Consumer Disputes Commission
-
నీ రైట్ కోసం ఫైట్!
నగరాల్లోని వారికీ తెలియక..ఇతర దేశాల్లో వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యత ఎక్కువ. మన దేశంలో అంతంత మాత్రమే. చట్టాలున్నా వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం ఉంది. గ్రామీణ ప్రజలే కాదు.. నగరాల్లోని వారికి కూడా వినియోగదారుల కమిషన్లను ఎలా ఆశ్రయించాలో తెలియదు. చెప్పుకోవడానికే చట్టాలు అన్నట్టుగా వ్యవస్థ తయారైంది. ప్రభుత్వం ఇతర కోర్టులతోపాటు ఈ కమిషన్లనూ అభివృద్ధి చేసి, ప్రజల చెంతకు చేర్చాలి. చట్టప్రకారం జిల్లాకో కమిషన్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే దగ్గరలో సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది.– ఆకాశ్ బాగ్లేకర్, న్యాయవాది, వినియోగదారుల చట్టాల పుస్తక రచయిత సాక్షి, హైదరాబాద్:⇒ దుర్గాభాయ్ దేశముఖ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి బేగంపేట్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపులో రూ.66 వేలు వెచ్చించి ఓ టీవీ కొనుగోలు చేశారు. కొన్ని రోజులకే టీవీ పనిచేయడం మానేసింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించి మరమ్మతులు చేయించినా లాభం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పరిశీలించిన కమిషన్.. రూ.66 వేలు రీఫండ్ చేయాలని, అదనంగా రూ.13 వేలు పరిహారం, రూ.5 వేలు కేసు ఖర్చుల కింద వినియోగదారుడికి ఇవ్వాలని ఆదేశించింది. మరో రూ.5 వేలు కన్జ్యూమర్ లీగల్ ఎయిడ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.⇒ అధిక బరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తి బరువు తగ్గించే చికిత్స కోసం ఒక ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థను సంప్రదించారు. ఈ మేరకు చికిత్స అందిస్తామని హామీ ఇచ్చిన సంస్థ.. రూ.1,30,000 ఫీజును ఈఎంఐ రూపంలో వసూలు చేసింది. కానీ ఆయన ఎంతకీ బరువు తగ్గకపోగా ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో తాను చెల్లించిన మొత్తం రీఫండ్ చేయాలని సంస్థను కోరారు. కానీ సంస్థ స్పందించకపోవడంతో.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్ రూ.1,30,000 సొమ్మును 12 శాతం వడ్డీతో కలిపి రీఫండ్ చేయాలని.. కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది...వస్తువులు, సేవల్లో లోపాల వల్ల ప్రజలు నష్ట పోయిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు విని యోగదారుల కమిషన్లు తీసుకున్న చర్యలు ఇవి. కానీ మనలో చాలా మందికి సరైన అవగాహన లేక, నష్టపోయినా భరించి ఊరుకుండిపోతున్నారు.చట్టం ఎంత బలంగా ఉన్నా.. అమల్లో నిర్లక్ష్యం ఉంటే ఫలితం శూన్యం. ఎవరికోసమైతే ఆ చట్టం చేశామో.. అదొకటి ఉందని వారికి తెలియక పోతే నిష్ప్రయోజనం. అలాంటివే వినియోగదారుల చట్టాలు. గ్రామీణులకే కాదు నగరాల్లో ఉండే వారికి కూడా వాటిపై అవగాహన అంతంతే. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లోనూ వినియోగదారుల హక్కులేమిటో తెలియని వారు కోకొల్లలు. ప్రభుత్వం కూడా వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించడంపై ఫోకస్ పెట్టని పరిస్థితి. ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు ఏవో కార్యక్రమాలు నిర్వహించడం మినహా పెద్దగా చేస్తున్నదేదీ లేదు. నిజానికి వినియోగదారులు కాని ప్రజలంటూ ఎవరూ ఉండరు. అందుకే అందరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. సేవలను హక్కుగా పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.2020లో మార్పులు చేశాక..1986 నుంచి ఉన్న వినియోగదారుల చట్టంలో మార్పులు చేర్పులు చేసి వినియోగదారుల రక్షణ చట్టం–2019ను రూపొందించారు. అది 2020 జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగ దారుల ఫిర్యాదు లను మరింత వేగంగా పరిష్కరించడా నికి ఇది దోహదం చేస్తోంది. ఈ చట్టం ద్వారా సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటె క్షన్ అథారిటీ (సీసీపీఏ)ని స్థాపించారు. దీనిద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ, పరిరక్షిస్తు న్నారు. అలాగే వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్ మార్చారు.వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి..⇒ వస్తువు లేదా సేవ కోసం చేసిన ఖర్చు విలువ రూ.50 లక్షల వరకు అయితే.. జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. రూ.2 కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్‌లో, అంతకుమించితే జాతీయ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేయాలి.⇒ రాష్ట్ర కమిషన్‌తోపాటు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.⇒ ఆన్లైన్ ద్వారా లేదా కమిషన్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ⇒ దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.వినియోగదారుల కమిషన్ల వివరాలివీ..జాతీయ వినియోగదారుల కమిషన్..ఉపభోక్య న్యాయభవన్ఎఫ్ బ్లాక్, జీపీవో కాంప్లెక్స్ఐఎన్ఏ, న్యూఢిల్లీ–110023ఈ–మెయిల్: ఎన్సీడీఆర్సీ ఎట్‌దిరేట్ ఎన్ఐసీ డాట్ ఇన్ఫోన్ నంబర్: 011–24608724⇒ ఇందులో అధ్యక్షుడితోపాటు 11 మంది సభ్యులు ఉంటారు. నేరుగా వేసే పిటిషన్లతోపాటు అప్పీళ్లను కూడా ఎన్సీడీఆర్సీ విచారణ చేస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం–2019లో పేర్కొన్న నిబంధనల ప్రకారం జాతీయ కమిషన్ పనిచేస్తుంది.తెలంగాణ రాష్ట్ర కమిషన్..ఏరువాక బిల్డింగ్, శ్రీధర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా.., ఆనంద్‌నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్ఈ–మెయిల్: ఎస్సీడీఆర్సీ–టీఎస్ ఎట్‌దిరేట్ ఎన్ఐసీ డాట్ ఇన్మీనా రామనాథన్, ఇన్చార్జి అధ్యక్షురాలు, ఫోన్: (040) 23394399కె.రంగారావు, సభ్యుడు, ఫోన్: (040) 23394399వీవీ శేషుబాబు (జ్యుడీషీయల్) సభ్యుడు..ఆర్ఎస్ రాజశ్రీ, సభ్యురాలు..వీపీ వెంకటరమణమూర్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఫోన్: 23394399రెండేళ్లలోపు కేసు వేయాలి..⇒ వినియోగదారుల కమిషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరికి అవగాహన ఉన్నా.. కమిషన్‌ను ఎలా సంప్రదించాలో తెలియదు. కాజ్ ఆఫ్ యాక్షన్ (సమస్య ఎదురైనప్పటి) నుంచి రెండేళ్లలోపు కేసు దాఖలు చేయాలి. తర్వాత పెడితే కేసు చెల్లదు. ఏవైనా బలమైన కారణాలుంటే సెక్షన్ 24ఏ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. కొందరు అనవసర కేసులు వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీంతో నిజంగా లబ్ధిపొందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు.– మీనా రామనాథన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్చార్జి అధ్యక్షురాలుమధ్యంతర ఉత్తర్వులిస్తాం..⇒ రాష్ట్ర కమిషన్‌కు ఎక్కువగా అప్పీల్ కేసులు వస్తున్నాయి. దీంతో పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కమిషన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓ బిల్డర్ వద్ద ప్లాట్ కొనుగోలు చేశారు. బిల్డర్ ఆ ప్లాట్‌ను రిజిస్టర్ చేయకుండా మరొకరికి అమ్ముతున్నప్పుడు కమిషన్‌ను సంప్రదిస్తే.. ఆ లావాదేవీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంటుంది. – పి.భాస్కర్, కోర్టు ఆఫీసర్, రాష్ట్ర కమిషన్చదువుకున్నా అవగాహన తక్కువే..⇒ డిగ్రీ చదివినా కూడా నాకు వినియోగదారుల కమిషన్‌ను ఎలా ఆశ్ర యించాలో తెలియదు. ఎక్కడా ఎలాంటి అవగా హన కార్యక్రమం చేపట్టగా చూడలేదు. కోర్టులు తెలుసుగానీ, వినియోగదారుల కమిషన్‌లో ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.– ఉపేందర్‌రెడ్డి, ఉప్పల్, హైదరాబాద్⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌సీడీఆర్‌సీ ఏర్పాటైంది. 2015లో తొలి అధ్యక్షుడిగా జస్టిస్ బీఎన్.రావు నియమితుల య్యారు. 2018 వరకు పనిచేశారు. తర్వాత జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ నియమితులయ్యారు.⇒ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు ఒక జిల్లా కమిషన్ ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం మూడు కమిషన్లు ఉన్నాయి.⇒ జిల్లా వినియోగదారుల కమిషన్లలో నేరుగా వినియోగదారుడే వాదనలు వినిపించుకోవచ్చు లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.⇒ న్యాయస్థానాలే అయినా వినియోగదారులు స్థానిక భాషలో వాదనలు వినిపించుకునే అవకాశం ఉంది.⇒ జిల్లా కమిషన్‌కు రాష్ట్ర కమిషన్, రాష్ట్ర కమిషన్‌కు జాతీయ కమిషన్ అప్పీలేట్గా వ్యవహరిస్తాయి. జాతీయ కమిషన్ తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్ చేయవచ్చు. ఇతర ఏ కోర్టులూ ఈ తీర్పుల్లో జోక్యం చేసుకోలేవు.హైదరాబాద్ జిల్లా కమిషన్లు..జిల్లా వినియోగదారుల కమిషన్–1, 2, 3చంద్రవిహార్ కాంప్లెక్స్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ఫోన్ నంబర్లు: 040–24733368, 040–24747733, 040–24746001రంగారెడ్డి జిల్లా కమిషన్..రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ఎన్టీఆర్ నగర్, ఎల్బీనగర్, రంగారెడ్డి ఫోన్: 040–24031275 -
ఎన్ని చేసినా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కథంతే! కొత్త వాహనం కొనివ్వండి
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ స్కూటర్ సేవా లోపంతో మానసిక వేదనకు గురైన ఫిర్యాదు దారుడికి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఊరట లభించింది. లోప భూయిష్టమైన పాత వాహనం స్థానంలో కొత్త స్కూటర్ ఇవ్వడం.. లేదంటే స్కూటర్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం, మరమ్మతు ఖర్చులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి రూ.77,657ను 6 శాతం వడ్డీతో వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి లెక్కగట్టి చెల్లించాలంటూ కిషోర్‌కుమార్, నారాయణరెడ్డి, నజీమాకౌర్తో కూడిన కర్నూలు జిల్లా కమిషన్ ఈనెల 25న తెలుగులో తీర్పు వెలువరించింది. ఫిర్యాదీ కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన శంకరశర్మ మానసిక వేద నకు గురైన కారణంగా రూ.10 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేలు అదనంగా అందించాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు నజీమా కౌర్ తీర్పు చదవి వినిపించారు. శంకరశర్మ రాజస్థాన్‌లోని ఒకినావా ఆటో టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని 2018 మే నెలలో రూ.72,900కు కొనుగోలు చేయగా.. అదే ఏడాది ఆగస్టులో డెలివరీ చేశారు. కొన్నప్పటి నుంచీ వాహనం మొరాయించేది. మరమ్మతులు చేసినా ఫలి తం లేపోయింది. ఈ క్రమంలో ఆయన తనకు న్యాయం చేయాలంటూ 2021 సెప్టెంబర్ 25న కమిషన్‌ను ఆశ్రయించారు. వాదనలు విన్న కమిషన్ ఈ నెల 10న తుది విచారణ చేపట్టి.. తయారీసంస్థతోపాటు ఇద్దరు డీలర్లు కొత్త వాహనం లేదా తాము సూచించిన విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. -
డీ మార్ట్‌కి షాక్! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక
కస్టమర్లతో వ్యవహరించే తీరులో డీ మార్ట్ యాజమాన్యం వైఖరి సరిగా లేదంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కన్నెర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలంటూ తేల్చి చెప్పింది. నలభై ఐదు రోజుల్లోగా ఈ పరిహారం అందివ్వకపోతే ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశంలోనే నంబర్ వన్ రిటైల్ స్టోర్‌గా డీ మార్ట్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. వస్తువులు కొనడం కంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఎక్కువగా వేచి చూడాల్సినంత బిజీగా డీ మార్ట్ స్టోర్లు ఉంటాయి. అయితే బిల్లింగ్ పూర్తయిన తర్వాత సంచి లేకపోతే డీమార్ట్ వాళ్లే అక్కడ క్యారీ బ్యాగ్‌ను అందిస్తారు. ఇలా క్యారీ బ్యాగ్ అందించే విషయంలో చెలరేగిన వివాదంపై తాజాగా తీర్పును ప్రకటించింది వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. నగరంలోని హైదర్‌గూడలో ఉన్న డీమార్ట్ స్టోరులో 2019 నర్సింహ మూర్తి అనే వ్యక్తి రూ.479 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. బిల్లింగ్ సమయంలో ఆ సామన్లు పట్టుకెళ్లేందుకు డీమార్ట్ లోగో ముద్రించి ఉన్న క్యారీ బ్యాగ్‌ను అందించారు. అయితే డీమార్ట్ లోగోతో ఉన్న క్యారీ బ్యాగుకు రూ.3.50 ఛార్జ్ చేస్తూ బిల్లులో దాన్ని చేర్చారు. క్యారీబ్యాగుకి రూ.3.50 ఛార్జ్ చేయడాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎదుటకు తీసుకెళ్లాడు నర్సింహ మూర్తి. ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డీమార్ట్‌ను తప్పు పట్టింది. కస్టమర్లకు అందించే బ్యాగులకు ఛార్జ్ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. కస్టమర్లకు బ్యాగులు అందించినందుకు ఛార్జ్ వసూలు చేయొద్దంటూ తేల్చి చెప్పింది. బాధితుడికి పరిహారంగా రూ.10,000 ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నలభై ఐదు రోజుల్లోగా పరిహాం ఇవ్వకపోతే ఆలస్యం జరిగిన కాలానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది. చదవండి: 'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ! -
మూడు రూపాయలకు కక్కుర్తి పడితే?
ఓవైపు అలసిపోయి ఉన్నాం.. మరోవైపు ఆకలేస్తోంది.. ఇంకే చేస్తాం ఫోన్ ఆన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. నిమిషాల్లో వేడివేడిగా ఆహారం వచ్చేస్తుంది. ఇట్స్ సింపుల్ అనుకుంటున్నారేమో? కానీ ఫుడ్‌తో పాటు అడ్డగోలు ట్యాక్సులు కూడా మనకు డెలివరీ అవుతున్నాయ్. మన జేబులకు చిల్లులు పెడుతున్నాయ్. డిజిటల్ వాలెట్లకు కన్నం వేస్తున్నాయ్. ఇలాంటే ఘటనకు సంబంధించి అడ్డగోలు ట్యాక్సులపై కన్నెర్ర చేసింది వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థ. బిర్యానీ ఆర్డర్ చేస్తే నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన మురళీ కుమార్ రెడ్డి 2019 సెప్టెంబరు 8న స్విగ్గీ ద్వారా ముషీరాబాద్‌లో ఉన్న ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు. మెనూలో ఆ బిర్యానీ ధర రూ.200లు ఉండగా.. కూపన్ అప్లై చేసిన తర్వాత డిస్కౌంట్ ప్రైస్‌తో రూ.140కే వచ్చింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధరపై పన్ను విధించాలి. కానీ స్విగీ ఎంఆర్పీపై పన్ను విధించింది. ఇదేం పద్దతి జీఎస్టీ నిబంధనల ప్రకారం బిర్యానీ ధర రూ.140 అయినందున జీఎస్టీగా రూ.7లు పన్ను విధించాలి. కానీ స్విగ్గీ అలాకాకుండా తనకు ఎంఆర్పీ రూ.200లపై జీఎస్టీగా రూ.10 విధించి అదనంగా రూ.3 ట్యాక్స్ వసూలు చేసిందంటూ వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థను ఆశ్రయించాడు మురళీ కుమార్‌రెడ్డి. వినియోగదారుడిగా తన హక్కులు కాపాడుతూ అధిక జీఎస్టీ వసూలుపై స్విగ్గీని ప్రశ్నించాలని అతను కోరాడు. పరిహారం అనేక వాదప్రతివాదనలు పూర్తైన తర్వాత జీఎస్టీ పన్ను వసూలు విషయంలో స్విగ్గీ తప్పు చేసినట్టుగా వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థ భావించింది. దీంతో బాధితుడికి రూ.2000లు పరిహారంగా చెల్లించాలంటూ ఆదేశించింది. అదే విధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.1000 కూడా ఇవ్వాలంటూ పేర్కొంది. కాగా ఈ తీర్పుపై తప్పు తమది కాదంటే తమది కాదంటూ ఇటు రెస్టారెంట్, స్విగ్గీలు ఎదుటివారిపై నెపం మోపుతున్నాయి. చదవండి: ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా -
జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఫైన్.. కారణం ఇదే!
శంషాబాద్‌లో ఉన్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్ గ్రూప్‌కి జరిమానా పడింది. ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాలు కారణంగా ఈ ఫైన్‌ని తెలంగాణ కన్సుమర్ డిస్ప్యూట్ రిడ్రెస్సల్ కమిషన్ విధించింది. ఘటన జరిగింది ఇలా సుబ్రతో బెనర్జీ అనే వ్యక్తి 2014 సెప్టెంబరు 10న బెంగళూరు వెళ్లేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు ఎస్కలేటర్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా జర్క్ ఇచ్చి ఆగిపోయింది. దీంతో సుబ్రతో బెనర్జీ కింద పడిపోగా ఎస్కలేటర్‌పై ఉన్న ఇతర వ్యక్తులు ఆయనపై పడిపోయారు. దీంతో ఆయన గాయపడ్డారు. 75 రోజుల పాటు ఆఫీసుకు వెళ్లలేకపోయారు. ఎయిర్‌పోర్టులో తనకు కలిగిన అసౌకర్యంపై ఆయన ఫిర్యాదు చేశారు. మా తప్పేం లేదు సుబ్రతో ఆరోపణలపై ఎయిర్‌పోర్టు యాజమాన్యం వాదిస్తూ... ఎస్కలేటర్‌పైకి ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ లోడ్ అయ్యిందని, దీంతో ఎస్కలేటర్ నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆగిందని తెలిపింది. ఎస్కలేటర్ ఎప్పుడు ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి రాదని చెప్పింది. సుబ్రతో రాయ్ అజాగ్రత్తగా ఉండటం వల్లే పడిపోయాడని ఎయిర్‌పోర్టు యాజమాన్యం న్యాయస్థానంలో వాదించింది. పైగా గాయపడ్డ సుబ్రతో బెనర్జీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని, గుడ్‌విల్‌గా రూ. 1.51 లక్షలు చెల్లించినట్టు వివరించింది. ఫైన్ చెల్లించండి ఎయిర్‌పోర్టు వాదనపై సుబ్రతో విబేధించారు. ఆస్పత్రిని నుంచి డిస్ఛార్జ్ అయి వెళ్లిన తర్వాత తనకు తిరిగి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ఆపరేషన్ జరిగిందని వివరించారు. దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యానంటూ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిషన్ ఎయిర్‌పోర్టు అథారిటీదే తప్పుగా తేలచ్చింది. బాధితుడికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. అందువల్లే ఫైన్ ఎస్కలేటర్ వ్యవహారంలో తమ తప్పు లేదంటూ ఎయిర్‌పోర్టు యాజమాన్యం వాదించగా అందుకు తగ్గట్టుగా సీసీ కెమెరా ఫుటేజీ చూపించాల్సిందిగా కమిషన్ కోరింది. అయితే ఆ ఫుటేజీని న్యాయస్థానం ముందు ఉంచడంలో ఎయిర్‌పోర్టు యాజామన్యం విఫలమైంది. ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు నిర్వాహణ బాధ్యతలు చూస్తూ సీసీ ఫుటేజీ లేకపోవడం.. నిర్లక్ష్యానికి ఉదాహారణగా కమిషన్ భావించింది. బాధితుడి ఆరోపణలో వాస్తవం ఉందని నమ్ముతూ అతనికి పరిహారం చెల్లించాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. చదవండి : పైసల కోసమే ఫేస్బుక్ కక్కుర్తి! ఛస్.. లాజిక్ లేదన్న మార్క్ -
డీమార్ట్, ప్యారడైజ్‌కు భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ లోని డీమార్ట్ షాపింగ్ మాల్, ప్యారడైజ్ రెస్టారెంట్లకు ఊహించని షాక్ తగిలింది. వినియోగ దారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం ఆదనంగా చార్జీలు వసూలు చేస్తున్నందుకు తాజాగా వినియోగదారుల పోరమ్ జరిమానా విధించింది. హైదర్‌గూడ డీమార్ట్ బ్రాంచ్‌కు, సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైజ్ రెస్టారెంట్లకు వినియోగదారుల ఫోరమ్ కోర్టు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్ తీర్పు చెప్పింది. కాగా, విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయగా క్యారీ బ్యాగ్స్ కోసం రూ.4.76 చార్జ్ చేశారు. 2019 జూన్‌లో హైదరాగూడ డీమార్ట్ నుంచి సామాగ్రి కోనుగొలు చేయగా అక్కడ కూడా క్యారీ బ్యాగ్ కోసం రూ. 3.75 వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో కమిషన్ తాజా తీర్పునిచ్చింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం -
ఉల్లి నిల్వ పరిమితి కుదింపు
న్యూఢిల్లీ: ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు ప్రకటించింది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వల పరిమితిని 25 టన్నులు, 5 టన్నులకు కుదించింది. ఉల్లి సరఫరాను పెంచినప్పటికీ ధరలు గత కొద్ది వారాలుగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభకు వినియోగదారుల వ్యవహారాల శాఖ దన్వే రావ్ చెప్పారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఉల్లి నిల్వల వివరాలను రోజువారీగా సమర్పించాలని ఆదేశించామని తెలిపారు. దేశంలోని నగరాల్లో ఉల్లి గడ్డల ధర కిలో రూ.75 నుంచి రూ.100 వరకు ఉంది. సరాసరి ధర కిలో రూ.75 కాగా అత్యధికంగా పోర్ట్బ్లెయిర్లో రూ.140 వరకు పలుకుతోందని కేంద్రం తెలిపింది. -
దింపినందుకు రూ.35 లక్షల జరిమానా
చండీగఢ్: ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ జెట్ ఎయిర్వేస్, ఎయిర్ కెనడా సంస్థలను ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు. తొలుత ఢిల్లీ వెళ్లేందుకు మొహాలీలోని చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ ఎయిర్వేస్ విమానమెక్కారు. తర్వాత ఢిల్లీలో ఎయిర్ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు తీషా తాళంవేసి ఉన్న వాష్‌రూం వద్ద చాలాసేపు ఆగి చివరకు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ కేకలువేస్తూ మినాలీ, ఆమె కుమార్తె, కొడుకును విమానం నుంచి బలవంతంగా విమాన సిబ్బంది దింపేశారు. వారి లగేజీని ఢిల్లీ విమానాశ్రయంలో దించకుండా టొరంటోకు తీసుకెళ్లారు. -
ప్రకృతి వైపరీత్యానికీ పరిహారం చెల్లించాల్సిందే!
రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ తీర్పు సాక్షి, హైదరాబాద్: విపత్తులతో సంభవించే నష్టానికి కూడా పరిహారం వచ్చేలా ప్రీమియం చెల్లించినప్పుడు.. వర్షంతో దెబ్బతిన్న నిర్మాణాలకు సదరు బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ తేల్చిచెప్పింది. సోమవారం ఈ మేరకు కర్ణాటకకు చెందిన కోర్‌గ్రీన్ షుగర్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.56,90,848 చెల్లించాలని హైదరాబాద్‌కు చెందిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ జస్టిస్ బీఎన్ రావు నల్లా, సభ్యుడు పాటిల్ విఠల్‌రావుల నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. 2010 డిసెంబర్ నుంచి 9 శాతం వడ్డీతో 4 వారాల్లో ఈ డబ్బు చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా తుముకూరు ప్రాంతంలో 350 ఎకరాల్లో రూ.250 కోట్లతో కోర్‌గ్రీన్ షుగర్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయాలని సంస్థ యజమానులు నిర్ణయించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా పరిహారం చెల్లించేలా రూ.2.5 కోట్లకు బీమా చేస్తూ 2009 నవంబర్ నుంచి 2011 ఏప్రిల్ 30 వరకు ప్రీమియంగా రూ.9.65 లక్షలు చెల్లించారు. పనుల్లో భాగంగా మొలాసిస్ ట్యాంకుల నిర్మాణ బాధ్యతలను చెన్నైకి చెందిన ఏసియా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించగా మొదటి ట్యాంకు నిర్మాణం పూర్తి చేసింది. అయితే రెండో ట్యాంకు నిర్మాణం సమయంలో 2010 అక్టోబర్‌లో వచ్చిన వర్షాలతో 60 శాతం పూర్తయిన ట్యాంకు పనులు దెబ్బతిన్నాయి. దీనికి పరిహారం చెల్లించాలని కోరగా నిర్మాణం సరిగా చేయలేదంటూ ఇన్సూరెన్స్ సంస్థ తిరస్కరించింది. దీంతో కోర్‌గ్రీన్ సంస్థ తమకు రూ.94.65 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది.