గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాంపై విచారణకు కోర్టు అనుమతి కోరుతామని ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. కెనైటా, లేపాక్షి, వాన్ పిక్ భూ కేటాయింపులను రద్దు చేసేందుకు న్యాయ సలహాలు తీసకుంటామన్నారు. వీటిపై కేబినెట్కు సిఫార్సు చేయాలని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని పల్లె చెప్పారు.
గత ప్రభుత్వంలో రూ. 120 కోట్లతో నిర్వహించిన మేఘమథనంపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అవినీతి మొత్తాన్ని బయటపెడతామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఈనెల 5న ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.
మద్యం స్కాంపై విచారణకు కోర్టు అనుమతి కోరుతాం
Published Sat, Jan 3 2015 5:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement