న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై 22వ న్యాయ కమిషన్ బుధవారం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. ప్రజలతోపాటు గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను సేకరిస్తోంది. 21వ న్యాయ కమిషన్ గతంలో సంప్రదింపులు జరిపింది.
ఈ కమిషన్ కాలపరిమితి 2018 ఆగస్టులో ముగిసింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది అత్యంత సున్నితమైన అంశం కావడంతో తాజాగా మరోసారి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్ని నిర్ణయానికి 22వ న్యాయ కమిషన్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment