ఊర్లే లేవు.. రోడ్డేశారట.. | Records roads guessed pieces | Sakshi
Sakshi News home page

ఊర్లే లేవు.. రోడ్డేశారట..

Published Sun, May 29 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

ఊర్లే లేవు.. రోడ్డేశారట..

ఊర్లే లేవు.. రోడ్డేశారట..

రోడ్లు వేయకుండానే వేసినట్లుగా రికార్డులు
పనులు చేయకుండానే నిధులు స్వాహా
పంచాయతీలో లేని గ్రామాల పేర్లతో పనులు

 
ఉట్నూర్ :  గ్రామ పంచాయతీలో లేని గ్రామాలను సృష్టించారు. ఆ రెండు గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్డు కూడా వేసేశారు. అలా కాంట్రాక్టర్ల ధనదాహానికి అధికారుల అవినీతి తోడైంది. ఫలితంగా రోడ్డు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ నిధులు స్వాహా చేశారు. ప్రభుత్వం రూరల్ కనెక్టివిటి ప్రాజెక్ట్(గ్రామీణ అనుసంధాన రోడ్లు)-1 పథకంలో భాగంగా మొదటి విడతలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 1,066 పనులకు గాను ప్రభుత్వం రూ.53 కోట్ల 90 లక్షల 8 వేలు కేటారుుంచింది. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించి పనులు చేపట్టారు.


 రోడ్డు నిర్మాణమే  లేదు
 ఆర్‌సీపీ(రూరల్ కనెక్టివిటి ప్రాజెక్టు)-1 పనుల్లో భాగంగా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామం నుంచి సోనాపూర్ వరకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.9.65 లక్షలు కేటారుుంచారు. దొంగచింత నుంచి సోనాపూర్‌కు రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దొంగచింత నుంచి కేవలం 60 నుంచి 70 మీటర్ల వరకు రెండు వైపులా మట్టి పోసి వదిలేశారు. అంతేగానీ సోనాపూర్ వరకు రోడ్డు నిర్మాణమే జరగలేదు. కాని అధికారులు మాత్రం రోడ్డు పూర్తి చేసినట్లు రికార్డుల్లో రాశారు. అదీగాక రోడ్డు నిర్మాణంలో భాగంగా కూలీల చెల్లింపులు రూ.25వేలుగా, మెటీరియల్‌కు రూ.9.23 లక్షలు ఖర్చయినట్లు లెక్కలేశారు. రూ.9.48 లక్షలతో పనులు పూర్తరుునట్లు రికార్డులు సృష్టించారు. కాని ఇంతవర కు సోనాపూర్‌కు రోడ్డు నిర్మాణమే జరగలేదు. ఎన్నో ఏళ్లుగా సోనపూర్ గ్రామస్తులు రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు వేయకుండానే నిధులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.


పంచాయతీలో గ్రామాలు లేకున్నా..
ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాలు లేవు. కాని అధికారులు ఆ గ్రామాలు ఉట్నూర్ గ్రామ పంచాయతీలో ఉన్నట్లు సృష్టించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు గ్రామాల మధ్య అనుసంధానంగా గ్రావెలింగ్ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి లక్షలాది రూపాయలు కాజేశారు. దాబా, పునగూడ గ్రామాలకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఆర్‌సీపీ మొదటి విడతలో భాగంగా రూ.17.50 లక్షలు కేటారుుంచారు. రూ.10.55 లక్షలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. లేని గ్రామాలకు ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు ఎలా వేశారో వారికే తెలియూలి. 2010-11 సంవత్సరంలో ఆర్‌సీపీ మొదటి విడతలో మంజూరైన పనుల్లో భాగంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు వేయకుండానే నిధులు కాజేశారని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారుు. ఆర్‌సీపీ ద్వారా నిర్మించిన రోడ్డు పనులన్నింటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారుు.


 విచారణ చేపడుతాం
2010-11 సంవత్సరాల్లో నేను ఇక్కడ బాధ్యతలు నిర్వహించలేదు. ఆర్‌సీపీ మొదటి విడతలో గ్రామాల్లో వేసిన రోడ్లన్నింటినీ పరిశీలిస్తాం. దొంగచింత నుంచి సోనాపూర్ వరకు వేసిన రోడ్డు నిర్మాణం, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాల మధ్య వేసిన రోడ్డు నిర్మాణంపై విచారణ నిర్వహిస్తాం. ఉట్నూర్ పంచాయతీలో దాబా, పూనగూడ గ్రామాలు ఉన్నాయా లేవా అనే అంశంపై విచారణ చేపడుతాం. - రమేశ్, ఈఈటీడబ్ల్యూ ఐటీడీఏ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement