Consultative Committee
-
‘ఉమ్మడి’పై న్యాయ కమిషన్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై 22వ న్యాయ కమిషన్ బుధవారం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. ప్రజలతోపాటు గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను సేకరిస్తోంది. 21వ న్యాయ కమిషన్ గతంలో సంప్రదింపులు జరిపింది. ఈ కమిషన్ కాలపరిమితి 2018 ఆగస్టులో ముగిసింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది అత్యంత సున్నితమైన అంశం కావడంతో తాజాగా మరోసారి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్ని నిర్ణయానికి 22వ న్యాయ కమిషన్ వచ్చింది. -
విమర్శిస్తే దేశద్రోహం కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని విమర్శించినంత మాత్రన దేశద్రోహంగా పరిగణించరాదని. హింస, చట్టవిరుద్ధ మార్గాల్లో ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం ఉన్నట్టు వెల్లడైతేనే దేశద్రోహంగా పరిగణించాలని లా కమిషన్ స్పష్టం చేసింది. బ్రిటన్ నుంచి మనం ఐపీసీ సెక్షన్ 124ఏను సంగ్రహించగా ఆ దేశం పదేళ్ల కిందటే దేశద్రోహ చట్టాలను రద్దు చేసిందని పేర్కొంది. అలాంటి నియంతృత్వ చట్టాలను కొనసాగించేందుకు బ్రిటన్ సుముఖంగా లేదని తెలిపింది. దేశద్రోహంపై సలహా పత్రంపై లా కమిషన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వంటి దేశాల్లో రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేలా దేశద్రోహ చట్టాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేశాన్ని విమర్శించడం దేశద్రోహంగా పరిగణించరాదని, సానుకూల విమర్శలను దేశం స్వాగతించకుంటే స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులకు పెద్దతేడా ఉండదని వ్యాఖ్యానించింది. విమర్శించే హక్కు, సమర్ధించుకునే హక్కు భావప్రకటనా స్వేచ్ఛ కింద కాపాడాలని సలహా పత్రంలో లా కమిషన్ పేర్కొంది. -
డిజిటల్ మీడియాతో సమాచార బదిలీ: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రజలతో విస్తృత స్థాయిలో సంభాషించడానికి, సమాచార బదిలీకి డిజిటల్ మీడియా సమర్థవంతమైన వేదిక అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆయన ‘హార్నెసింగ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా’ అనే అంశంపై సమాచార మంత్రిత్వశాఖకు సంబంధించిన కన్సల్టివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ మీడియాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వివిధ సోషల్ మీడియా వేదికల అనుసంధానం కోసం, ప్రజలతో ముఖాముఖి సంభాషణల కోసం ‘టాకథాన్’ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. పలు సోషల్ మీడియా వేదికల అనుసంధానమే టాకథాన్ అని, దీనిలో ఫేస్బుక్, ట్విటర్ల నుంచి వచ్చిన ప్రశ్నలకు యూట్యూబ్‌లో ప్రత్యక్ష సమాధానాలు ఉంటాయన్నారు. ప్రజా అవసరాలను తీర్చడానికే దూరదర్శన్ యాప్‌ను రూపొందించామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా దాదాపు వంద మహాత్మా గాంధీ సంకలనాలను డిజిటలైజ్ చేయడానికి పబ్లికేషన్ డివిజన్ డెరైక్టరేట్ చర్యలను తీసుకోనునుందని తెలిపారు. ముఖ్యమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలను, సోషల్ మీడియా పాత్రను సమాచార శాఖ కార్యదర్శి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. -
రూ. 5195
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కింద రూ. 5195.47 కోట్లను మంజూరు చేయాలని జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీసీసీ ప్రత్యేక సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. లీడ్ డిస్ట్రిక్ట్ చీఫ్ మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి వార్షిక రుణ ప్రణాళిక గురించి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3845.10 కోట్ల రుణ లక్ష్యానికిగాను రూ. 3838.93 కోట్లను (99.85 శాతం) పంపిణీ చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడు వార్షిక రుణ ప్రణాళిక ద్వారా వివిధ రంగాలకు అదనంగా 17.45 శాతం రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ప్రాధాన్యత రంగాలకు 4419.26 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 14.93 శాతం అధికం. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 3284.60 కోట్లు కేటాయించారు. గత ఏడాదికన్నా ఇది 16.40 శాతం అధికం. స్వల్పకాలిక పంట రుణాల కింద రూ. 2372.39 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇది గత ఏడాది కంటే 18.34 శాతం ఎక్కువ. వ్యవసాయ టర్మ్ లోన్స్ కింద రూ. 281.75 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గత సంవత్సరం కన్నా 10.96 శాతం అధికం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం 216.09 కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా తీర్మానించారు. ప్లాంటేషన్ హార్టికల్చర్ ఫార్మింగ్ కింద 13.87 కోట్లు రుణాలను మంజూరు చేయాలన్నది ఈ యేటి లక్ష్యం. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు రూ. 630.46 కోట్లు, వ్యవసాయేతర రుణాల కింద రూ. 307.85 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 826.81 కోట్లు, అప్రాధాన్యత రంగాలకు రూ. 776.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం శ్రీనివాసులు, సిండికేట్బ్యాంకు ఏజీఎం శేఖర్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుబ్రమణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.