the Corporation
-
ఇక బాదుడే!
కర్నూలు నగర ప్రజలకు పన్ను పోటు! సాక్షి ప్రతినిధి, కర్నూలు : నగర ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు నగర పాలక సంస్థలో ఇటు నీటి బిల్లుతో పాటు అటు ఆస్తి పన్నును భారీ పెంచేందుకు రంగం సిద్ధమైంది. కార్పొరేషన్‌కు వాస్తవికంగా అయ్యే వ్యయం, వస్తున్న ఆదాయాన్ని పోల్చి చూసి... వీటి మధ్య ఉన్న తేడాను భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచాల్సిందేనని ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నీటి బిల్లులతోపాటు ఆస్తి పన్నులను కూడా పెంచేందుకు మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి నీటి బిల్లును రూ.100 నుంచి 150కు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇంటికి సరఫరా చేసే నీటి కోసం నెలకు రూ. 100ను కార్పొరేషన్ వసూలు చేస్తోంది. అంటే ఏకంగా 50 శాతం మేరకు నీటి బిల్లు భారం పెరగనుందన్నమాట. అదేవిధంగా వాణిజ్య సంస్థల నీటి బిల్లు స్లాబుల్లో తేడాలు రానున్నాయి. ఇంటి పన్ను భారం కూడా 25 శాతం నుంచి 50 శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వాణిజ్య సంస్థలకు వాతలే...! ఆదాయాన్ని పెంచుకునేందుకు మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రధానంగా వాణిజ్య సంస్థలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం వాణిజ్య సంస్థల నీటి బిల్లు స్లాబులను సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం వాణిజ్య సంస్థలకు 15 వేల లీటర్ల వరకు ఒక స్లాబుగా నిర్ణయించారు. నెలకు 15 వేల లీటర్ల మేరకు నీటిని వినియోగిస్తే రూ. 300 వసూలు చేస్తున్నారు. ఆపై ప్రతీ వెయ్యి లీటర్లకు అదనంగా రూ. 20 మేర ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ స్లాబులను కాస్తా మార్చడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలనేది ఆలోచనగా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం గృహాలకు, వాణిజ్య సంస్థలకు నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 9 కోట్ల మేరక వ్యయమవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం రూ. 4.5 కోట్ల మేరకు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే రూ. 4.5 కోట్ల లోటును కేవలం చార్జీలను పెంచడం ద్వారానే భర్తీ చేసుకోవాల్సి రానుంది. ఇందుకోసం అటు గృహాలకు నెలకు రూ. 100 నుంచి రూ. 150తో పాటు వాణిజ్య సంస్థలకు స్లాబులను మార్చడం ద్వారానే సాధ్యం అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 41,860 గృహాలకు నీటి కనెక్షన్లు ఉండగా, 1500 వాణిజ్య సంస్థలకు మాత్రమే నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనధికారిక నీటి కనెక్షన్లపై కన్నేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టుకోవచ్చుననేది అధికారుల భానవగా ఉంది. పెరగనున్న ‘ఇంటి’ బడ్జెట్! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15లో ఇంటి పన్ను ద్వారా రూ.25 కోట్ల ఆదాయం కార్పొరేషన్‌కు వస్తుంది. అయితే, దీనిని 25 నుంచి 50 శాతానికి పెంచడం ద్వారా ఈ ఆదాయాన్ని రూ. 32 కోట్ల నుంచి రూ. 35 కోట్ల మేరకు రాబట్టుకోవాలనేది కార్పొరేషన్ భావిస్తోంది. ఇందుకోసం ఇంటి పన్ను మొత్తాన్ని సగటున 25 శాతం నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పెరిగే పన్నుల భారం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఉండే అడ్వయిటైజింగ్ హోర్డింగుల ఆదాయాన్ని పెంచుకునే అంశంపైనా కసరత్తు జరుగుతోంది. దీనితో పాటు అనధికారిక కట్టడాలపై 100 శాతం మేరకు అపరాధ రుసుం భారం మోపడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద కొత్త ఏడాదిలో ప్రజలపై పన్నుల భారం తప్పేట్టు లేదు. -
ఇక మహిళా సాధికార కార్పొరేషన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం రేపటి మంత్రిమండలి భేటీలో ఆమోదముద్ర! విద్యుత్ ఉద్యోగుల ఫిట్మెంట్, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న కేబినెట్ సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తర్వాత రుణాల మాఫీ కాకుండా మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.10 వేల చొప్పున మూలధనం కింద ఇస్తామన్నారు. వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి రైతు సాధికార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా మహిళా సాధికార కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైలును రూపొందించారు. ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఆమోదంతో మహిళా సాధికార కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని కేబినెట్ భేటీ ఎజెండాలో చేర్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్)ని ఈ కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. దీంతో సెర్ప్ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు అన్నీ.. ఈ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వమే ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను మరో సంస్థలోకి తీసుకోరాదంటూ చట్టం తీసుకురావడం గమనార్హం. ఆ చట్టానికి సవరణలు చేయకుండా సెర్ప్ ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లోకి తీసుకోవడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇలావుండగా విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫారసు చేస్తూ ఇంధన శాఖ సోమవారం ముఖ్యమంత్రికి ఫైలు పంపింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుని, ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ప్రధానంగా రైతుల రుణ మాఫీని నామమాత్రంగా చేయడంపై, మహిళా సంఘాలకు రుణ మాఫీ చేయకపోవడంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. వ్యాట్ చట్టంలో సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాస్తవానికి మంగళవారం జరగాల్సిన కేబినెట్ భేటీ.. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అంత్యక్రియలు ఇదేరోజున ఉండటంతో బుధవారానికి వాయిదా పడింది. -
చెత్తపై నిఘా
రాజంపేట: పట్టణాలను, నగరాలను పట్టిపీడిస్తున్న చెత్తసమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తాజాగా ఓ కొత్త విధానం అమలుకు సిద్ధమవుతోంది. చెత్తపై నిఘా వ్యవస్ధను ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. ఆ దిశగా పురపాలిక, కార్పొరేషన్లో నూతన విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. జిల్లాలో కడప కార్పొరేషన్‌తోపాటు రాజంపేట, బద్వేలు, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు పురపాలికలు ఉన్నాయి. వీటిలో నూతన విధానానికి సంబంధించి కొన్ని ప్రదేశాలను గుర్తించి నివేదికలు ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో చెత్త తొలిగింపు సక్రమంగా చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి. ఒకరోజు తొలిగిస్తే మూడురోజులు అలాగే ఉంచుతున్నారు. వర్షం కురిస్తే వారంరోజులైనా అక్కడే ఉండిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. చెత్త కుప్పల్లో పశువులు, పందులు చేరడం పరిసరాలన్ని అధ్వానంగా మారుతున్నాయి. ఈపరిస్ధితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఎంబీఎస్ (మాస్టర్ బిన్ సిస్టమ్) పద్దతిని తీసుకొస్తోంది. సెల్‌ఫోన్ కెమరాతో నిఘా చెత్త తొలిగింపు పనులకు చెక్ పెట్టేందుకు సల్ఫోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెత్త తొలిగింపుపై సెల్‌ఫోన్ కెమెరాతో ఫోటో తీస్తే.. ఆ ఫోటో, తొలిగించిన సమయం ఆటోమేటిక్‌గా ఎస్ఎంఎస్ ద్వారా కనెక్టింగ్ కంప్యూటర్‌కు వెళ్లిపోతుంది. ఇందుకు ప్రత్యేకంగా ఆఫ్ సైట్ రియల్ టైమ్(ఓఎస్ఆర్టీ) మ్యానటరింగ్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఎంబీన్ పద్ధతిగా నామకరణం చేసేందుకు పరిశీలిస్తున్నారు. ప్రజారోగ్యం అధికారులు ఖచ్చితంగా అమలుచేసే విధంగా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. టెక్నాలజి ఫోన్లు ముఖ్యమైన పబ్లిక్ అండ్ హెల్త్, శానిటరీ ఇన్స్పెక్టర్లకు అందచేయనున్నారు. కొత్త విధానం టెక్నాలిజి ఇలా.. పబ్లిక్ అండ్ హెల్త్ ముఖ్య అధికారులకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సామర్ధ్యమున్న సెల్ఫోన్లు ఇస్తారు. వీటిలో ఓఎస్ఆర్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయనున్నారు. అప్లికేషన్లోకి వెళ్లి చెత్తపోగు చేసే పాయింట్లను చిరునామతోపాటు తొలిగించేందుకు నిర్దేశించుకునే సమయాన్ని నమోదు చేయాలి. నమోదైన సమాచారం కనెక్టింగ్ పర్సన్‌కు వెళుతుంది. ప్రతి రోజు అధికారులు చెత్తపాయింట్ వద్దకు వెళ్లి తొలిగించిన దృశ్యాన్ని సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించాలి. ఏ రోజైనా ఒక పాయింట్లో చెత్తను తొలిగించలేదంటే వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులకు తెలుస్తుంది. దీనిపై బాధ్యులైన వారు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓఎస్ఆర్టీ మానిటరింగ్ సిస్టం అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ కావాలనేందుకు ఆరు మార్గదర్శకాలను సూచించారు. డస్ట్‌బిన్ డంప్‌బిన్స్ లేద చెత్త లిఫ్టింగ్ పాయింట్లు రిజిష్టరు చేయాలి. చెత్త తొలిగింపు ఫోటోలు ఎలా అన్లోడ్ చేయాలనే దానికి ఏడు మార్గదర్శకాలను నిర్దేశించారు. అన్ని మున్సిపాలిటిలో అమలు చేసేందుకు ప్రాసెస్ చేస్తున్నామని రీజనల్ స్ధాయి అధికారి ఒకరు ధ్రువీకరించారు. -
డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించండి
ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్: దొంతాలి డంపింగ్‌యార్డు సమస్యను వెంటనే పరిష్కరించకుంటే చెత్తను కార్పొరేషన్ కార్యాలయంలో వేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. గ్రామంలో శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు సారె పెట్టి ఆశీర్వదించారు. అనంతరం ఉచిత వైద్యశిబిరాన్ని పరిశీలించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ దొంతాలి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యం ఈగలతో సహవాసం చేస్తూ భోజనం చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పింఛన్ల మంజూరులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హులలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుం డా చూడాలన్నారు. జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే అన్ని ప్రాంతాల్లో తాను పర్యటిస్తానన్నారు. వృ ద్ధుల కళ్లలో ఆనందం చూడటం తనకెంతో సంతోషమని ఆయన పేర్కొన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ మలినేని రత్నమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లూరు లక్ష్మమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హరిశివారెడ్డి, నాయకులు మలినేని వెంకయ్యనాయుడు, అనిల్, భాస్కర్‌నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా నగర కార్పొరేషన్
సాక్షి, నెల్లూరు : నెల్లూరు నగర కార్పొరేషన్ పరిస్థితి అధ్వానంగా తయారవుతోందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక 17వ డివిజన్లోని శ్రామికనగర్, అపోలో హాస్పిటల్ సెంటర్, మధురానగర్‌లలో ఆదివారం ఆయన పర్యటించారు. అపోలో హాస్పిటల్ సెంటర్ వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయాల్లో బయట తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, దోమల సమస్య విపరీతంగా ఉన్నట్టు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న డీఈ, శానిటేషన్ అధికారులను ఆదేశించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతంలో కనీసం వీధిలైట్లు కూడా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ముందు వీధిలైట్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు అవి కాకుండా మిగతా సమస్యలు చెప్పుకునేలా చేయండని కోరుతున్నానన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నగర కార్పొరేషన్‌పై దృష్టి సారించి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరా రు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు మాధవ్, కె.సతీష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాము, మనోహర్, సీపీఎం స్థానిక సభ్యుడు ఎస్కే నజీర్, బి.ప్రసాద్, చాన్‌బాషా, పవన్, తిరుపతి, పట్రంగి అజయ్, హైమావతి, మహాలక్ష్మమ్మ, నాగేశ్వరరావు, సాంబయ్య, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.