coriander leaves
-
కొత్తిమీరకు మార్కెట్లో ధర లేక అవస్థలు పడుతున్న రైతులు..!
-
కొత్తిమీర, పుదీనా సాగుచేసిన రైతులకు నష్టాలు తక్కువే..!
-
Health: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఉల్లిపాయ, కొత్తిమీర, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో!
Nose Bleeding Problem: ఎండ వేడిమి ఎక్కువైతే కొంత మందిలో ముక్కులో నుంచి రక్తం విపరీతంగా కారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. తగ్గడం కోసం రక రకాల మందులను ఉపయోగిస్తారు. అయితే కారణం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్సు వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది... ఇలా చేయండి! ►ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటే.. ఉల్లిపాయను గుండ్రంగా కట్ చేసుకొని, ఆ ఉల్లి ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన చూడాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇలా చేయటం తొందరగా ఉపశమనం పొందుతారు. ►రక్తం కారటాన్ని తగ్గించటంలో కొత్తిమీర పాత్ర కీలకం. కొత్తిమీర సహజంగానే చల్లదనాన్నిస్తుంది. ఇది ముక్కుకు సంబంధించిన అన్ని రకాల ఎలర్జీలను నివారించటంలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ముక్కు నుంచి రక్తం అధికంగా కారితే కొత్తిమీర తాజా రసాన్ని ముక్కు లోపలి అంచులకు రాసుకుంటే సరిపోతుంది. ►ముక్కు నుంచి రక్తం కారటాన్ని తగ్గించటంలో తులసి మంచి ఔషధం. తులసి రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవటం లేదా తాజా తులసి ఆకులను నమలటం వల్ల కూడా ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి. ►చిన్న పిల్లలకు ముక్కులో నుంచి రక్తం ఎక్కువగా కారితే విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కత్తిరించి అందులో కొంచెం పెట్రొలియం జెల్లీ కలిపి డ్రాపర్‌తో ముక్కులో రెండు చుక్కలు వేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ►ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే విటమిన్ ’సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రోజూ తినటం మంచిది. ►అలాగే గోధుమలు, గోధుమ గడ్డితో తయారు చేసిన పదార్థాలను రోజూ తినటం మంచిది. ఎందుకంటే గోధుమల్లో జింక్, ఐరన్, నూట్రీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
Coriander Leaves: పోషకాల గని
-
Health Benefits: కరివేపాకు.. బరువును అదుపులో ఉంచుతుంది.. ఇంకా
మనలో చాలా మంది కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా తీసి పక్కన పెట్టేస్తాం! కానీ దీనిలోని పోషకాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ కరివేపాకు తీసిపారెయ్యలనే ఆలోచనే రాదంటే నమ్మండి. అవేంటో తెసుకుందామా.. మన భారతీయ ఆహార అలవాట్లలో కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. సాంబార్ నుంచి పెరుగు చట్నీ వరకు ప్రతి కూరలో దర్శనమిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో కరివేపాకు లేకుండా కూరలను అసలు ఊహించలేమంటే అతిశయోక్తి కాదేమో! కేవలం రుచి కి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిలో మెండేనండోయ్. ఏమిటా ప్రయోజనాలు? విటమన్ ‘ఎ’, ‘సి’, పొటాషియం, కాల్షియం, ఫైబర్, రాగి, ఐరన్ వంటి భిన్న రకాల పోషకాలు కరివేపాకు ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బరువును అదుపులో పెట్టడంలో, మధుమేహం నివారణలో, పేగు సంబంధిత ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. కొవ్వులను ఏ విధంగా నిరోధిస్తుంది? కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు పొంచిఉన్నట్లేనని ఎక్కువ మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ చైనీస్ మెడిసిన్ అధ్యనాల ప్రకారం రక్తంలోని గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణం కరివేపాకు రసంలో పుష్కలంగా ఉందని వెల్లడించాయి. ఈ పరిశోధకులు డయాబెటిక్ ఎలుకలకు వరుసగా 10 రోజుల పాటు కరివేపాకు రసాన్ని ఇంట్రాపెరిటోనియల్ ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. తద్వారా వీటి రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోస్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. కాబట్టి మీ రోజువారి ఆహారంలో భాగంగా కరివేపాకు ఆకులను తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంచడానికి తోడ్పడుతుందనేడి ఈ అధ్యయనాల సారాంశం. మన రోజువారీ ఆహారంలో కరివేపాకును ఏ విధంగా తీసుకోవాలి? 8-10 కరివేపాకు ఆకులు, చిన్న అల్లం ముక్కను నీళ్లలోవేసి 15 నుంచి 20 నిముషాలు మరగనియ్యండి. దీనిపై మూతను పెట్టి 10 నిముషాలు పక్కన పెట్టండి. తర్వాత వడకట్టి తాగండి. రుచికోసం దీనికి నిమ్మరసం, తేనెకూడా జోడించవచ్చు. ఇలా తయారు చేసిన టీని రోజు మొత్తంలో ఎప్పుడైనా తాగవచ్చు. అలాగే వివిధ రకాల వంటకాలలో కరివేపాకును చేర్చడం ద్వారా, కరివేపాకు పచ్చడి, లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ పిడికెడు కరివేపాకు ఆకులను నేరుగా తిన్నా మంచిదే. నిపుణులు సూచిస్తున్న ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. చదవండి: Typhoid Diet: టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం.. ఇవి తిన్నారంటే.. -
మూర్ఛకు చెక్ పెట్టే కొత్తిమీర!
మనం నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరలో మూర్ఛవ్యాధికి చికిత్స కల్పించే మందు ఉన్నట్లు గుర్తించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మూర్ఛ లక్షణాలతోపాటు వాంతులు, వికారాలను తగ్గించేందుకు కొత్తిమీర ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలిసినప్పటికీ కచ్చితంగా ఏ మూలకం ద్వారా ఇది జరుగుతోందో మాత్రం తెలియదు. ఈ అంశాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. మూర్ఛ లక్షణాల్లో కొన్ని మెదడులోని కేసీఎన్క్యూ పొటాషియం ఛానళ్ల ద్వారా నియంత్రించబడుతున్నట్లు ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు కొత్తిమీర ఆకులోని పదార్థాలను విశ్లేషించడం ద్వారా తమ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని రసాయనాలు పొటాషియం ఛానళ్లను చైతన్యపరుస్తున్నట్లు గుర్తించారు. డొడిసెనాల్ అనే పదార్థం పొటాషియం ఛానళ్లకు అతుక్కుపోవడం ద్వారా అవి పనిచేసేలా చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జెఫ్ అబోట్ తెలిపారు. జంతువులపై జరిగిన ప్రయోగాల్లోనూ ఈ డొడిసెనాల్ మూర్ఛ లక్షణాలను తగ్గిస్తున్నట్లు స్పష్టమైందని తెలిపారు. వాంతులు వికారాలకు మరింత మెరుగైన మందును తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు ఫాసెబ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
కొండెక్కిన కొత్తిమీర
కొంచెం కొత్తిమీర వంటల్లోకి వేయగానే ఘుమఘుమలు వ్యాపించి వంట రుచే మారిపోతుంది. కొత్తిమీరకున్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా తక్కువేం కాదు. దీంతో వంటింట్లో కొత్తిమీర లేకపోతే గృహిణులకు ఇబ్బందే. ఇప్పుడు కొత్తిమీరను కొనాలంటే కొంచెం ఆలోచించాలి. ధరలు కొండెక్కి కూర్చోవడంతో మధ్యతరగతి మహిళలకు ఆందోళన తప్పడం లేదు. కర్ణాటక, బనశంకరి: కొత్తమీర, ఆపిల్ పండ్లతో సమానంగా ధర పలుకుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తమీర పంట దెబ్బతినింది. దీంతో కొత్తమీర ధరకు రెక్కలొచ్చాయి. బెంగళూరు హాప్‌కామ్స్‌లో కేజీ రూ.150 ధర పలుకుతుండగా కలాసీపాళ్య మార్కెట్లో కొత్త మీర కట్ట ఒక్కటి రూ.45 పలుకుతుంది. అదే చిన్నపాటి వ్యాపారులు చిన్నపాటి కొత్తిమీర కట్టను రూ.40 నుంచి 50 మధ్య విక్రయిస్తున్నారు. గృహిణులు నిత్యం వంటల్లో కొత్తమీరను విరివిగా వాడతారు. కానీ కొత్తమీర ధర అమాంతం పెరిగిపోవడంతో కొనాలంటే హడలిపోతున్నారు. అదే దారిలో ఇతర ఆకుకూరలు కోలారు, శ్రీనివాసపుర, ఆనేకల్ తాలూకా తదితర ప్రాంతాలనుంచి బెంగళూరుకు కొత్తిమీరను రైతులు, వ్యాపారులు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తమీర తో పాటు వివిధరకాల ఆకుకూరల పంటలు దెబ్బతిన్నాయి. కొత్తమీర దిగుబడి తగ్గిపోగా కొన్ని ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. దీపావళి సమయానికి కొత్తిమీర ధర తగ్గుముఖం పడుతుందని కలాసీపాళ్య వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.గోపి తెలిపారు. మెంతి, సబ్బక్కి, కరివేపాకు లాంటి ఆకుకూరలతో పాటు మిగతా ఆకుకూరల రేట్లూ పెరిగాయి. గత మూడురోజుల నుంచి దసరా పండుగ నేపథ్యలో మార్కెట్లులోకి డిమాండ్ కు అనుగుణంగా కూరగాయలు సరఫరా కావడం లేదు. దీంతో పాటు కొనుగోలు గిరాకీలు ఎక్కువగా రాకపోవడంతో మార్కెట్లో వ్యాపారకార్యకలాపాలు సాధారణంగా ఉన్నాయి. బీన్స్ ధరలు కూడా గత రెండు వారాలనుంచి బీన్స్ ధరలు కూడా పెరిగాయి. నవరాత్రి పూజలు, పండుగ, గృహప్రవేశాలు, వివాహాలు తదితర శు¿భ¶ కార్యక్రమాల నేపథ్యంలో బీన్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో కిలో బీన్స్ రూ.50– 60 ధర పలుకుతుంది. కోలారు ఇతర ప్రాంతాల్లో టోమాటో పంట అదికంగా పండటంతో టమాటో ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంది. గతరెండు వారాల నుంచి టమోటా ధర కిలో రూ.10 తో విక్రయిస్తున్నారు. మిగిలిన బీట్రూట్, ఉల్లిపాయలు, మునగ, ధర తక్కువగా ఉండగా క్యాప్సికం, పచ్చిమిరప రేట్లు కొంచెం పెరిగాయి -
కూరగాయలతో లాభాల బాట
బాల్కొండ: మండలంలోని పలువురు రైతులు వాతావరణానికి అనుకూలంగా పంటమార్పు చేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని బుస్సాపూర్ గ్రామ రైతులు పంట మార్పిడి చేసి కూరగాయలకు సాగు చేయుటకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన పంటలైన మొక్క జొన్న, సోయా, జొన్న, సజ్జ , పసుపు పంటలను అధిక మొత్తంలో సాగు చేయడం వల్ల డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు కూరగాయల వైపు మళ్లుతున్నారు. గేదే నిత్యం పాలిచ్చినట్లు కూరగాయల వలన రైతులకు నిత్యం డబ్బులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. అందకే ఎకరాల్లో వంకాయ, టమాట, కొతిమీర, పువ్వుగోబీ, గోబీగడ్డ , బెండకాయ, బీరకాయలను అధిక ంగా సాగు చేస్తున్నారు. అన్నివేళల పనికి వచ్చే మిరప సాగును కూడా పెంచారు, ఇలా పలు రకాల కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఆలుగడ్డను కూడా సాగు చేస్తున్నారు. పంట మార్పిడితోనే దిగుబడి పెరుగుతుందని అధికారులు సూచించడంతో రైతులు కూరగాయల సాగుబాట పట్టారు. బుస్సాపూర్‌లో ఓరైతు అరఎకరంలో గోబీ, అందులోనే అంతర్ పంటగా కొతిమీర సాగు చేశాడు. ఇలా రైతులు రకరకాల ప్రయోగాలను చేస్తు ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు పొందుతున్నారు. మార్కెట్లు అందుబాటులో లేక.. కూరగాయల విక్రయాలకు రైతులకు మార్కెట్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాల్కొండ మండలంలో కూరగాయలు సాగు చేసే రైతులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లేదా ఆర్మూర్ సమీపంలో ఉన్న పెర్కిట్, అంకాపూర్ మార్కెట్లకు తీసుకెళ్లాలి. దీంతో రైతులకు రవాణా భారం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి, స్థానికంగా మార్కెట్లు ఏర్పాటు చేసి, కూరగాయలను సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు.