consolation
-
త్వరలో మంచి రోజులు వస్తాయి
కొండపాక(గజ్వేల్): త్వరలో మంచి రోజులు వస్తాయని, బీఆర్ఎస్ శ్రేణులు అధై ర్య పడవద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల ప్రజా ప్రతినిధులు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మండల ఏర్పాటు కలను సాకారం చేశారంటూ వారు కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్న విషయాన్ని కేసీఆర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ప్రజా ప్రతినిధు ల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మునుపటిలాగే నడచుకోవాలని నిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచ్‌లు కిరణ్‌కుమార్‌చారి, మహిపాల్, కనకయ్య, ఎంపీటీసీ భూములుగౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్ : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కలి్పంచారు. విధి వంచనతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న వారికి పెద్ద కొడుకులా అండగా నిలిచి వారి కన్నీరు తుడిచి ఓదార్చారు. రైలు ప్రమాదమైనా సరే... రాష్ట్ర పరిధిలో సంభవించటంతో శనివారం రాత్రి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. సీఎం ఆదేశాలతో స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూ సోమవారం ప్రమాద స్థలానికి బయలుదేరారు. అయితే ట్రాక్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలగవచ్చని అధికారులు చెప్పటంతో అక్కడకు వెళ్లకుండా విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ నేరుగా పరామర్శించారు. మానవీయ దృక్పథంతో స్పందించి పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదం పెద్దదే అయినా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి సహకరించటంతో 24 గంటలు తిరక్కముందే ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతివ్వగలిగామని రైల్వే అధికారులు పేర్కొనటం గమనార్హం. సీఎం సైతం క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను స్వయంగా పరామర్శించి, తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ధైర్యం చెప్పారు. విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు ఢీకొనడం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస ప్యాసింజర్ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే సిబ్బంది సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రిలోను, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హుటాహుటిన చేర్చారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మానవీయ కోణంలో సకాలంలో స్పందించి ఘటన వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేయటమే కాక రాష్ట్రంలో వివిధ శాఖలను అప్పటికప్పుడు అప్రమత్తం చేసి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షించారు. ప్రతి ఒక్కరికీ పరామర్శ.. ఆదివారం అర్ధరాత్రి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో స్వల్ప గాయాలైన వారు కొందరు చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 22 మంది బాధితులకు రెండు వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ రైలు దుర్ఘటనకు సంబంధించిన చిత్రాలను చూశారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి బొత్స సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలైన వారికి ఇంకా ఏమైనా మెరుగైన వైద్యం అవసరమా అని వైద్యులను అడిగారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదని, పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు స్పష్టంగా చెప్పారు. ఉదారంగా ఎక్స్‌గ్రేషియా.. రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. స్వల్పగాయాలైన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. నెలరోజుల కన్నా ఎక్కువ రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారికి.. వైకల్యం కారణంగా ఉపాధి పొందలేని వారికి రూ.5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షల వరకూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీంతో.. క్షతగాత్రుల్లో ఎవరెవరికి ఎంత ఎక్స్‌గ్రేషియా చెల్లించాలో నిర్ణయించేందుకు డాక్టర్లతో కమిటీ వేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఈ మొత్తాన్ని మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా అందిస్తామని చెప్పారు. సీఎం ఏరియల్ సర్వే.. వాస్తవానికి రైళ్లు ఢీకొన్న ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని సీఎం జగన్ తొలుత నిర్ణయించారు. అయితే, ట్రాక్ పునరుద్ధరణ పనులు, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ దృష్ట్యా సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్లో నేరుగా విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆసుపత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకుల పరామర్శ అనంతరం విశాఖకు తిరిగివెళ్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, శంభంగి వెంకటచిన అప్పలనాయుడు, జోగారావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, రఘురాజు, వరుదు కళ్యాణి, విజయనగరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు ఉన్నారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలి. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదు. పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలి. క్షతగాత్రుల్లో కొంతమంది ఇంకా షాక్‌లో ఉన్నారు.. పూర్తిగా కోలుకున్నామని వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. మృతుడి తండ్రి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్ ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన లోకో పైలట్ సువ్వారి చిరంజీవి మృతిచెందడంతో ఆయన తండ్రి సన్యాసిరావును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. సీఎంను చూడగానే ఒక్కసారిగా సన్యాసిరావు బోరున విలపించారు. ‘ఒక్కగానొక్క కొడుకు మృతిచెందాడు.. ఈ వయసులో మాకు ఎవరు దిక్కు’.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సీఎం వెంటనే ఆయన కన్నీళ్లు తుడుస్తూ.. ‘అధైర్య పడొద్దు.. కుటుంబానికి అండగా ఉంటా’మంటూ ఓదార్చారు. కుటుంబ సభ్యుడిలా ఓదార్చారు.. వైద్యులు బాగా చూస్తున్నారా.. ఏ పనిచేస్తున్నావు.. మీది ఏ గ్రామం... దెబ్బలు ఏమైనా తగిలాయా.. అంటూ కుటుంబ సభ్యుడిలా సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను ఓదార్చారు. వైద్యులు బాగా చూసుకుంటారు, అధైర్య పడొద్దు.. మెరుగైన వైద్య సేవలు అందించమని వైద్యులకు చెప్పానని సీఎం చెప్పారు. విజయనగరం నుంచి విశాఖపట్నం కళాసీ పనికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో నేను గాయపడ్డాను. – కొల్లి ఎర్ని ఆంజనేయులు, బురదపాడు గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా ఆప్యాయంగా పలకరించి.. ఓపిగ్గా అంతా విన్నారు.. డాక్టర్లు బాగా చూసుకుంటారు.. ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అధైర్య పడొద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించి నాకు తగిలిన గాయాలు గురించి అడిగారు. నొప్పులు తగ్గాయా, ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. ఓపిగ్గా నేను చెప్పింది అంతా విన్నారు. తాపీ పనికోసం కొత్తవలస వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి రైలులో వస్తుండగా ప్రమాదంలో గాయపడ్డాను. – గదల మహాలక్ష్మినాయుడు, చుక్కవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు.. అది చాలు ఆరోగ్యం ఎలా ఉంది.. మా తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తాం. వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామని సీఎం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైద్యానికి ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. అది చాలు. – రెడ్డి రాము, ఎం.అలమండ గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా -
CM KCR: మంత్రి గంగులను పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించగా నేడు కరీంనగర్లో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రి గంగులను, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ఓదార్పునందించారు. -
నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
-
మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. (ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన) -
ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. శనివారం ఆయన కిష్టారెడ్డి కుమారుడు ఎడ్మ సత్యంకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మనో ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్ వచ్చాక కలుస్తానని చెప్పారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కిష్టారెడ్డి 1994, 2004 లో కల్వకుర్తి ఎమ్మెల్యే గా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
అశ్రునయనాలతో అంత్యక్రియలు
కణేకల్లు (రాయదుర్గం) : అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (70) అంత్యక్రియలు అభిమానులు, బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అనంతపురంలోని ఇంటి నుంచి బీఎన్ఆర్ భౌతికాయాన్ని మధ్యాహ్నం 1.40 గంటలకు స్వగ్రామమైన కణేకల్లు మండలం పెనకలపాడులోని ఇంటికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చి.. నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణీ కాపు భారతిలు బీఎన్ఆర్ భౌతికాయానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఇంటి నుంచి గ్రామశివారులో ఉన్న పొలం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సాయంత్రం 4.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బీఎన్ఆర్ సోదరులు బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డితో పాటు కుటుంబసభ్యులు మట్టిని ముట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, డిప్యూటీ మేయర్ శ్రీరాములు, కణేకల్లు మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, బొమ్మనహాళ్ మాజీ ఎంపీపీ లాలుసాబ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, నాయకులు విక్రంసింహారెడ్డి, బి.మోహన్‌రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు
బీఎన్ఆర్ మృతి బాధాకరం కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్ భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏటీపీసీ105 : బీఎన్ఆర్కు నివాళులర్పించి.. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఏటీపీసీ212 : కణేకల్లు మండలం పెనకలపాడులో బీఎన్ఆర్ అంతిమయాత్ర ఏటీపీసీ211 : కన్నీరు మున్నీరవుతున్న బీఎన్ఆర్ కుటుంబ సభ్యులు అనంతపురం : అధైర్యపడొద్దని, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (బీఎన్ఆర్) కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతూ బీఎన్ఆర్ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి.. నివాళులర్పించారు. వైఎస్ జగన్ ఉదయం 10.45 గంటలకు బెంగళూరు నుంచి నేరుగా అనంతపురం అరవిందనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన వస్తున్నారనే సమాచారం అందుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే జగన్‌తో కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. వారికి అభివాదం చేస్తూ గురునాథరెడ్డి నివాసంలోకి వెళ్లారు. బీఎన్ఆర్ భౌతికకాయానికి పూలమాల వేసి..నివాళి అర్పించారు. అన్న మృతిని తట్టుకోలేక బోరున విలపించిన బీఎన్ఆర్ సోదరులు బి.ఎర్రిస్వామిరెడ్డి, బి.రెడ్డప్పరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి్కి ధైర్యం చెప్పారు. అక్కడికి కూడా నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో రావడంతో...బీఎన్ఆర్ కుటుంబ సభ్యులందరితో మరో గదిలోకి వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తాను ఇటీవల హైదరాబాద్‌లో ఆస్పత్రికి వెళ్లి బీఎన్ఆర్ అన్నను పరామర్శించానని, ఆ సమయంలో ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారని అన్నారు. శనివారం రాత్రి దాకా కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన పలువురి నాయకులతో ఫోన్లోనూ, నేరుగానూ బాగా మాట్లాడారని, ఆదివారం ఉదయం ఉన్నపళంగా అపస్మారక స్థితికి చేరుకుని మరణించారని ఎర్రిస్వామిరెడ్డి బోరున విలపించారు. ‘కుటుంబానికి నువ్వే పెద్దవాడివి. అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా డీలా పడితే ఎలా?’ అంటూ జగన్ ఓదార్చారు. అలాగే కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినీ పలకరించారు. రామ్మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాలకు పరామర్శ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా బలపనూరుకు చెందిన పుల్లారెడ్డి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, కోడలు మాధవి, మనవరాలు అనూష మృతి చెందారు. వీరి కుటుంబం అనంతపురం సాయినగర్‌లో స్థిరపడింది. వైఎస్ జగన్ వీరి ఇంటికి వెళ్లి రామ్మోహన్‌రెడ్డి కుమారుడు అనుదీప్, సోదరుడు రంగారెడ్డిని పరామర్శించారు. అలాగే ఇటీవల మునిసిపల్ మాజీ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి మృతి చెందారు. ఆయన కుమారుడు అంబటి తిరుమలరెడ్డి, కోడలు అంబటి లక్ష్మీని కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా ఇన్చార్జ్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ, నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి కవిత, ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఉషశ్రీచరణ్, రమేష్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మడకశిర గోవర్దన్‌రెడ్డి, పులివెందుల దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, లింగాల శివశంకర్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, గౌస్‌బేగ్, ఎల్ఎం మోహన్‌రెడ్డి, పామిడి వీరాంజనేయులు, బోయ సుశీలమ్మ, పాలే జయరాంనాయక్, కొర్రపాడు హుసేన్‌పీరా, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మీసాల రంగన్న, మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, కసునూరు రఘునాథ రెడ్డి, మారుతీప్రకాష్, సోమశేఖర్ రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. -
ఏ దేవుడికి... ఏ ప్రసాదం?
ఒక నిమిషం–ఒక విషయం షోడశోపచారాలతో దైవాన్ని పూజించడం మనం ఆచారం. అందులో పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టడం ముఖ్యం. అయితే ఒక్కోదేవుడికి ఒక్కో ప్రసాదమంటే ప్రీతికరం. ఏ దేవుడికి లేదా దేవతకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో తెలుసుకుని, దానిప్రకారం మన అవకాశాన్ని బట్టి అదే నైవేద్యం పెడితే మంచిది. వేంకటేశ్వర స్వామికి: వడపప్పు, పానకం; వినాయకుడికి: బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు; ఆంజనేయుడికి: అప్పాలు, లడ్డూలు, శెనగలు; సూర్యుడికి: ఆవుపాలతో చేసిన పాయసం, మొలకెత్తిన పెసలు; లక్ష్మీదేవికి: క్షీరాన్నం, పండ్లు; సత్యనారాయణస్వామికి: ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కలిపి చేసిన ప్రత్యేక ప్రసాదం; దుర్గాదేవికి: మినపగారెలు, అల్లం ముక్కలు; షిర్డీ సాయిబాబాకి: పాలు, గోధుమ రొట్టెలు, పాలకోవా; శ్రీకృష్ణుడికి: అటుకులతోకూడిన తీపి పదార్థాలు, వెన్న; శివుడికి: కొబ్బరికాయ, అరటిపండ్లు. సంతోషిమాతకు: పులుపులేని పిండివంటలు, తీపిపదార్థాలు; సరస్వతీదేవికి: రేగుపండ్లు, వెన్న, పేలాలు, కొబ్బరి, పాయసం. ఒక ఘటన సీతాదేవి అశోకవనంలో ఒక చెట్టుకింద కూర్చొని ఉంది. రావణుడు, అతడి అనుచరులూ పరుషపు మాటలతో పెట్టే హింసలకు ఆమె ఎంతగానో తల్లడిల్లిపోయింది. తన జాడ తన పతికి తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చే వీలూ లేదు. తానేమి చేయాలో దిక్కు తోచలేదు. దాంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడింది. సరిగ్గా అదే సమయంలో చెట్టుకొమ్మమీద మైనాక పక్షి కూత కూస్తోందట. ఆ కూత ఎలా ఉన్నదంటే, వేదాధ్యయనం చేసిన గురువు, తన శిష్యుని నిద్రలేపి, స్నాన సంధ్యావందనాలు, అగ్ని కార్యాన్ని, హోమాన్ని చేసుకోమని చెబుతున్నట్లు తోచిందట. ఆ కూత సీతాదేవికి ఓదార్పుగానూ, హితవచనంగానూ అనిపించిందట. అంతే! సీతాదేవికి మనసు మారిపోయింది. తాను మరణిస్తే తన పతి తట్టుకోలేడు. తాను తన నాథుని ఎప్పటికీ చూడలేదు. జీవించి ఉంటే, ఏదోవిధంగా తన జాడ తెలుస్తుంది. అప్పుడు అసుర సంహారం చేసి, తనను తీసుకొని వెళ్లగలడు... అనిపించింది. దాంతో తనకు వచ్చిన ఆత్మహత్యాలోచనను మనసు నుంచి తుడిచి వేసిందట. అంటే... అవతలి వారు తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు... ఆ దుఃఖాన్ని మనం తీర్చలేమని తెలిసినప్పటికీ, అనునయపూర్వకంగా ఒక్కమాట మాట్లాడినా లేదా కనీసం ఓదార్పుగా చేతితో స్పృశించినా అవతలి వారికి ఎంతో ఊరట కలుగుతుందని వాల్మీకి మహర్షి ఈ సంఘటన ద్వారా తెలియజెబుతున్నాడు. -
వీరులారా.. వందనం..
- అమరుల త్యాగాలు తెలుసుకుని కన్నీటిపర్యంతమైన కలెక్టర్ - వారి కుటుంబాలను గుండెలకు హత్తుకుని ఓదార్పు - అంకితభావం, త్యాగగుణమే తెలంగాణకు బలం: స్మితా సబర్వాల్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమం ప్రతి మలుపులోనూ ఓ వీరుని మరణం ఉంటుంది. ఓ తల్లి కన్నీటి వేదన ఉంటుంది. గమ్యం ముద్దాడే వరకూ వెరవని వీరత్వం ఈ గడ్డది. ఆరిపోతున్న కొలిమికి పొరకయి నిప్పులు రాజేసిన పోరగాళ్లు.. పోలీసు లాఠీలకు.. తూటాలకు బతుకంతా పొక్కిలయినా.. బిగించిన పిడికిలి విడవని విద్యార్థి వీరులు.. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని త్యాగాలు ఈ నేల మీద జరిగాయి. 60 ఏళ్ల ఉద్యమం తనకుతాను హింసించబడిందే కాని, ఎక్కడా హింసకు పాల్పడ లేదు. ‘ప్రత్యేక’ ఆకాంక్ష కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర ఇక్కడి బిడ్డలది. ‘తెలంగాణ కోసం రాజీనామా చేసిన నేతలందరినీ గెలిపిస్తే.. ‘నీకు ప్రాణాలు అర్పించుకుంటా తల్లీ’ అంటూ కట్టమైసమ్మ ఆలయం ఎదుట ఎదుట ఆత్మార్పణం చేసుకున్న విద్యార్థి బసంత్‌పూర్ ఇషాంత్‌రెడ్డి.. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం నా చావుతో కళ్లు తెరవాలంటూ’ పురుగుల మందు తాగిన చింతకింది మురళి... తెలంగాణ ఉద్యమ సమయంతో కేసీఆర్ అరెస్టుకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న మునుగూరి శ్రీకాంత్.. ఇంకా మోదుగపూల వనంలో రాలిన పువ్వులెన్నో.. ఇలాంటి వీరులగన్న తల్లులకే కాదు..! వాళ్ల త్యాగాలు విన్న ఏ తల్లికైనా గుండె బరువెక్కుతుంది. తెలంగాణ ఆవిర్భావ సంబురాల్లోనూ ఆదే దృశ్యం పునరావృతమైంది. తెలంగాణ అమరవీరుల సాహసాలను, త్యాగాలను విని కలెక్టర్ స్మితా సబర్వాల్ కన్నీళ్లు పెట్టారు. అమరవీరుల తల్లిదండ్రులను గుండెలకు హత్తుకున్నారు. వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండంగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సోమవారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన అమర వీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.‘ సంఘటిత శక్తి, చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, త్యాగ గుణాన్ని, ప్రదర్శించే మానవ సమాజం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక బలం’ అని ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యానించారు.