Council for Technical Education
-
పాలిటెక్నిక్‌లలో 13 వేల సీట్లు ఖాళీ!
- ముగిసిన తొలిదశ కౌన్సెలింగ్ - జూలైలో రెండో దశ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో పాలిటెక్నిక్ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో కలిపి మొత్తం 50,632 సీట్లు ఉండగా... 37,467 మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే తమకు కేటాయింపు జరిగిన కాలేజీల్లో ప్రవేశం పొందారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 97.84 శాతం మంది అభ్యర్థులు రిపోర్టు చేయగా, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో చేరింది 66.53 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న రెండు ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో మాత్రం సీట్లు పొందిన వారంతా (100శాతం) చేరారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,165 సీట్లు ఖాళీగా మిగిలిపోనున్నాయని అధికార వర్గాల సమాచారం. పాలిసెట్-2016లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సాంకేతిక విద్యా మండలి గత నెల 20 నుంచి నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం 45,644 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే కాలేజీలో చేరేందుకు చివరి రోజైన శనివారం నాటికి 37,467 మంది మాత్రమే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. వచ్చే నెల రెండో వారంలో.. పాలిసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌ను జూలై రెండో వారంలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన కొందరు అభ్యర్థులు పదో తరగతిలో ఫెయిల్ కావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు అంచనా. జూలై 10గా టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన ్నందున రెండో వారంలో రెండోదశ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో మిగిలిపోయిన సీట్లన్నీ రెండోదశలో భర్తీ అవుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఇక సాంకేతిక విద్యామండలి పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీలన్నింటిలో ఈ నెల 9 నుంచే తరగతులు ప్రారంభమైనట్లు కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు
ఈ నెల 20 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2016 కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సాంకేతిక విద్యా మండలి అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న ఈ కౌన్సెలింగ్‌లో పాలిసెట్ ర్యాంకుల వారీగా అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక హెల్ప్‌లైన్ కేంద్రం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు అదనపు హెల్ప్‌లైన్ కేంద్రాలను కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, వనపర్తిలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్, నాగార్జున డిగ్రీ కళాశాల, ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం (రుద్రంపూర్) ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్, నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, మెదక్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, రాజగోపాల్‌పేట (సిద్దిపేట) ప్రభుత్వ పాలిటెక్నిక్, కరీంనగర్‌లోని బీఆర్ఏజీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్ లో జేఎన్టీయూ, సాంకేతిక విద్యాభవన్, మారేడుపల్లిలోని ప్రభుత్వ ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, పాతబస్తీలోని కులీకుతుబ్‌షా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.