ఎల్లుండి ఎంసెట్-3 షెడ్యూల్
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్-3 నిర్వహణపై కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎల్లుండి పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయాలని కమిటీ శుక్రవారం నిర్ణయించింది. కొత్త హాల్ టికెట్లతో పరీక్షకు అనుమతి ఇస్తామని కన్వీనర్ యాదయ్య తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
ఎంసెట్-2కు దరఖాస్తు చేసినవారికే ఎంసెట్-3లో అవకాశం ఉంటుందన్నారు. పరీక్ష జరిగిన వారం రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. వచ్చే నెల 11న ఎంసెట్-3 నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో ఇప్పటివరకూ 34మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించిన సీఐడీ తాజా దర్యాప్తులో వారి సంఖ్యను 42గా తేల్చింది.