కొంచెం కొత్తిమీర వంటల్లోకి వేయగానే ఘుమఘుమలు వ్యాపించి వంట రుచే మారిపోతుంది. కొత్తిమీరకున్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా తక్కువేం కాదు. దీంతో వంటింట్లో కొత్తిమీర లేకపోతే గృహిణులకు ఇబ్బందే. ఇప్పుడు కొత్తిమీరను కొనాలంటే కొంచెం ఆలోచించాలి. ధరలు కొండెక్కి కూర్చోవడంతో మధ్యతరగతి మహిళలకు ఆందోళన తప్పడం లేదు.
కర్ణాటక, బనశంకరి: కొత్తమీర, ఆపిల్ పండ్లతో సమానంగా ధర పలుకుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తమీర పంట దెబ్బతినింది. దీంతో కొత్తమీర ధరకు రెక్కలొచ్చాయి. బెంగళూరు హాప్‌కామ్స్‌లో కేజీ రూ.150 ధర పలుకుతుండగా కలాసీపాళ్య మార్కెట్‌లో కొత్త మీర కట్ట ఒక్కటి రూ.45 పలుకుతుంది. అదే చిన్నపాటి వ్యాపారులు చిన్నపాటి కొత్తిమీర కట్టను రూ.40 నుంచి 50 మధ్య విక్రయిస్తున్నారు. గృహిణులు నిత్యం వంటల్లో కొత్తమీరను విరివిగా వాడతారు. కానీ కొత్తమీర ధర అమాంతం పెరిగిపోవడంతో కొనాలంటే హడలిపోతున్నారు.
అదే దారిలో ఇతర ఆకుకూరలు
కోలారు, శ్రీనివాసపుర, ఆనేకల్ తాలూకా తదితర ప్రాంతాలనుంచి బెంగళూరుకు కొత్తిమీరను రైతులు, వ్యాపారులు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తమీర తో పాటు వివిధరకాల ఆకుకూరల పంటలు దెబ్బతిన్నాయి. కొత్తమీర దిగుబడి తగ్గిపోగా కొన్ని ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. దీపావళి సమయానికి కొత్తిమీర ధర తగ్గుముఖం పడుతుందని కలాసీపాళ్య వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ.గోపి తెలిపారు. మెంతి, సబ్బక్కి, కరివేపాకు లాంటి ఆకుకూరలతో పాటు మిగతా ఆకుకూరల రేట్లూ పెరిగాయి. గత మూడురోజుల నుంచి దసరా పండుగ నేపథ్యలో మార్కెట్లులోకి డిమాండ్ కు అనుగుణంగా కూరగాయలు సరఫరా కావడం లేదు. దీంతో పాటు కొనుగోలు గిరాకీలు ఎక్కువగా రాకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారకార్యకలాపాలు సాధారణంగా ఉన్నాయి.
బీన్స్ ధరలు కూడా
గత రెండు వారాలనుంచి బీన్స్ ధరలు కూడా పెరిగాయి. నవరాత్రి పూజలు, పండుగ, గృహప్రవేశాలు, వివాహాలు తదితర శు¿భ¶ కార్యక్రమాల నేపథ్యంలో బీన్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో కిలో బీన్స్ రూ.50– 60 ధర పలుకుతుంది. కోలారు ఇతర ప్రాంతాల్లో టోమాటో పంట అదికంగా పండటంతో టమాటో ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తుంది. గతరెండు వారాల నుంచి టమోటా ధర కిలో రూ.10 తో విక్రయిస్తున్నారు. మిగిలిన బీట్‌రూట్, ఉల్లిపాయలు, మునగ, ధర తక్కువగా ఉండగా క్యాప్సికం, పచ్చిమిరప రేట్లు కొంచెం పెరిగాయి
Comments
Please login to add a commentAdd a comment