ఎయిర్‌టెల్‌పై టాలీవుడ్‌ హీరో సెటైర్లు | Acter sumanth satire on Airtel call drop issue | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌పై టాలీవుడ్‌ హీరో సెటైర్లు

Published Thu, Jan 11 2018 8:45 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Acter sumanth satire on Airtel call drop issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ న‌టుడు సు‌మంత్‌   టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌పై   అసహనం వ్యక్తం చేశారు.  కస్టమర్లను విసిగిస్తున్న కాల్‌ డ్రాప్‌ సమస్యపై  సోషల్‌ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. ట్విటర్‌ ద్వారా ఎయిర్‌ టెల్‌ కాల్‌ డ్రాపింగ్‌ ఇబ్బందిపై  ఎయిర్‌టెల్‌ తీరును విమర్శిస్తూ స్పందించారు. దీంతో  ఈ ట్వీట్ వైర‌ల్ గా  మారింది.

ఎయిర్‌టెల్  కాల్ డ్రాప్‌ వ్యవహారం తనను ఎంత ఇబ్బంది పెడుతోందో సుమంత్‌  చెప్పకనే  చెప్పారు . ‘ఎయిర్ టెల్ స‌మ‌ర్పించు.. కాల్ డ్రాపింగ్ అనే  కళను రెగ్యులర్‌గా విజయవంతంగా ఉప‌యోగిస్తోంది... అభినంద‌న‌లు..’  అంటూ ట్వీట్‌​ చేశారు. అదీ టెలికాం కంపెనీల ప్రకటన తరహాలోనే ట్వీట్‌  చేయడం విశేషం.  ఈ ట్వీట్ పై స్పందిస్తూ నెటిజ‌న్లు కూడా త‌మదైన శైలిలో చుర‌క‌లంటిస్తున్నారు.  కాగా  టాలీవుడ్‌లో గోదావరి,  గోల్కొండ హైస్కూలు సినిమాలతో ఆకట్టుకున్న  సుమంత్‌  ఆ తరువాత చాలా గ్యాప్‌తీసుకున్నా...మళ్లీ రావా సినిమా విజయంతో తిరిగి ఫామ్‌లో  కొచ్చాడనే చెప్పుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement