Counting by-election
-
ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్య ఉత్తర్తులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని, సంఖ్యలో గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధా/æ్ఞలు విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. -
మమతా బెనర్జీ భవితవ్యం తేలేది నేడే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆమె పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
ఆధిక్యంలో దూసుకుపోతున్న సుగుణమ్మ
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఆధిక్యంలో దూసుకపోతున్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రీదేవిపై సుమారు 67,366 ఓట్లకు పైగా మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మొత్తం 19 రౌండ్లలో ఇప్పటివరకూ 11 రౌండ్ల లెక్కింపు పూర్తయినట్లు సమాచారం. ఇక దాదాపు ప్రతీరౌండ్ లోనూ టీడీపీ వెయ్యి వోట్లకు పైగా దక్కించుకుంటూ దూసుకుపోతోంటే,, కాంగ్రెస్ మాత్రం100 ఓట్లకు మాత్రమే పరిమితమవుతోంది. కాగా సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు. -
నేడే ఉప ఎన్నిక కౌంటింగ్
- లక్ష ఓట్లతో గెలుస్తామని టీడీపీ ధీమా - గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశలు - ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ - 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కింపు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ఫలితం సోమవారం తేలనుంది. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వెల్లడించారు. 14 టేబుళ్లు, 19 రౌండ్లలో లెక్కంపు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2,94,781 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 1,47,153 మంది అంటే 49.92 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషులు 78,238 మంది, మహిళలు 68,915 మంది ఉన్నారు. ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు. కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు.. కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్ వద్ద సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించరు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ హర్షదీప్ కాంబ్లే కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు.