గ్లోబల్ టాప్-10 ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ రూపొందించిన కన్సూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివ ంతమైన టాప్-10 కంపెనీల్లో భారత్ నుంచి హెచ్డీఎఫ్సీ స్థానం పొం దింది. ఇది 7వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అగ్రస్థానంలో నిలిచింది. చమురు, గ్యాస్ విభాగంలో అంతర్జాతీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 9వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఎక్సాన్‌మొబిల్ (ఆమెరికా) ఉంది. ఇక టాప్-20లో ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు స్థానం పొందాయి. అంతర్జాతీయంగా రీజినల్ బ్యాంకుల కేట గిరికి వస్తే.. టాప్-20లో ఎస్బీఐ చోటు దక్కించుకుంది. ఇక ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు టాప్-30లో ఉన్నాయి.