court permission
-
Delhi liquor scam: జైలు నుంచి ఇంటికెళ్లిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కొద్దిసేపు ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓదార్చేందుకు ఆరు గంటలపాటు ఇంటికి వెళ్లేందుకు సిసోడియాకు ఢిల్లీ సిటీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని మధుర రోడ్డులో గల నివాసానికి శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగింటివరకు ఆయనకు అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా సిసోడియా భార్య సీమా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ సిసోడియా గతంలో కోర్టును కోరిన విషయం విదితమే. దీంతో ఆయనకు కోర్టు ఇలా కొద్దిగంటలపాటు ఉపశమనం కలి్పంచింది. అయితే బయట ఉన్న సమయంలో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. గతంలోనూ భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచి్చనా ఇంటికొచ్చే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కలవలేకపోయారు. -
Hyderabad: కోర్టు అనుమతితో మైనర్ బాలికకు గర్భస్రావం
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన బాలిక.. తన భవిష్యత్ నిమిత్తం గర్భస్రావానికి ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయస్థానం సదరు బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడి (25)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరిని వదిలేసి అతను నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీలో తన దూరపు బంధువుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 8 వ తరగతి చదువుతున్న ఆమె కూతురిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. బాలిక తల్లి ఈ విషయాన్ని కనిపెట్టి కూతురితో కలిసి వెస్ట్‌జోన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించింది. రెండు వారాల క్రితం పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక మైనర్ కావడం, గర్భం కూడా దాల్చడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని తల్లిదండ్రులతో కలిసి ఆశ్రయించింది. నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఆ బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం వైద్యులు మైనర్ బాలికకు గర్భస్రావం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (Hyderabad: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్) -
మద్యం స్కాంపై విచారణకు కోర్టు అనుమతి కోరుతాం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాంపై విచారణకు కోర్టు అనుమతి కోరుతామని ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. కెనైటా, లేపాక్షి, వాన్ పిక్ భూ కేటాయింపులను రద్దు చేసేందుకు న్యాయ సలహాలు తీసకుంటామన్నారు. వీటిపై కేబినెట్‌కు సిఫార్సు చేయాలని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని పల్లె చెప్పారు. గత ప్రభుత్వంలో రూ. 120 కోట్లతో నిర్వహించిన మేఘమథనంపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అవినీతి మొత్తాన్ని బయటపెడతామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఈనెల 5న ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. -
'క్విడ్ ప్రోకో కేసులో వాయిదాలకు మినహాయించండి'
క్విడ్ ప్రోకో కేసులో రెగ్యులర్ వాయిదాలకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీబీఐ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు మంగళవారం నాంపల్లిలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. అందుకు ఆయనకు అనుమతించాలని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని నాంపల్లిలోని కోర్టు మంగళవారం సీబీఐకు నోటీసులు జారీ చేసింది.