగచింత నుంచి సోనాపూర్‌కు రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దొంగచింత నుంచి కేవలం 60 నుంచి 70 మీటర్ల వరకు రెండు వైపులా మట్టి పోసి వదిలేశారు. అంతేగానీ సోనాపూర్ వరకు రోడ్డు నిర్మాణమే జరగలేదు. కాని అధికారులు మాత్రం రోడ్డు పూర్తి చేసినట్లు రికార్డుల్లో రాశారు. అదీగాక రోడ్డు నిర్మాణంలో భాగంగా కూలీల చెల్లింపులు రూ.25వేలుగా, మెటీరియల్‌కు రూ.9.23 లక్షలు ఖర్చయినట్లు లెక్కలేశారు. రూ.9.48 లక్షలతో పనులు పూర్తరుునట్లు రికార్డులు సృష్టించారు. కాని ఇంతవర కు సోనాపూర్‌కు రోడ్డు నిర్మాణమే జరగలేదు. ఎన్నో ఏళ్లుగా సోనపూర్ గ్రామస్తులు రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు వేయకుండానే నిధులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. పంచాయతీలో గ్రామాలు లేకున్నా.. ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాలు లేవు. కాని అధికారులు ఆ గ్రామాలు ఉట్నూర్ గ్రామ పంచాయతీలో ఉన్నట్లు సృష్టించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు గ్రామాల మధ్య అనుసంధానంగా గ్రావెలింగ్ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి లక్షలాది రూపాయలు కాజేశారు. దాబా, పునగూడ గ్రామాలకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఆర్సీపీ మొదటి విడతలో భాగంగా రూ.17.50 లక్షలు కేటారుుంచారు. రూ.10.55 లక్షలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. లేని గ్రామాలకు ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు ఎలా వేశారో వారికే తెలియూలి. 2010-11 సంవత్సరంలో ఆర్సీపీ మొదటి విడతలో మంజూరైన పనుల్లో భాగంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు వేయకుండానే నిధులు కాజేశారని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారుు. ఆర్సీపీ ద్వారా నిర్మించిన రోడ్డు పనులన్నింటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారుు. విచారణ చేపడుతాం 2010-11 సంవత్సరాల్లో నేను ఇక్కడ బాధ్యతలు నిర్వహించలేదు. ఆర్సీపీ మొదటి విడతలో గ్రామాల్లో వేసిన రోడ్లన్నింటినీ పరిశీలిస్తాం. దొంగచింత నుంచి సోనాపూర్ వరకు వేసిన రోడ్డు నిర్మాణం, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాల మధ్య వేసిన రోడ్డు నిర్మాణంపై విచారణ నిర్వహిస్తాం. ఉట్నూర్ పంచాయతీలో దాబా, పూనగూడ గ్రామాలు ఉన్నాయా లేవా అనే అంశంపై విచారణ చేపడుతాం. - రమేశ్, ఈఈటీడబ్ల్యూ ఐటీడీఏ