Connor Esterhuizen
-
గుజరాత్ టైటాన్స్‌లోకి సౌతాఫ్రికా నయా సంచలనం
ఐపీఎల్-2026 మధ్యలో గుజరాత్ టైటాన్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హుయిజెన్తో గుజరాత్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.గతేడాది జరిగిన మినీ వేలంలో టామ్ బాంటన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బాంటన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు గుజరాత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే బాంటన్ తన గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుండడంతో.. ఇప్పుడు మొత్తం సీజన్‌కే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఎస్టర్హుయిజెన్ రూ. 75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుందిఎవరీ ఎస్టర్హుయిజెన్?24 ఏళ్ల కానర్ ఎస్టర్హుయిజెన్ గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి సిరీస్‌లోనే అద్బుత ప్రదర్శలనతో అందరిని ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్‌లలో 145.98 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడి రాకతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. జోస్ బట్లర్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎస్టర్హుయిజెన్ ఉండనున్నాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. గిల్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం! -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ టాప్-2 స్దానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. కిషన్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తాచాటాడు. ఎస్టర్‌హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్‌లో ఎస్టర్‌హ్యూజెన్ 300 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.ఇక టాప్-10లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్‌మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ? -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా క్రికెటర్ కానర్ ఎస్తురూజెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు ఎస్తురూజెన్.సంగక్కర రికార్డు బద్దలుతద్వారా శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్ బద్దలు కొట్టాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఎస్తురూజెన్ మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.ఇక బుధవారం ముగిసిన ఐదో టీ20లో ఎస్తురూజెన్ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 2009లో సంగక్కర కివీస్‌పై 69 పరుగులు చేశాడు. 33 పరుగుల తేడాతో..మ్యాచ్ విషయానికొస్తే.. క్రైస్ట్‌చర్చ్ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో కేశవ్ మహరాజ్ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు 33 పరుగుల తేడాతో.. ఆతిథ్య న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్ ద్వారానే నలుగురుసౌతాఫ్రికా ప్లేయర్లు అరంగేట్రం చేసినా... వారంతా సమయానుకూలంగా మెరిపించడంతో సఫారీ జట్టు సులువుగా సిరీస్ కైవసం చేసుకుంది.ధనాధన్ హాఫ్సెంచరీన్యూజిలాండ్ గడ్డపై దక్షిణాఫ్రికా 2012లో 2–1తో... 2017లో 1–0తో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఇక చివరిదైన ఐదో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కానర్ ఎస్తురూజెన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు) మరోసారి ధనాధన్ హాఫ్‌సెంచరీతో చెలరేగాడు.రుబిన్ హెర్మన్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), ముల్డర్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. కివీస్ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... పరుగుల రాక గగనమైంది. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 79/2తో నిలిచింది. ఈ దశలో కానర్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు.నాలుగో వికెట్‌కు ఫోరెస్టర్ (21 నాటౌట్)తో కలిసి కానర్ 27 బంతుల్లో 61 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికాకా 111 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.154 పరుగులకు పరిమితంఅనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. బెవాన్ జాకబ్స్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ జేమ్స్ నీషమ్ (24), టిమ్ రాబిన్సన్ (25), క్లీవర్ (22) తలా కొన్ని పరుగులు చేశారు.అయితే, కివీస్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో... ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కోట్జీ, ముల్డర్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్ ఎస్తురూజెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IPL 2026: ప్యాట్ కమ్మిన్స్ కీలక ప్రకటన


