ధరలు తగ్గించాలని... నేడు ధర్నాలు
నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్ సీపీ ఆందోళనలు
విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు
పట్నంబజారు (గుంటూరు): నింగినంటిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించనుంది. పేదల పక్షాన నిలిచి రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంపై పోరాడుతూ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నానాటికి పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారిందని ఆయన ఆందోళ న వ్యక్తంచేశారు.
ధరలను నియంత్రిం చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. పేదలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నింగినంటిన ధరలను అదుపు చేయాలన్న నినాదంతో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు తెలపాలని కోరారు. పార్టీ అన్ని విభాగాల నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయా నియోజకవర్గాల తహశీల్దార్ కార్యాలయాల వద్ద పార్
టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాలకు ఉదయం 10 గంటలకల్లా హాజరు కావాలని సూచించారు. ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.