pharmaceutical companies
-
130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మా
దేశీయ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి రెట్టింపు స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) ప్రెసిడెంట్, టోరెంట్ గ్రూప్ ఛైర్మన్ సమీహ్ మెహతా తెలిపారు. అప్పటికి 120–130 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,79,400 కోట్లు)కు చేరుకోవచ్చని, 2047 నాటికి 400–450 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకోగలదని ఆయన పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో భారతీయ ఫార్మా(Pharma) పరిశ్రమ 20 రెట్లు పెరిగిందని వివరించారు.1999–2000లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్నది 58 బిలియన్ డాలర్లకు చేరిందని మెహతా చెప్పారు. వాణిజ్య మిగులుకు దోహదపడుతున్న అయిదు రంగాల్లో ఇది కూడా ఒకటని ఐపీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాసిన ఆర్టికల్‌లో ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా ఉద్యోగాల కల్పన నుండి గ్లోబల్ ట్రేడ్(Global Trade) వరకు వివిధ అంశాల్లో ఫార్మా కీలక పాత్ర పోషించగలదని ఆయన వివరించారు. సానుకూల పాలసీలు, పరిశోధనలు.. అభివృద్ధిపై భారీ పెట్టుబడులు, చౌకగా వైద్యసేవలను అందుబాటులోకి తేవడం మొదలైనవన్నీ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు పని చేసేందుకు దోహదపడతాయని మెహతా తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలకు నెలకొన్న డిమాండ్‌లో భారత్ 20 శాతం ఔషధాలను సరఫరా చేస్తోందని, పరిమాణం.. విలువపరంగా 11వ ర్యాంకులో ఉందని వివరించారు. ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!నష్టాల్లోకి మొబిక్విక్డిజిటల్ వాలెట్ సేవలందించే మొబిక్విక్(Mobikwik) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ.3.6 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.6 కోట్ల స్టాండెలోన్ నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ.207 కోట్ల నుంచి రూ.297 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.186 కోట్ల నుంచి రూ.287 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ కాలంలో రూ.7 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గత నెల లో లిస్టయిన వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. తదుపరి వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులు వెచ్చిస్తుండటంతో నష్టాలు నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. -
హాట్ టాపిక్‌గా మారిన పుతిన్ కాస్మోటిక్ చికిత్స! ముఖంలో మెరుపు పోయినట్లేనా..
Putin's use of Botox First In Visit Kyiv: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దురాక్రమణ కారణంగా రష్యా అధ్యక్షుడు యుద్ధ నేరస్తుడనే కళంకాన్ని మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం యుద్ధం ఆపాల్సిందే అని చెప్పిన వినకుండా మరింత దాడులకు తెగబడటంతో రష్యాని పై మరిన్ని ఆంక్షల కొరడా ఝళిపించేందుకు ప్రపంచ దేశాలన్ని రెడీ అయ్యాయి. యుద్ధం మొదలైన క్రమంలోనే పాశ్చాత్య దేశాలు ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచదేశాలన్న రష్యాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు సాగించేది లేదంటూ దిగ్గజ కంపెనీలు వీడిపోవడం మెదలైంది. సొంత దేశం కూడా పతిన్కి వ్యతిరేకమైంది. ఈ నేపథ్యంలో పుతిన్ సౌందర్య సాధనాలకు సంబంధించిన విషయాలు గుప్పుమన్నాయి. పుతిన్ బొటాక్స్ అనే సౌందర్య సాధనాలను వాడుతారంటూ పలు వదంతులు హల్చల్ చేస్తున్నాయి. ఆయన 2011లో తొలిసారిగా కైవ్‌ని సందర్శించినప్పుడూ బొటాక్స్ వాడరాని అప్పుడూ అతని కంటికి గాయమైందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇటీవలే రష్యాపై ఆర్థిక దండన నేపథ్యంలో కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్యాన్సర్, మధుమేహం వంటి క్లిష్టమైన వ్యాధులకు మందులను సరఫరా చేస్తాం తప్ప మిగతా వాటిని నిలిపేస్తున్నామని ప్రకటించాయి. అయితే బొటాక్స్ అనేది ముఖం మీద ముడతలు కనిపించనీయకుండా అందంగా ఉంచేందుకు వాడతారు. ఈ అరవై-తొమ్మిది ఏళ్ల పుతిన్ తరచుగా మృదువైన నుదురు, గులాబీ బుగ్గలు ముడతలు లేని కంటి ప్రాంతం ఉండేలా జాగ్రత్తపడుతుంటారని, అందుకోసం ఎన్నో ఏళ్లుగా బొటాక్స్ అనే కాస్మోటిక్ చికిత్సను తీసుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ప్రముఖ సౌందర్య వైద్యులలో ఒకరైన సిడ్నీకి చెందిన డాక్టర్ జేక్ స్లోన్ పేర్కొన్నాడు. ఈ బోటాక్స్ అనే కాస్మోటిక్ మందులను అబీవ్ అనే ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పతి చేస్తుంది. అయితే తాత్కాలికంగా ఇతర మందుల సరఫరాను నిలిపేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇది కూడా ఉంది. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
రోగుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: మందుల కంపెనీలు ధరలు పెంచి ప్రజలను ముంచుతున్నాయి. వందలు వేల శాతం వరకు పెంచి భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలా కంపెనీలు ఇష్టారాజ్యంగా మందుల ధరలను పెంచి ప్రజారోగ్యాన్ని బజారులో సరుకుగా చేస్తున్నాయి. దీనిపై నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపకులు పి.ఆర్.సోమాని పెద్దఎత్తున ఉద్యమానికి తెరలేపారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వేటి ధరలు ఎంతెంత పెరిగాయన్న దానిపై ఆయన ఒక అధ్యయన పత్రం తయారు చేశారు. కొన్ని కంపెనీలు 3 వేల శాతం వరకు మందుల ధరలు పెంచేసి ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నాయని ఆయన తన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. 11 వేల రకాల మందులు మూడువేల శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆయన విశ్లేషించారు. అధిక ధరలకు విక్రయించే మందుల్లో కేన్సర్‌సహా వివిధ ప్రమాదకర వ్యాధులకు చెందినవే ఉండటం గమనార్హం. దేశంలో మందుల ధరలను అదుపులో ఉంచేందుకు తగిన డ్రగ్ పాలసీ లేకపోవడంతో మందుల తయారీదారులు రెచ్చిపోయి ఇష్టారీతిన ధరలను ముద్రిస్తున్నారన్న విమర్శలున్నాయి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌తోపాటు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ఉపకరణాలపై కూడా అధిక మొత్తంలో ధరలను ముద్రించి పేద ప్రజలను దోచుకుంటున్నాయని ఆ నివేదికలో వెల్లడించారు. ఆయన విడుదల చేసిన నివేదిక ప్రకారం... 8 రూపాయల మందు 160 రూపాయలకు సిన్వాక్స్ 25టీ అనే మందు హోల్‌సేల్ ధర ఎనిమిది రూపాయలు కాగా, దాన్ని రూ.160కు రిటైల్‌గా అమ్ముతున్నారు. అంటే 2001 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక అబ్బోట్ కంపెనీ న్యూకోల్డ్ ట్యాబ్లెట్ హోల్‌సేల్ ధర రూ. 2.20. కానీ మార్కెట్లో రూ. 39.80కు విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా 1,809 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. సిప్లా కంపెనీకి చెందిన ఒకాసెట్–ఎల్‌ను కంపెనీ రూ. 3.70 విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.57కు విక్రయిస్తున్నారు. అంటే 1,540 శాతం అధిక ధర. ఎమ్క్యూర్ కంపెనీకి చెందిన కార్బెటా ఇంజక్షన్ ధర రూ. 8.50 కాగా, మార్కెట్లో రూ.130కు విక్రయిస్తున్నారు. రిలయన్స్ సంస్థకు చెందిన డయాలసిస్ ఇంజక్షన్ ఇరెత్రొపోయిటిన్–ఐపీ 4000 ఐయూను రూ.150కు కొనుగోలుచేసి, వాటిపై రూ.1,400 ధర ముద్రిస్తున్నారు. అంటే 933 శాతం అధిక ధరతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఐవీ సెట్ పది రూపాయలకు అమ్మాల్సింది రూ.150కు విక్రయిస్తున్నారు. అంటే 1,500 శాతం అధికం. మందుల ధరలు అధికంగా ఉండటం, ప్రాణాంతక వ్యాధులకు చెందిన వాటిపై భారీగా వసూలు చేయడంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మనదేశంలో 2018లో 8 లక్షల మంది కేన్సర్‌తో చనిపోయారు. 2040 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రాణాంతక వ్యాధులకు చెందిన మందులనూ భారీ ధరలకు అమ్ముతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కుటుంబాలైతే వైద్యంకోసం, మందుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాయి. అప్పుల పాలవుతున్నాయి. చట్టం బలహీనంగా ఉండటమే: సోమాని చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని మందుల కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయని, ప్రతి ఏడాది రూ. లక్ష కోట్ల ప్రజాధనం దోపిడీకి గురవుతుందని నిజామాబాద్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీఆర్ సోమాని ఆరోపించారు. మందుల విక్రయాల్లో పలు తయారీ సంస్థలు గరిష్ట అమ్మకపు ధర (ఎంఆర్పీ)ని ఎక్కువ ముద్రించి ప్రజలను దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని మందులపై 3,000 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారని అన్నారు. డ్రగ్ ప్రైజింగ్ కంట్రోల్ యాక్ట్‌లోని లొసుగులను అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని విమర్శించారు. మందుల కంపెనీల మధ్య పోటీ పెరిగి తయారీదారులు తమ మందులను పెద్దఎత్తున అమ్మాలని చూస్తున్నారని, వీరికి సాయంచేసే రిటైల్ వ్యాపారులు, కొందరు వైద్యులు తమ స్వార్థంకోసం కంపెనీలపై ఒత్తిడి తేవడంతో మందులపై ఎక్కువ ధరలను ముద్రిస్తున్నారని తెలిపారు. వీటిపై అవగాహనలేని ప్రజలు రోగం తగ్గించుకోవడానికి చెప్పిన ధరలను భరిస్తూ ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారన్నారు. తమ పోరాట ఫలితంగా 42 రకాల కేన్సర్ మందుల ధరలను నియంత్రించారన్నారు. డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి చెందిన పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ఇంజక్షన్ ధర ఇప్పటివరకు రూ.10,790 ఉండగా, త్వరలో రూ.2,650కు అందుబాటులోకి రానుందన్నారు. ఇంకా కొన్నింటి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని, కానీఇంకా వేలాది మందుల ధరలు తగ్గాల్సి ఉందన్నారు. -
పెద్ద ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆదాయ వృద్ధి: క్రిసిల్
న్యూఢిల్లీ: అమెరికాలో విక్రయాలు మెరుగుపడడం, రూపాయి బలహీతన, దేశీయంగా డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలతో పెద్ద ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండంకెల్లో ఆర్జించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన దేశీయ ఫార్మా కంపెనీలకు రెండంకెల్లో ఆర్జన మేలు చేస్తుందని పేర్కొంది. అమెరికా, దేశీయ మార్కెట్లు వీటికి 30 శాతం, 35 శాతం మేర ఆదాయలు తెచ్చిపెట్టేవిగా తెలిపింది. 20 లిస్టెడ్ కంపెనీల మొదటి త్రైమాసికాల్లో ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనిపించాయని పేర్కొంది. ‘‘మొదటి త్రైమాసికంలో అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాల్లో 7 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ మార్కెట్ నుంచి ఆదాయాల్లో 25 శాతం వృద్ధి ఉంది. పెద్ద ఫార్మా కంపెనీల ఆదాయాలు 12–13 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది’’ అని క్రిసిల్ తెలిపింది. -
చక్కెర గుళికలు నొప్పిని తగ్గిస్తాయా?
పిల్లలు అనుకోకుండా కిందపడ్డారనుకోండి.. నొప్పి ఏమార్చేందుకు బెల్లం ముక్క నోట్లో పెట్టడం మనం చూసే ఉంటాం. గాయం తాలూకూ నొప్పి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ఇది పనికొస్తుందని మనం ఇప్పటివరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే తగిన మెదడు నిర్మాణం, మానసిక స్థితి ఉన్న వారికి ఈ తీపి కాస్తా శక్తిమంతమైన మందుగానూ పనిచేస్తుందని అంటున్నారు నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఈ పరిశోధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంచనా. అనేక దుష్ప్రభావాలను చూపించే రసాయనిక మందుల స్థానంలో ఒట్టి చక్కెర గుళికలు ఇవ్వవచ్చునని, ఫార్మా కంపెనీలు మందుల ప్రభావశీలతను పరీక్షించేందుకు కొంతమందికి ఇచ్చే ఉత్తుత్తి మాత్రలను లేకుండా చేయవచ్చునని, ఆసుపత్రి ఖర్చులూ తగ్గుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వానియా అప్కారియన్ వివరించారు. నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం నొప్పితో బాధపడుతున్న వారికి ఏవో మందులిస్తున్నామని కాకుండా.. చక్కెర గుళికలే ఇస్తున్నాంగానీ.. అది నొప్పి తగ్గిస్తుందని నమ్మబలికితే చాలని వివరించారు. నడుం నొప్పితో బాధపడుతున్న కొందరిపై తాము ప్రయోగాలు నిర్వహించి మరీ ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. -
లోటస్ ఫార్మా కంపెనీ మూతపడాలె..
జమ్మికుంట(హుజూరాబాద్): ‘నా కొడుకు మతిస్థిమితం కోల్పోయేందుకు కారణమైన లోటస్ ఔషధ కంపెనీ మూతపడాలె.. నాకు న్యాయం జరగకుంటే ఢిల్లీ వరకూ వెళ్తా.. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలి..’అంటూ ఔషధ ప్రయోగ బాధితుడి తల్లి కమల ఆరోపించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన చిలువేరి కమల కుమారుడు అశోక్ కుమార్ ఔషధ ప్రయోగంతో మతి స్థిమితం కోల్పోయినట్లు గతనెల 28న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కమల ఆదివారం జమ్మికుంటలోని గాంధీ చౌక్ వద్ద నిరసన దీక్షకు దిగింది. ఔషధ ప్రయోగ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. లోటస్ ఫార్మా కంపెనీపై ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేయకుండా తన కొడుకు శ్యాంసుందర్‌తో గతనెల 29న తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఆమె ఆరోపించింది. అశోక్‌కుమార్‌కు వైద్య ఖర్చులతోపాటు కుటుంబానికి సహాయం అందిస్తామని, బెంగళూర్‌కు రావాలంటూ లోటస్ కంపెనీ పేరుతో వచ్చిన లేఖ కరీంనగర్ నుంచి వచ్చిందేనని కమల ఆరోపించింది. బెంగళూర్‌కు వెళ్తే లోటస్ కంపెనీ సహాయం చేస్తుందని పోలీసులు చెబుతున్నారని, పోలీసులు వస్తే వెళ్తామని పేర్కొంది. -
ఫార్మా’కు మళ్లీ అమెరికా కష్టాలు
హైదరాబాద్: దేశీ ఫార్మా సంస్థలకు కీలక మార్కెట్టయిన అమెరికా నుంచి అదేపనిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. భారీ ఎత్తున పలు సంస్థల తాలూకు తయారీ యూనిట్లను తనిఖీ చేయటం, ఇంపోర్ట్ అలర్ట్‌లు జారీ చేయటం వంటి వ్యవహారాలన్నీ గతేడాది నడిచాయి. తాజాగా 18 సంస్థలపై కూడబలుక్కుని కొన్ని ఔషధాల రేట్లను కృత్రిమంగా పెంచేశాయంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్(డీఆర్ఎల్), సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ తదితర దిగ్గజాలున్నాయి. దీంతో వీటన్నింటిపై అమెరికా న్యాయశాఖ దృష్టి సారిస్తోంది. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించారు. ‘‘మొదట 2 ఔషధాలకు సంబంధించి 6 సంస్థలపై ఫిర్యాదులొచ్చాయి. ఇపుడు ఔషధాల సంఖ్య 6కు, కంపెనీల సంఖ్య 18కి పెరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు మరో 45 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ అంశంపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించినట్లు ఫెర్గూసన్ తెలియజేశారు. జనరిక్ ఔషధాల రేట్లను పెంచేయడం, పోటీని తగ్గించుకునేలా మార్కెట్‌ను వాటాలుగా పంచుకోవడం ద్వారా ఈ కంపెనీలు విశ్వాస చట్టాలను ఉల్లంఘించాయని రాష్ట్రాలు ఆరోపించాయి. ఈ పరిణామాలతో కొన్ని ఔషధాల ధరలు ఏకంగా 1,000 శాతం మేర పెరిగిపోయాయని పేర్కొన్నాయి. సాధారణంగా బ్రాండెడ్ ఔషధాల పేటెంటు గడువు ముగిశాక ఇతర సంస్థలు వాటి జనరిక్ వెర్షన్‌ను తయారు చేసి చౌకగా అందుబాటులోకి తెస్తుంటాయి. బ్రాండెడ్ ఔషధం కన్నా వీటి రేటు దాదాపు 80 శాతం దాకా తక్కువగా ఉంటుంది. 2015లో అమెరికా మార్కెట్లో జనరిక్స్ అమ్మకాలు దాదాపు 74.5 బిలియన్ డాలర్లు. అమెరికాలో డాక్టర్లు రాసే ఔషధాల్లో 88 శాతం జనరిక్ ఫార్మా సంస్థల ఉత్పత్తులే ఉంటున్నాయి. ప్రధానంగా జనరిక్స్ తయారు చేసే భారత ఫార్మా సంస్థలకు అమెరికా మార్కెట్ కీలకంగా ఉంటోంది. ఇప్పటిదాకా అక్కడి ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీల రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీ సంస్థలకు తాజా అభియోగాలు మరింత సమస్యాత్మకంగా మారనున్నాయి. విచారణ మొదలైందిలా...: కొన్ని ఔషధాల ధరలు అనుమానాస్పద స్థాయిలో వెయ్యి శాతానికి పైగా పెరిగిపోవడంపై 2014 జూలైలో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం విచారణ ప్రారంభించింది. తరవాత ఈ జాబితాలో మరిన్ని రాష్ట్రాలు చేరాయి. దీనిపై జరిగిన దర్యాప్తులో కొన్ని జనరిక్ ఔషధాల రేట్లను కుమ్మక్కై నిర్ణయించడం, అధిక ధరలను కొనసాగించడం, మార్కెట్లను పంచుకోవడం, తద్వారా పోటీని తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు జరిగాయనేందుకు పలు కంపెనీల అధికారులు, మార్కెటింగ్.. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మధ్య ఫోన్‌కాల్స్, టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఆధారాలు దొరికినట్లు అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఆ తర్వాత 2016 డిసెంబర్ 14న యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ హైక్లేట్, మధమేహ చికిత్సలో ఉపయోగించే గ్లైబురైడ్ విషయంలో పెన్సిల్వేనియాలోని ఓ కోర్టులో దావా దాఖలైంది. హెరిటేజ్ ఫార్మా, అరబిందో ఫార్మా యూఎస్ఏ, సిట్రాన్ ఫార్మా, మేన్ ఫార్మా, మైలాన్ ఫార్మా, టెవా ఫార్మా యూఎస్‌ఎలపై(6 సంస్థలు) అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు చేరడంతో ఈ జాబితా డీఆర్ఎల్ సహా 18కి చేరింది. విచారణలో సహకరిస్తాం.. అమెరికా న్యాయశాఖ ఈ విషయంలో విచారణ జరుపుతోందన్న సంగతి తమకు కూడా తెలుసని డీఆర్ఎల్ తెలిపింది. దీనిపై అధికారులకు పూర్తిగా సహకరించడం కొనసాగిస్తామని, న్యాయపరిధిలో ఉన్నందున ఈ అంశంపై వ్యాఖ్య చేయలేమని వివరించింది. మైలాన్ కూడా ఈ అభియోగాలపై స్పందించింది. తాము అంతర్గతంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ధరలపై కుమ్మక్కు అభియోగాలకు ఆధారాల్లేవని పేర్కొంది. -
ఫార్మా కంపెనీ మాకు వద్దంటే.. వద్దు
-
మాయదారి మందులు!
పేరు, రంగు, రుచి, వాసన, ప్యాకింగ్... ఇవన్నీ చూడడానికి అచ్చం ఔషధాలుగానే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్యులు.. ఈ బాటిళ్లలో ద్రవపదార్థం తాగాలంటూ, ఈ గోలీలు మింగాలంటూ రోగులకు ప్రిస్కిప్షన్స్ రాస్తుంటారు. 200 రకాలుగా ఉన్న ఈ బాటిళ్లు, బిళ్లలు మెడికల్ షాపుల్లో తప్ప... ఎక్కడా దొరకవు. ప్రమాణాల ప్రకారం ఇవి ఔషధాలు కావు... కేవలం ఆహార పదార్థాలు. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నా.. ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నాణ్యత లేని పదార్థాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఒక్కసారి రోగం వస్తే వైద్య సేవల కింద సామాన్యుల జీవితాలు అతలాకుతలం అవుతుండడంతో ఔషధాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ చట్టం కింద 384 మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు సాగించాలి. దీంతో ఈ చట్టం పరిధి నుంచి తప్పించుకునేందుకు పలువురు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్-2006 చట్టం పరిధిలో లెసైన్సులు తెచ్చుకుంటున్నారు. ఈ ముసుగులో బలవర్థక ఆహారం పేరుతో కొన్ని ఔషధ కంపెనీలు మందులు తయారు చేస్తూ ఇష్టారీతిగా ధరలు నిర్ణయిస్తూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాయి. ఒంటికి బలాన్ని చేకూర్చే ఆహారం అనే పేరుతో సిరప్, టానిక్, ట్యాబెట్ల అమ్మకాలను యథేచ్చగా సాగిస్తున్నాయి. ఇలా తయారైన సిరప్లు, మల్టీ విటమిన్లు మార్కెట్లో మెడికల్ షాపుల్లో జోరుగా అమ్ముడవుతున్నాయి. కానీ.. ఔషధ ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, ధరల నియంత్రణను పట్టించుకోవడం లేదు. మామూళ్లు అందుతుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఔషధాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒక్కరికీ అనుమతి లేదు... నిబంధనల ప్రకారం ఫుడ్ సెఫ్టీ చట్టం లెసైన్స్‌తో తయారైన మందులు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే తప్పని సరిగా ఫుడ్ లెసైన్స్ తీసుకోవాలి. ఈ మేరకు 2013లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో భాగంగారిజిస్ట్రేషన్కు రూ.100, లెసైన్స్‌కు రూ. 2 వేలుగా నిర్ధారించింది. మన జిల్లాలో 2,100 మెడికల్ షాపులు ఉన్నాయి. ఆస్పత్రులకు అనుబంధంగా మరో 500పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క షాప్‌కూ ఆహార పదార్థాలు అమ్మే అనుమతి లేదు. అయినప్పటికీ ఈ ఉత్పత్తుల అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఫుడ్ సెఫ్టీ లెసైన్స్‌తో ఈ పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటి నాణ్యత, ప్రమణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఫుడ్ ఇన్స్పెక్టర్లది. జిల్లాలో ఒక్కసారి కూడా ఇలాంటి ఉత్పత్తులను వారు పట్టించుకున్న పరిస్థితి లేదు. అటాచ్డ్ షాపుల్లో అధికం... ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం అజామాయిషీ ఉండడంతో వీటి ధరలు నిర్ధారించిన మేరకు ఉంటున్నాయి. దీంతో డాక్టర్లు, మెడికల్ షాపు యజమానులకు కమీషన్లు తక్కువగా వస్తున్నాయి. ఆహార పదార్థాల పేరుతో అమ్ముడయ్యే ఔషధాల ధరల నియంత్రణ లేదు. ఇదే అదునుగా ఫుడ్ లెసైన్స్‌తో అమ్మకాలు సాగిస్తున్న ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. అధిక ధరలు నిర్ణయిస్తున్నారు. వచ్చే లాభా ల్లో డాక్టర్లకు ఎక్కువ శాతం వాటాలు ఇస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ షాపు లు కేంద్రంగా ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోం ది. ఇక్కడికి వచ్చే రోగులు అదే ఆస్పత్రిలో మందు లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో రోగులకు ఈ ఉత్పత్తులను ఎక్కువగా అంటగడుతున్నారు.