బహుళ భాషలు మనదేశానికి సంపద: స్మృతి
చెన్నై: బహుళ భాషలు భారతదేశానికి తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద అని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఈ భిన్నత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం చెన్నైలోని యతిరాజ్ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వందలకొద్దీ మాతృభాషలతో భారతదేశం గొప్ప భాషా వైవిధ్యాన్ని కలిగి ఉందన్నారు. మనదేశంలో వెయ్యికంటే ఎక్కువ భాషలను మాతృభాషగా మాట్లడే ప్రజలు ఉన్నారన్నారు.