Corrupt Politician
-
USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను వైట్‌హౌస్‌ను వీడకుండా ఉండాల్సిందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డెమొక్రాట్లు తనను మోసగించి గెలిచారని ఆరోపించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆయన కీలక స్వింగ్ రాష్ట్రాల్లో పర్యటించారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో పలు ర్యాలీల్లో మాట్లాడారు. ‘2020 ఎన్నికల్లో మనమేంటో చూపించాం. విజయం అంచుకు చేరాం. ఆ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సింది. వైట్‌హౌస్‌ను వీడి ఉండాల్సింది కాదు’’ అన్నారు. ‘‘డెమొక్రాటిక్ పార్టీ ఓ రాక్షస పార్టీ. అతి పెద్ద అవినీతి యంత్రం. ఇక హారిస్ అత్యంత అవినీతిపరురాలు’’ అంటూ దుయ్యబట్టారు. -
ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్
ఢిల్లీ: తనను అవినీతిపరుడిగా నిరూపించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చీప్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ‘జంతాకీ అదాలత్’ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని మాట్లాడారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాపై కుట్ర పన్నారు. నన్ను, ఆప్ నేత మనీష్ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కుర్చీపై దాహం లేకపోవడం వల్లే రాజీనామా చేశా. డబ్బు సంపాదించడానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. దేశ రాజకీయాలను మార్చేందుకు వచ్చాను....మేము జాతీయవాదులుము, దేశభక్తులమని ఆర్ఎస్ఎస్ వాళ్లు అంటున్నారు. మోహన్ భగవత్ గారికి నేను గౌరవంగా ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మోదీ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, నేతలను ప్రలోభపెట్టడం, ఈడీ, సీబీఐలతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టడం సరైనదేనా?. మోదీ బీజేపీలో అత్యంత అవినీతి నాయకులను చేర్చుకున్నారు. వారిని అవినీతిపరులని ఆయనే స్వయంగా పిలిచారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా?. ...ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టింది. బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్పై ఉంది. మోదీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా?. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదని అన్నారు. బీజేపీ అంతగా ఎదిగిపోయిందా? మాతృసంస్థపై తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు బాధ కలగలేదా?. 75 ఏళ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని మీరే చట్టం చేశారు. ఈ రూల్ ప్రధాని మోదీకి వర్తించదని కేంద్రమంత్రి అమిత్ షా చెబుతున్నారు. పార్టీ నేత అద్వానీకి వర్తించిన రూల్.. మోదీకి ఎందుకు వర్తించదు?’’అని అన్నారు. #WATCH | AAP national convenor Arvind Kejriwal says, "RSS people say that we are nationalists and patriots. With all due respect, I want to ask Mohan Bhagwat ji five questions- the way Modi ji is breaking parties and bringing down governments across the country by luring them or… pic.twitter.com/nWTxgbZCgl— ANI (@ANI) September 22, 2024చదవండి: సీఎం పీఠంపై మహిళా శక్తి -
పగులుతున్న అవినీతి పుట్ట
-
అనుచర వర్గం... అవినీతి మార్గం
సాక్షి, అద్దంకి(ప్రకాశం): వాళ్ల అవినీతి ఆకాశమంత, వాళ్ల కబ్జాలు కడలంత, వాళ్ల దోపిడి ధరిత్రంత, వాళ్ల రాక్షసత్వం రావణుడే అసూయపడేంత. కొండలు కరిగించారు, ఇసుక తరలించారు గిరిజనుల భూముల్ని బదలాయించుకున్నారు. లోకమంతా పచ్చగా ఉండాలి అనేది ఆరోక్తి, పచ్చనేతలే పచ్చగా ఉండేలి అనేది అధికార పార్టీ రీతి ‘‘నారా’’జ్యం అంటున్న తెలుగు తమ్ములు అభివృద్ధి పేరుతో దోచుకున్న సొమ్ము కోట్లలోనే ఉంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన మంత్రి అండదండలు ఉండటంతో వారి అనుచర వర్గం చేసిన అవినీతి పతాకస్థాయికి చేరుకుంది. అధికార పార్టీ అండదండలతో అకమ్ర సంపాదనే ధ్యేయంగా తెలుగుతమ్ముళ్లు ఈ ఐదేళ్లలో దోచుకున్న సొమ్ముతో పాటు ప్రశ్నించిన వారిని బెదిరించిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. మండలంలో చక్రాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక క్వారీలో తవ్వాల్సిన దాని కన్నా ఎక్కువగా తవ్వి కోట్లాది రూపాయలు సంపాదించాడని ఎమ్మెల్యేతో పాటు ఆయన ఆనుచర వర్గంపై ఆరోపణలున్నాయి. ఈ అవినీతిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వర్గం నాయకులు, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమంగా ఇసుక తరలించే క్వారీలను గుర్తించారు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో తరువాత అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక మండల పరిధిలోని మోదేపల్లి, పేరాయిపాలెం గ్రామ సమీపంలోని ద్వార్నపు వాగు, చిలకలేరుల్లో సైతం ఇదే తరహా ఇసుక దోపిడీ చోటు చేసుకుంది. ధేనువకొండ సమీపంలోని కొండను సైతం అధికార పార్టీకి వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. బల్లికురవ మండలంలో.. బల్లికురవ: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువలేదు అన్న చందంగా అధికార అహంతో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఆర్అండ్బీ రహదారులను సైతం ఆధీనంలోకి తీసుకుని క్వారీయింగ్ చేస్తున్నారు. క్వారీల కోసం తిరిగే లారీలతో తారు రోడ్డు సైతం మట్టిరోడ్డుగా తయారైంది. గ్రానైట్ వృథా రాళ్లను రోడ్డు మార్జిన్లో పడేయటంలో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. బ్లాస్టింగ్ మోతలతో సమీప గృహాలు పగుళ్లిచ్చి ధ్వంసం అవుతున్నాయని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తమ క్వారీలకు మీ గృహాలే అడ్డంగా ఉన్నాయని వాటిని ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. 60 కుటుంబాలను ఊరికి దూరంగా నాసిరకం గృహాలు నిర్మించి ఇచ్చారు. ఆ ఇళ్లలలో తాముండబోమని చెప్పడంతో, ఎమ్మెల్యేకు చెందిన మనుషులు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని మళ్లీ బెదింరిపుకు దిగారు. అదేవిధంగా ఈర్లకొండ చూట్టూ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు బినామీల పేరులో క్వారీలున్నాయి. మంత్రి శిద్దా రాఘవరావుకు ఒక క్వారీ ఉంది. ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వారిద్దరూ క్వారీలు నిర్వహిస్తున్నారు. నలభై ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న మాపై జిల్లా మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు. నీరు చెట్టు అంతా అవినీతిమయం.. జె.పంగులూరు: తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో వందల కోట్లు అవినీతి చోటు చేసుకుంది. నీరు చెట్టుకింద చేసిన పనే చేస్తూ బిల్లు చేసుకుంటున్నారు. మండలంలో చిన్నమల్లవరం గ్రామానికి ఆనుకోని ఉన్న వాగుపై ఒక్క సంవత్సరం మూడుసార్లు మరమ్మతులు చేశారు.ఈ పనుల్లో గ్రామానికి చెందిన శ్మశానం కూడా 60 శాతం వాగులో కలుపుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులు ఇష్టానుసారంగ ప్రభుత్వ సొమ్మును దండుకున్నారు. ఇచ్చిందే తగుదు అన్నట్లు నీరు చెట్టు పనుల చేయకుండా కూడా బిల్లుల పొందిన దాఖాలాలు అనేకం. ఈ అవినీతి మండలంలోని ప్రతి గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిదులు కుమ్మకై ప్రభుత్వ సోమ్మును దర్జాగా దోచుకున్నారు. టీడీపీ పాలనలో పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాత్రం పెద్దవాడయ్యాడు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది ఒక్క వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మేదరమెట్ల: గడచిన ఐదేళ్ల కాలంలో మండలంలోని పలు గ్రామాల్లో నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలను టీడీపీకి చెందిన వారు అక్రమంగా దండుకోవడంతో పాటు పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్రయోజనం పొందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక శాసనసభ్యుడి అండదండలుండటంతోనే అక్రమాకు పాల్పడేవారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నీరు చెట్టు పేరుతో మండలంలో చెరువుల్లో అధికార పార్టీకి చెందిన వారు, మట్టిని అమ్ముకుని కోట్లు కొల్లగొట్టారు. చెక్‌డ్యాంలు, సీసీ రహదారుల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన చెక్డ్యాలకు సంబంధించి చేసిన పనుల్లో రూ.30 లక్షల వరకు అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన వారు, జిల్లా కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా, ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారపార్టీ అండదండలున్నాయనే విమర్శలకు బలాన్నిస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమించుకొని ఊర చెరువులో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటూ గ్రామానికి చెందిన కొందరు యువకులు కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. పీ. గుడిపాడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని సాగు చేస్తుండగా వారి భూములను వదిలిపెట్టి, సామాన్యులు సాగు చేసుకుంటున్న దొండ పందిర్లను ముందస్తు సమాచారం లేకుండా అధికారులు తొలగించారు. దీంతో ఆ రైతు భార్య మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైంది. ఇంలాంటి అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడుతున్న తముళ్లకు కొమ్ముకాస్తుంది ఎమ్మెల్యేనే అనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా రైతుల పొలంలో బోర్లు వేసేందుకు ప్రభుత్వం జలసిరి పథకాన్ని రూపొందించిన ఘటన తెలిసిందే. ఐతే జలసిరి బోర్లు వేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు రైతుల నుంచి కొంత సొమ్మును తీసుకున్నారని, అలాగే బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలకు సంబందించి సిఫార్సులు చేయాలంటే కూడా అధికార పార్టీ నేతలకు తమ వాటా తముకు అందిచాలని సొంతపార్టీకి చెందిన వారే ఆరోపించిన ఘటనలు చాలనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో టీడీపీ నాయకులు అవినీతికి అంతే లేకుండా పోయింది. గిరిజన భూములు కొనుగోలు.. బల్లికురవకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం సర్వే నంబరు 295, 296, 297లో 11 ఎకరాలను 11 మందికి భూమి కొనుగోలు పథకం ద్వారా అందజేసింది. ఆ భూములను అమ్మె హక్కు గిరిజనులకు లేదు. 2017 డిసెంబరులో అప్పటి తహశీల్దారు ఎస్వీ సుధాకర్ సహకారంతో ఈ భూములను బినామీ పేర్లతో ఎమ్మెల్యే కొనుగోలు చేశాడనే ఆరోపణ.లున్నాయి. ఈ భూమిలో ప్రస్తుతం గ్రానైట్ వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరు గారింది. గిరిజనులకు ఉపాధి కొరవడింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో.. యానాది సంఘం కాలనీలో 40 సంవత్సరాలుగా నివశిస్తున్నాం. క్వారీల పుణ్యమా అంటూ దుమ్ము దూళి బ్లాస్టింగ్ మోతలతో ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయండిని చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరించారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టిచుకోలేదు. – ఆలకుంట అంకమ్మ రాజు, బల్లికురవ అకమ్రాలకు హద్దే లేదు పమిడిపాడు గ్రామంలో వాటర్‌షెడ్ పథకం, నీరు చెట్టు పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారే కానీ అక్రమాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మండలంలో అధికార పార్టీ నేతలకే జలసిరి బోర్లు, రుణాలు మంజూరు చేశారు. అర్హులైన వారికి పలు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయడంలో మొండిచేయి చూపించారు. – రావినూతల సుబ్బయ్య, పమిడిపాడు -
సత్యప్రమాణంగా దోపిడీ
సాక్షి, చిత్తూరు : సత్యప్రమాణాల దేవుడిగా పేరున్న కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి సాక్షిగా టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూతలపట్టు నియోజకవర్గంలో అవినీతికి హద్దే లేకుండాపోయింది. అధికారం తమదే..అడిగేవారే లేరని ‘తమ్ముళ్లు’ బరితెగించారు. ఏకంగా చెరువులనే మింగేశారు. ఇసుకను కొల్లగొట్టి రూ.కోట్లు లూటీ చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ తమ్ముళ్లకు ఫలహారంగా మారాయి. రైతు రథాలకు అర్హులైన రైతులకు కాకుండా టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పింఛన్లు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు, సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారుల నుంచి టీడీపీ నేతలు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ లలిత కుమారి నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు నిలువునా డబ్బులు దోచుకున్నారు. అధికారులు సైతం వత్తాసు పలకడంతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. నీరు–చెట్టు నిధులు ఫట్ తవణంపల్లె మండలంలో నీరు– చెట్టు కింద 2017–18లో 64 పనులకు రూ.5 కోట్ల నిధులు వ్యయం చేశారు. ఈ పనులన్నీ టీడీపీ నాయకులే చేపట్టారు. 2108–19 సంవత్సరంలో రూ.25 లక్షలతో ఐదు పనులు చేపట్టారు. ఉత్తరబ్రాహ్మణపల్లె చెరువు పనులను రూ.6.50 లక్షలతో కట్టను బలపర్చడం, ముళ్ల చెట్ల తొలగింపు పనులను టీడీపీ నాయకుడు దిలీప్ చేశాడు. ఏడాది కూడా కాకముందే చెరువు కట్ట మధ్యలో బీటలు వారాయి. భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగుతుందేమోనని స్థానికులు భయపడతున్నారు. అదేవిధంగా చెరువుల్లో ముళ్లచెట్లను తూతూమంత్రంగా తొలగించి టీడీపీ నాయకులు లక్షల రూపాయిలు ఆర్జించారు. జెడ్పీటీసీ వెంకటేశ్వరచౌదరికి బినామీగా కుక్కలమిట్టకు చెందిన దిలీప్‌కుమార్ తవణంపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె చెరువుల్లో ముళ్ల చెట్లు తొలగించే పనులు చేశాడు. బాహుదాను తోడేశారు.. ఇసుకు మాఫియాకు కక్కలమిట్ట కేరాఫ్‌గా మారింది. ఇక్కడ టీడీపీ నాయకులు బాహుదానదిలో ఇసుకను తోడేస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వి రోజుకు 100 లోడ్ల ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్ చేసి బయట ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కక్కలమిట్ట, ఎగువ తవణంపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, మైనగుండ్లపల్లె, నర్తపుచేను, దిగువ తడకర, ఎగువ తడకర, దిగువమాఘం, కట్టకిందపల్లె గ్రామాల వద్ద ప్రభుత్వ పనుల పేరిట అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తవణంపల్లె, బంగారుపాళ్యం, ఐరాల, చిత్తూరు, యాదమరి మండలాల నుంచి ఇసుక అక్రమ రవాణాకు తవణంపల్లెకు చెందిన ఓ టీడీపీ నాయకుడు రింగ్‌లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. కక్కలమిట్ట సమీపంలో బాహుదానదిలో నుంచి జెడ్పీటీసీ అనుచరుడు దిలీప్, నర్తపుచేను వద్ద నుంచి గోపీయాదవ్, ఎగువ తడకర వద్ద నుంచి మణినాయుడు, మరికొందరు నిత్యం ఇసుకను తరలిస్తూ రూ.లక్షలు కొల్ల గొడుతున్నారు. చెరువుల్నే మింగిన నేతలు పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధికారపార్టీ నేతల అవినీతి తారస్థాయికి చేరింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలోని పూతలపట్టు, యాదమరి, తవణంపల్లె, బంగారుపాళెం, ఐరాల మండలాల్లో అన్నింటా తెలుగుతమ్ముళ్లదే పెత్తనం. యాదమరి మండలంలో చెరువులను ఆక్రమించి టీడీపీ తమ్ముళ్లు ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. యాదమరి మండలంలోని గూటల వంక చెరువు, నుంజర్ల ప్రాజెక్టు చెరువులో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ చెరువులపై టీడీపీ నాయకుల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా చెరువు భూములను ఆక్రమించి ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. ధర్మయ్య చెరువులో సర్వే నెం. 281లో నాలుగు ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. ఆయకట్టు రైతులు అ«ధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదు. ఇదే మండలంలో తమిళనాడు సరిహద్దులోని కనికాపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువులో అధికారపార్టీ నేతల అండదండలతో పలువురు పంటలు సాగు చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బంగారుపాళ్యం మండలంలో... బంగారుపాళెం మండలంలో రైతు రథం పథకం కింద పది యూనిట్లు మంజూరు కాగా అందులో నియోజకవర్గ ఇన్చార్జ్ సిఫార్సు చేసిన వారికి మాత్రమే అందాయి. ♦మండలంలోని కీరమంద పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో మంజూరు అయిన బృందావనం పనులు, వర్మీకంపోస్టు తొట్టెల నిర్మాణాలు, నీరు– చెట్టు కింద చేపట్టి చెక్‌డ్యామ్ నిర్మాణపనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా స్థానిక ఎంపీటీసీ శీనప్ప నిధులు స్వాహా చేశాడు. ♦ బంగారుపాళెం మండలం తగ్గువారిపల్లె పంచాయతీ పరిధిలో ఇటీవల రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. మాజీ ఉపసర్పంచ్ లోకనాథనాయుడు పనులన్నీ నాసిరకంగా చేసి నిధులు కాజేశారు. ♦ బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లెలో టీడీపీ నాయకుడు రవీంద్ర గత ఏడాది రూ.10 లక్షలతో చెక్‌డ్యాంను నాసిరకంగా నిర్మించి నిధులు మింగేశాడు. ♦ బంగారుపాళెం మండలంలోని కాటప్పగారిపల్లె రోడ్డుపనులు, క్రీడాకోర్టుల నిర్మాణంలో టీడీపీ నాయకుడు చేతివాటం చూపించాడు. ♦ మండల కేంద్రం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఆవరణలో గత ఏడాది ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్రీడాకోర్టులను మంజూరు చేసింది. వాలీబాల్, రన్నింగ్ ట్రాక్, ఖోఖో కోర్టుల నిర్మాణానికి రూ 2.63 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది. పట్టణ టీడీపీ నాయకుడు చరణ్‌చౌదరి క్రీడా కోర్టు నిర్మాణ పనులను చేపట్టాడు. ఏడాది అవుతున్నా వాలీబాల్, ఖోఖో కోర్టుల నిర్మాణం, రన్నింగ్ ట్రాక్ పనులు పూర్తిస్ధాయిలో చేపట్టలేదు. అరకొర పనులు చేసి రూ.1.43 లక్షల బిల్లులు చేసుకున్నాడు. ♦ టేకుమంద పంచాయతీలో 12 మందికి ఎన్టీఆర్ గృహాలు మంజూరు అయ్యాయి. టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు భాస్కరయ్య కమీషన్లు తీసుకుని తమకు అనుకూలమైన వారికి ఇప్పించాడు. ♦ మండలంలోని కొదలమడుగు పంచాయతీలో పంట సంజీవని కింద 20 పనులు మంజూరు అయ్యాయి. టీడీపీ నాయకుడు అనూప్ పంచాయతీ పరిధిలోని 10 పంట సంజీవని కుంటలను రైతులకు ఉపయోగపడని కొండప్రాంతాల్లో తవ్వి నిధులు కాజేశారు. రైతు రథాలన్నీ వారికే.. తవణంపల్లె మండలంలో రైతు రథం పథకం కింద 2017–18లో 10 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అదేవిధంగా 2018–19లో11 రైతురథం ట్రాక్టర్లు మంజూరు కాగా అన్ని టీడీపీ కార్యకర్తలకు మంజూరు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి లలితకుమారి, జెడ్పీటీసీ చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం రాయితీని టీడీపీ నాయకులే ఆర్జించారు. పథకాల మంజూరులో పైసా వసూల్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 2017–2019లో సబ్సిడీ రుణాలు 210 మంజూరు కాగా, నిజమైన లబ్ధిదారులకు కాకుండా అ«ధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇచ్చారు. నాయకులు చెప్పనవారికే బ్యాంకర్లు ఓకే అనడం గమనార్హం. రూ.లక్ష రుణానికి, రూ.10వేలు, రూ.50వేలు రుణాలకు రూ.5 వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై చాలామంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పింఛన్లు 210, ఎన్టీఆర్ ఇళ్లు 121 మంజూరు కాగా, వాటిని జన్మభూమి కమిటీల అండతో తమకు అనుకూలంగా ఉన్న వారికి మంజూరు చేయించారు. దీంతో నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదు. అధికార పార్టీ నాయకులంటే అధికారులకు ఎందుకు భయం అధికార పార్టీ నాయకులంటే అధికారులకు ఎందుకు భయం తెలియలేదు. వారు కూడా మనుషులే. చెరువు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేసినప్పుడు నిజాలను గుర్తించి అక్రమాలు తొలగించాలి, అంతేగానీ నాన్చుకుంటూ ఉండడం ఎందుకో. అ«ధికారులు భయ పడకుండా పనులు చేయాలి. –వేణు. ఆయకట్టు రైతు అక్రమంగా పంటలు పండిస్తున్నారు చాలామంది రైతులు అక్రమంగా పంటలు పండిస్తున్నారు. పండిస్తే పర్వాలేదు. మళ్లీ ఆ భూమి మాదే అనే పరిస్థితికి వస్తున్నారు. ఎవరూ కూడా చెరువుల భూముల్లో పంటలు పండించకుండా అధికారులు చూడాలి. –సుందరమూర్తి, చెరువు ఆయకట్టు దారు అన్ని అర్హతలు ఉన్నా మంజూరు కాలేదు సబ్సిడీ రుణాలకు అప్లికేషన్ వేశాను. ఇంటర్య్వూలకు వెళ్లాను. అన్ని అర్హతులు ఉన్న నాకు సబ్సిడీ రుణం మంజూరు కాలేదు. అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు అని చెప్పారు. చివరకు కలక్టర్‌కు ఫిర్యాదు చేశాను. కానీ నాకు రుణం మంజూరు కాలేదు. –అన్న, యాదమరి మండలం