cp gowtham
-
మీ ఉత్సాహానికి సెల్యూట్
విజయవాడ స్పోర్ట్స్: ‘ఎంతో ఉత్సాహంగా ఎనభై ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మీ అందరికీ హ్యాట్సాఫ్‌తో పాటు సెల్యూట్ చేస్తున్నా‘నని ఐస్టా టెన్నిస్ టోర్నీలో పాల్గొన్న వృద్ధ క్రీడాకారులను ఉద్దేశించి నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం జిల్లా టెన్నిస్, ఏపీ సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించిన ఐస్టా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతున్న మీరు, యువతకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. 53 ఏళ్ల తాను కూడా మీ మాదిరిగా 80 ఏళ్ల వరకు టెన్నిస్ ఆడాలని దేవునిని కోరుకుంటున్నానని అన్నారు. నూతన రాష్ట్రం, కొత్త రాజధాని స్పోర్ట్స్ సిటీగా వెలుగొందాలన్నారు. నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో రూ.2.5లక్షలు ప్రైజ్ మనీ ఇచ్చామని, వచ్చే ఏడాది రెట్టింపు చేస్తామన్నారు. జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అ«ధ్యక్షులు డాక్టర్ కె.పట్టాభిరామయ్య, శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, ఏపీ సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి.బుద్దరాజు, ఉపా«ధ్యక్షులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజేతలకు సీపీ గౌతమ్ సవాంగ్ ట్రోఫీలను అందజేశారు. బహుమతిగా సాక్షి కథనం ఈ టోర్నీలో పాల్గొన్న 75 నుంచి 80 ఏళ్ల పైబడిన వారిపై ‘75+ స్టిల్ యంగ్’ అంటూ శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన ప్రత్యేక కథనంలోని ఫొటోను ఆయిల్పెయింట్లా చేయించి ఆ కేటగిరీలోని ప్రతి ఒక్కరికీSట్రోఫీలతో పాటు సీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా నిర్వాహకులు అందజేశారు. తమ ఇళ్లల్లో ఫ్రేమ్ కట్టించి గోడకు పెట్టుకుంటామని వారంతా సంతోషంగా తెలిపారు. -
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ముఖ్యం
విజయవాడ (లబ్బీపేట) : రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించేందుకు వ్యాధి లక్షణాలపై మహిళలకు అవగాహన అవసరమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. వ్యాధిపై చైతన్యం తీసుకువచ్చేందుకు నగరంలో నిర్వహిస్తున్న పింక్ రిబ్బన్ ర్యాలీకి అనూహ్యంగా స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, నగరంలోని ఆంధ్రా ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీస్ శాఖతో పాటు భారతీయ స్టేట్‌బ్యాంక్ సహకారం అందించింది. ర్యాలీని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద సీపీ గౌతమ్ సవాంగ్, సినీïß రో సుమంత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి హోటల్æడీవీ మనార్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ యూఎన్ఎన్ మయీయ, ఆంధ్రా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ పద్మ పాతూరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమంత్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులతోనే బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుందని, దానిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ యువతను చైతన్య పరిచారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనన్నారు. వ్యాధి లక్షణాలు, సెల్ఫ్ చెకప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏటా హైదరాబాద్‌లో పింక్ ర్యాలీ నిర్వహించేవారమని, తొలిసారిగా నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన రెండువేల మందికిపైగా విద్యార్థులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణదాతలు కండి
విజయవాడ(లబ్బీపేట) : రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్సవాంగ్అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో మెగా రక్తదానం, నేత్ర వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఆయా శిబిరాలను నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమర వీరుల స్ఫూర్తితో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. నిత్యం ఎంతో మంది ప్రమాదాల భారినపడుతూ రక్తాన్ని కోల్పోతుంటారని, అలాంటి వారికి సకాలంలో రక్తం ఎక్కించేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సంధ్య కంటి ఆస్పత్రి ముందుకు రావడం హర్షణీయమని చెప్పారు. దేశ రక్షణ కోసం, దేÔ¶ శాంతిభద్రతల పరిరక్షణలో మరణించిన వారిని స్మరించుకునేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రి, రెడ్‌క్రాస్, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్‌లు శిబిరంలో రక్తాన్ని సేకరించాయి. 76 మంది పోలీస్ సిబ్బంది, 300 మంది ప్రజలు, విద్యార్థులు రక్తదానం చేశారు. కాగా సంధ్య కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరంలో 750 మందికి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్లు జీవీజీ అశోక్‌కుమార్, పాలరాజు, కోయ ప్రవీణ్ పాల్గొన్నారు.