Putin's use of Botox First In Visit Kyiv: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దురాక్రమణ కారణంగా రష్యా అధ్యక్షుడు యుద్ధ నేరస్తుడనే కళంకాన్ని మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం యుద్ధం ఆపాల్సిందే అని చెప్పిన వినకుండా మరింత దాడులకు తెగబడటంతో రష్యాని పై మరిన్ని ఆంక్షల కొరడా ఝళిపించేందుకు ప్రపంచ దేశాలన్ని రెడీ అయ్యాయి. యుద్ధం మొదలైన క్రమంలోనే పాశ్చాత్య దేశాలు ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రపంచదేశాలన్న రష్యాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు సాగించేది లేదంటూ దిగ్గజ కంపెనీలు వీడిపోవడం మెదలైంది. సొంత దేశం కూడా పతిన్‌కి వ్యతిరేకమైంది. ఈ నేపథ్యంలో పుతిన్ సౌందర్య సాధనాలకు సంబంధించిన విషయాలు గుప్పుమన్నాయి. పుతిన్ బొటాక్స్ అనే సౌందర్య సాధనాలను వాడుతారంటూ పలు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన 2011లో తొలిసారిగా కైవ్‌ని సందర్శించినప్పుడూ బొటాక్స్ వాడరాని అప్పుడూ అతని కంటికి గాయమైందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇటీవలే రష్యాపై ఆర్థిక దండన నేపథ్యంలో కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్యాన్సర్, మధుమేహం వంటి క్లిష్టమైన వ్యాధులకు మందులను సరఫరా చేస్తాం తప్ప మిగతా వాటిని నిలిపేస్తున్నామని ప్రకటించాయి.
అయితే బొటాక్స్ అనేది ముఖం మీద ముడతలు కనిపించనీయకుండా అందంగా ఉంచేందుకు వాడతారు. ఈ అరవై-తొమ్మిది ఏళ్ల పుతిన్ తరచుగా మృదువైన నుదురు, గులాబీ బుగ్గలు ముడతలు లేని కంటి ప్రాంతం ఉండేలా జాగ్రత్తపడుతుంటారని, అందుకోసం ఎన్నో ఏళ్లుగా బొటాక్స్ అనే కాస్మోటిక్ చికిత్సను తీసుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ప్రముఖ సౌందర్య వైద్యులలో ఒకరైన సిడ్నీకి చెందిన డాక్టర్ జేక్ స్లోన్ పేర్కొన్నాడు. ఈ బోటాక్స్ అనే కాస్మోటిక్ మందులను అబీవ్ అనే ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పతి చేస్తుంది. అయితే తాత్కాలికంగా ఇతర మందుల సరఫరాను నిలిపేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇది కూడా ఉంది.
(చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!)
Comments
Please login to add a commentAdd a comment