court relife
-
హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. హెచ్–1బీ వీసాల్లో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్1–బీ వీసా విధానంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బైడెన్ ప్రమాణ కమిటీలో ఇండియన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి వేసిన కమిటీలో ప్రవాస భారతీయుడు మజూ వర్ఘీస్కి చోటు లభించింది. ఈ కమిటీలో తనను ఎంపిక చేయడంపై మజూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘జో బైడెన్, కమలా హ్యారిస్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటుగా ఆ సంబరాల్లో జరిగే ఇతర కార్యక్రమాల ప్రణాళిక, నిర్వహణ కమిటీలో చోటు లభించడం నాకు గర్వకారణం‘‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బైడెన్, కమలా ఎన్నికల ప్రచారంలో కూడా మజూ కీలక సలహాదారుగా వ్యవహరించారు. -
‘హెచ్1బీ’ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ వీసా నిషేధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ట్రంప్ జూన్ 22న ప్రకటించిన హెచ్1బీ వీసా ఆంక్షలను సవాల్ చేస్తూ 169 మంది ఎన్ఆర్ఐలు అమెరికా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని అక్కడి కోర్టు తిరస్కరించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయని ట్రంప్ హెచ్1బీ వీసాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీని ప్రకారం ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధించిన ఆంక్షలు ఈ యేడాది చివరి వరకు అమల్లో ఉంటాయి. హెచ్1బీ, వీసాల రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార, వాణిజ్యాలకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుందని, ఇది దిద్దుకోలేని తప్పిదమని అమెరికాలోని సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలు హెచ్చరించాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, ఇటీవల భారత్‌కు వచ్చిన 169 మంది భారతీయులు తిరిగి అమెరికా వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. వీసాలపై నిషేధం ఏకపక్షమని, తక్షణం తమ వీసాలను పునరుద్ధరించాలని భారతీయులు ఆ పిటిషన్లో కోరారు. అయితే వీసాపై ఆంక్షలు వి«ధించకుండా అడ్మినిస్ట్రేషన్‌ని నియంత్రించలేమని వాషింగ్టన్ జిల్లా జడ్జి అమిత్ మెహతా ట్రంప్‌కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పుని పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు భారతీయ పౌరుల తరఫు లాయర్ తెలిపారు. -
మధ్యప్రదేశ్ గవర్నర్‌కు ఊరట
జబల్పూర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్టు స్కామ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ రాంనరేశ్ యాదవ్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది. రాష్ట్ర అధినేతగా రాజ్యాంగం కల్పించిన న్యాయ రక్షణల వల్ల ఆయనపై పదవిలో ఉండగా ఎలాంటి కేసులు నమోదు చేయటానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పు చెప్పింది. అవసరమైతే గవర్నర్ స్టేట్మెంట్ను రికార్డు చేయవచ్చని పోలీసులకు సూచించిం ది. స్టేట్మెంట్ రికార్డు సమయంలో న్యాయపరమైన అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఈ కేసులో మిగతా నిందితులపై కేసుల నమోదుకు కానీ, విచారణకు కానీ స్వతంత్రంగా చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.