Cosmetic products
-
హాట్ టాపిక్‌గా మారిన పుతిన్ కాస్మోటిక్ చికిత్స! ముఖంలో మెరుపు పోయినట్లేనా..
Putin's use of Botox First In Visit Kyiv: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దురాక్రమణ కారణంగా రష్యా అధ్యక్షుడు యుద్ధ నేరస్తుడనే కళంకాన్ని మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం యుద్ధం ఆపాల్సిందే అని చెప్పిన వినకుండా మరింత దాడులకు తెగబడటంతో రష్యాని పై మరిన్ని ఆంక్షల కొరడా ఝళిపించేందుకు ప్రపంచ దేశాలన్ని రెడీ అయ్యాయి. యుద్ధం మొదలైన క్రమంలోనే పాశ్చాత్య దేశాలు ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచదేశాలన్న రష్యాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు సాగించేది లేదంటూ దిగ్గజ కంపెనీలు వీడిపోవడం మెదలైంది. సొంత దేశం కూడా పతిన్కి వ్యతిరేకమైంది. ఈ నేపథ్యంలో పుతిన్ సౌందర్య సాధనాలకు సంబంధించిన విషయాలు గుప్పుమన్నాయి. పుతిన్ బొటాక్స్ అనే సౌందర్య సాధనాలను వాడుతారంటూ పలు వదంతులు హల్చల్ చేస్తున్నాయి. ఆయన 2011లో తొలిసారిగా కైవ్‌ని సందర్శించినప్పుడూ బొటాక్స్ వాడరాని అప్పుడూ అతని కంటికి గాయమైందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇటీవలే రష్యాపై ఆర్థిక దండన నేపథ్యంలో కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్యాన్సర్, మధుమేహం వంటి క్లిష్టమైన వ్యాధులకు మందులను సరఫరా చేస్తాం తప్ప మిగతా వాటిని నిలిపేస్తున్నామని ప్రకటించాయి. అయితే బొటాక్స్ అనేది ముఖం మీద ముడతలు కనిపించనీయకుండా అందంగా ఉంచేందుకు వాడతారు. ఈ అరవై-తొమ్మిది ఏళ్ల పుతిన్ తరచుగా మృదువైన నుదురు, గులాబీ బుగ్గలు ముడతలు లేని కంటి ప్రాంతం ఉండేలా జాగ్రత్తపడుతుంటారని, అందుకోసం ఎన్నో ఏళ్లుగా బొటాక్స్ అనే కాస్మోటిక్ చికిత్సను తీసుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ప్రముఖ సౌందర్య వైద్యులలో ఒకరైన సిడ్నీకి చెందిన డాక్టర్ జేక్ స్లోన్ పేర్కొన్నాడు. ఈ బోటాక్స్ అనే కాస్మోటిక్ మందులను అబీవ్ అనే ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పతి చేస్తుంది. అయితే తాత్కాలికంగా ఇతర మందుల సరఫరాను నిలిపేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇది కూడా ఉంది. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
నిమ్మ ఆకులతో ప్రయోజనాలెన్నో..
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో.. ఆకులు కూడా అంతే ఉపయోగమైనవి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. అంతే! నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. -
పండ్లతో మేనికాంతి...
బ్యూటీ దుమ్ము, ఎండ, కాలుష్యం, రసాయన సౌందర్య ఉత్పత్తుల మూలంగా చర్మం నల్లబడటమే కాకుండా పొడిబారి జీవం కోల్పోతుంది. అలాంటప్పుడు పండ్లతో మసాజ్ చేసుకోవడంవల్ల కణాలను శుభ్రపరిచి, చర్మానికి విశ్రాంతినివ్వడమే కాదు పండ్లు సహజ కాంతిని, మెరుపును తీసుకువస్తాయి. పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లని నీటితో శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లైనా ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం నిస్తేజంగా మారదు. జిడ్డు చర్మం గలవారికి టొమాటో సరైన ఎంపిక. సాధారణంగా జిడ్డుచర్మం గలవారికి మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన టొమాటా గుజ్జును ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. స్క్రబ్ చేయడం వల్ల మొటిమలున్న చోట చర్మం ఎర్రబడే అవకాశం ఉంది. 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా రుద్దుతూ కడగాలి. చర్మంపై స్వేదరంధ్రాలు శుభ్రపడి మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖంపై అక్కడక్కడా మొటిమలు విపరీతంగా గడ్డల్లా ఏర్పడుతుంటాయి. దీనినే యాక్నె అంటుంటారు. ఈ సమస్య నివారణకు దాక్ష్ర పండ్లు మహత్తరంగా పనిచేస్తాయి. ద్రాక్షపండ్ల గుజ్జును ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయకారంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచి, మెత్తని కాటన్ క్లాత్‌తో తడిని అద్దాలి. ఎండకు కమిలిన చర్మం (ట్యాన్) నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్య నుంచి స్ట్రాబెర్రీ సత్వర ఉపశమనం ఇస్తుంది. స్ట్రా బెర్రీలను కొద్దిగా నీరు కలిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును ట్యాన్ అయిన శరీర భాగాలకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మం పూర్వపు కాంతిని పొందుతుంది.