country gun
-
పిన్ నంబర్ కోసం వచ్చి బుక్కయ్యారు
లక్నో: ఓ వ్యక్తి దగ్గర నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన ఇద్దరు దొంగలు ఏటీఎం పిన్ నంబర్ కోసం వచ్చి పోలీసుల చేతికి చిక్కారు. ఈ సంఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం రాత్రి ఓ వ్యక్తి డిన్నర్ చేయడం కోసం బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి.. సదరు వ్యక్తిని గన్‌తో బెదిరించారు. అతడి వద్ద నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. దానిలో బాధితుడి ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డు ఉన్నాయి. కొద్ది దూరం వెళ్లిన నిందితులు వెనక్కి వచ్చి.. ఏటీఎం పిన్ నంబర్ చెప్పాల్సిందిగా బాధితుడిని బెదిరించారు. అది తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ విషయం గురించి బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు నిందితుల బైక్‌ను అడ్డుకున్నారు. దాంతో పోలీసుల మీద కాల్పులకు తెగ బడ్డారు. (లారీ చోరీ చేసి..కరోనా పరీక్షకు) దీని గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. ‘చెక్ చేయాలి.. బైక్‌ను ఆపాల్సిందిగా నిందితులకు చెప్పాం. కానీ వారు పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో అధికారులు కూడా కాల్పులు జరపడంతో వారికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాం’ అని తెలిపారు. నిందితులిద్దరిని గౌరవ్ సింగ్, సదానంద్‌గా గుర్తించారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.3200 నగదు, ఏటీఎం కార్డ్, పర్స్‌తో పాటు రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. -
యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకీ తయారీ!
తుప్రాన్: ఓ యువకుడు తాను స్వయంగా తయారు చేసిన తుపాకీని పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ డివిజన్ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోడూర్ గ్రామానికి చెందిన మరదన రమేశ్ (26) మనోహరాబాద్ మండలం రమాయిపల్లి సమీపంలోని ఓ స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ చూసి నాటు తుపాకీని, మూడు తూటాలను తయారు చేశాడు. తుప్రాన్ గ్రామ పంచాయతీ వెనుకాల ఉన్న కల్లు దుకాణంలోకి వెళ్లి అక్కడ ఓ తూటాను పేల్చాడు. దీంతో జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నాటు తుపాకీ, పేల్చిన రెండు తూటాలతో పాటు పేలని మరో తూటాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కలకలం
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం పెద్దబుద్దిడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు నాటు తుపాకులతో సంచరించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఐదుగురు నాటు తుపాకీలు, లైట్లతో అటుగా వెళ్లారు. బహిర్బూమికి వెళ్లిన యువకులు దీన్ని గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులను 'మీరెవరు అంటూ ప్రశ్నించగా'.. వారు పరారయ్యారు. ఆ సమయంలో ఓ నాటు తుపాకీ కిందపడింది. దొరికిన నాటు తుపాకీని యువకులు మంగళవారం పోలీసులకు అప్పగించారు. యువకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.