consumer electronic industry
-
భారత్ మార్కెట్లో జపాన్ టీవీ, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ కంపెనీ ఐవా తాజాగా భారత మార్కెట్లో మ్యాగ్నిఫిక్ పేరుతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, 4కే యూహెచ్డీ టీవీలను 32–65 అంగుళాల సైజులో రూ.29,990 నుంచి రూ.1,39,990 ధరల శ్రేణిలో అందుబాటులోకి తెచ్చింది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్ట్, ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్–4 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపుదిద్దుకున్నాయి. ఇన్‌బిల్ట్ సౌండ్ బార్ 55, 65 అంగుళాల టీవీల ప్రత్యేకత. దేశవ్యాప్తంగా 300 రిటైలర్స్ ద్వారా టీవీలను విక్రయించనున్నట్టు ఐవా ఇండియా ఎండీ అజయ్ మెహతా వెల్లడించారు.‘ఏడాదిలో రిటైలర్ల సంఖ్యను 3,500లకు చేరుస్తాం. వ్యాపార విస్తరణకు రెండేళ్లలో రూ.160 కోట్లు ఖర్చు చేస్తాం. భారత్‌లో టీవీల తయారీకై డిక్సన్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీవీలు, ఆడియో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం. 4–5 ఏళ్లలో రూ.8,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. ఇందుకు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉత్పత్తులను ప్రవేశపెడతాం’ అని వివరించారు. 1951లో ఐవా ప్రారంభమైంది. ఈ సంస్థ భారత్‌లో 2021 ఏప్రిల్‌లో రీ–ఎంట్రీ ఇచ్చింది. -
వాకింగ్ వెహికిల్.. నాలుగు కాళ్ల కారు
అదేం చోద్యం! కారుకు చక్రాలు ఉంటాయి గాని, కాళ్లేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ‘హ్యుండాయ్’ కంపెనీ తయారు చేయనున్న కారుకు నాలుగు కాళ్లు ఉంటాయి. అయితే, ఆ నాలుగు కాళ్లకూ నాలుగు చక్రాలు కూడా ఉంటాయనుకోండి. హ్యుండాయ్ కంపెనీ ఈ నాలుగు కాళ్ల కారు నమూనాను 2019 నాటి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించి, సందర్శకులను ఆకట్టుకుంది. నాలుగు కాళ్లతో అడుగులు వేసుకుంటూ ఈ కారు ఎన్ని మెట్లయినా ఇట్టే ఎక్కేస్తుంది. అంతేకాదు, ఎంత ఎత్తైన గుట్టలనైనా అవలీలగా ఎగబాకగలదు. లోపల ప్రయాణించే వారికి పెద్దగా కుదుపుల్లేకుండా, గుట్టల్లోని ఎగుడు దిగుడు ప్రయాణం సుఖప్రదంగా సునాయాసంగా సాగేందుకు వీలుగా ఈ విచిత్ర వాహనాన్ని త్వరలోనే రూపొందించడానికి హ్యుండాయ్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీని తయారీ కోసం అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. -
ఆఫర్ల మహిమ..సంచలన విక్రయాలు
కోల్ కత్తా: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి దివాళి చాలా ముందుగానే వచ్చింది. జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం జీఎస్టీ అమలుకాబోతుండటంతో ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పించి, వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో కంపెనీలు భారీగా విక్రయాలు నమోదుచేసినట్టు తెలిసింది. గతేడాది పీక్ ఫెస్టివల్ సీజన్ లో అమ్మిన మాదిరిగా ఈ జూన్ నెలలో అధికమొత్తంలో టెలివిజన్లను, రిఫ్రిజిరేటర్లను, ఎయిర్-కండీషనర్లను అమ్మినట్టు కంపెనీలు ప్రకటించాయి. డ్యూరెబుల్ సేల్స్ ఈ నెలలో 85-90 శాతం పెరిగినట్టు కంపెనీలు తెలిపాయి. దీనికి గల ప్రధాన కారణం జీఎస్టీ అమలు కాబోతుండటంతో తాము ఆఫర్ చేసిన పెద్ద మొత్తంలో డిస్కౌంట్లేనని కంపెనీలు ప్రకటించాయి. కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుండటంతో తమ పాత స్టాక్ ను అమ్ముకోవడానికి కంపెనీలు ఈ ఆఫర్లను తీసుకొచ్చాయి. దీంతో 20-45 శాతం ఇన్వెంటరీని ఖాళీ చేసుకున్నాయి. అతిపెద్ద విక్రయ చైన్ లు రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, వివేక్స్, గ్రేట్ ఈస్టరన్, కోహినూర్ లు ఇప్పటికే తమ స్టాక్ నంతా అమ్మేసుకున్నట్టు తెలిసింది. ఈ నెలలో ఈ సంస్థల విక్రయాలు రెండింతలు నమోదైనట్టు వెల్లడైంది. భారీ మొత్తంలో డిస్కౌంట్లు తమ ఆదాయాలు కొంత మాత్రమే ప్రభావం చూపుతాయని ఈ విక్రయ చైన్స్ చెబుతున్నాయి. సాధారణంగా జూన్ నెలలో విక్రయాలు పడిపోతాయని, కానీ ఈ సారి గతేడాది కంటే భారీ మొత్తంలో 80-90 శాతం విక్రయాలు నమోదైనట్టు రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఫార్మాట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియన్ బాడే చెప్పారు. అంతేకాక ముంబైకు చెందిన విజయ్ సేల్స్, కోహినూర్ విక్రయాలు కూడా 50 శాతం నుంచి 100 శాతం పైకి ఎగిసినట్టు వెల్లడైంది. గ్రేట్ ఈస్టరన్ అయితే ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు తెలిసింది. ఎక్కువగా ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు అమ్ముడుపోయినట్టు రిటైలర్లు తెలిపారు. టెలివిజన్లకు 42-43 అంగుళాల, 55 అంగుళాల మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా వచ్చినట్టు పేర్కొన్నారు. ఓపెన్ బాక్స్ స్టాక్(డిస్ ప్లేలో ఉంచిన స్టాక్)పై 40-45 శాతం గరిష్ట డిస్కౌంట్లను ఈ రిటైలర్లు ఆఫర్ చేశాయి. వచ్చే నెల నుంచి కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ ధరలు కూడా 3-5 శాతం పెరుగబోతున్నాయి.