courtesy meet
-
హామీలు అమలు చేయకపోవడం అన్యాయం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోషి పాత మిత్రుడు కావడంతోనే కలిసానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గత యూపీఏ ప్రభుత్వం, అప్పటి ప్రధాన మంత్రి అన్ని పార్టీలను ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అప్పటి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తుందని, రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. తొలి నుంచే అందరూ కలిసి హోదా కోసం పోరాడాల్సిందన్నారు, ఇప్పటికైనా నిజాయితీగా కలిసికట్టుగా పోరాడి హోదా సాధించుకోవాలని ఆయన సూచించారు. -
మర్యాద కోసం పిలిస్తే.. రాద్ధాంతమా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన ఒకరోజు తర్వాత పీఎంఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మాజీ ప్రధానమంత్రులు చాలామందిని ఈ భేటీకి పిలిచామని పీఎంఓ అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడకు కూడా ఆహ్వానం వెల్లిందని, అయితే ఆయన బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో రాలేకపోతున్నట్లు చెప్పారని అన్నారు. దాంతో ప్రధాని ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి.. ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మోదీని కలవాల్సిందిగా ఆహ్వానించారు. ఏడాది పాలన పూర్తయిన ఒకరోజు తర్వాత.. మే 27న ప్రధాని నరేంద్రమోదీ తన అధికారిక నివాసం నెం.7 రేస్‌కోర్సు రోడ్డు నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ విమర్శించడం.. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా తిప్పికొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి.