రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ముఖ్యం
విజయవాడ (లబ్బీపేట) : రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించేందుకు వ్యాధి లక్షణాలపై మహిళలకు అవగాహన అవసరమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. వ్యాధిపై చైతన్యం తీసుకువచ్చేందుకు నగరంలో నిర్వహిస్తున్న పింక్ రిబ్బన్ ర్యాలీకి అనూహ్యంగా స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, నగరంలోని ఆంధ్రా ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీస్ శాఖతో పాటు భారతీయ స్టేట్‌బ్యాంక్ సహకారం అందించింది. ర్యాలీని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద సీపీ గౌతమ్ సవాంగ్, సినీïß రో సుమంత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి హోటల్æడీవీ మనార్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ యూఎన్‌ఎన్ మయీయ, ఆంధ్రా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ పద్మ పాతూరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమంత్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులతోనే బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుందని, దానిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ యువతను చైతన్య పరిచారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనన్నారు. వ్యాధి లక్షణాలు, సెల్ఫ్ చెకప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏటా హైదరాబాద్‌లో పింక్ ర్యాలీ నిర్వహించేవారమని, తొలిసారిగా నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన రెండువేల మందికిపైగా విద్యార్థులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.