hero sumanth
-
'విరించి' సినిమా..యూట్యూబ్‌లో విడుదల
కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్కంద మిత్ర హీరోగా సత్య కె దర్శకత్వంలో తెరకెక్కిన ఇండిపెండెంట్ ఫిలిం 'విరించి'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో చిత్రంపై పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలె చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం విరించి ట్రైలర్‌ను హీరో సుమంత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ట్రైలర్ చూశాను..చాలా బాగుంది. డైరెక్టర్ పనితనం ట్రైలర్లో కనిపించింది. హీరో స్కంద మిత్ర అద్భుతంగా నటించాడు. మంచి సినిమాను ఆదరించి విజయవంతం చేయాలి. షేడ్ స్టూడియోస్‌లో అనే యూట్యూబ్ ఛానెల్లో విడుదలవుతున్న ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి' అని సుమంత్ అన్నారు. బాజీ కీస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అరవింద్ సుదర్శన్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్కంధ మిత్ర, ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియ, అప్పాజీ అంబరీష దర్భా, అల్లా మహమ్మద్ ఓతుర్ ముఖ్య పాత్రల్లో నటించారు. చదవండి : నాన్న.. నాకు అన్నీ మీరే: మంచు లక్ష్మీ (మహేశ్‌బాబు లగ్జరీ కారవాన్: ఖరీదు ఎంతో తెలుసా?) -
ఎయిర్‌టెల్‌పై టాలీవుడ్ హీరో సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు సుమంత్ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేశారు. కస్టమర్లను విసిగిస్తున్న కాల్ డ్రాప్ సమస్యపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. ట్విటర్ ద్వారా ఎయిర్ టెల్ కాల్ డ్రాపింగ్ ఇబ్బందిపై ఎయిర్టెల్ తీరును విమర్శిస్తూ స్పందించారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎయిర్టెల్ కాల్ డ్రాప్ వ్యవహారం తనను ఎంత ఇబ్బంది పెడుతోందో సుమంత్ చెప్పకనే చెప్పారు . ‘ఎయిర్ టెల్ సమర్పించు.. కాల్ డ్రాపింగ్ అనే కళను రెగ్యులర్‌గా విజయవంతంగా ఉపయోగిస్తోంది... అభినందనలు..’ అంటూ ట్వీట్ చేశారు. అదీ టెలికాం కంపెనీల ప్రకటన తరహాలోనే ట్వీట్ చేయడం విశేషం. ఈ ట్వీట్ పై స్పందిస్తూ నెటిజన్లు కూడా తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు. కాగా టాలీవుడ్లో గోదావరి, గోల్కొండ హైస్కూలు సినిమాలతో ఆకట్టుకున్న సుమంత్ ఆ తరువాత చాలా గ్యాప్తీసుకున్నా...మళ్లీ రావా సినిమా విజయంతో తిరిగి ఫామ్‌లో కొచ్చాడనే చెప్పుకోవచ్చు. You've successfully perfected the art of call dropping regularly. Congratulations 👏🏼🙏🏽 @Airtel_Presence — Sumanth (@iSumanth) January 10, 2018 -
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ముఖ్యం
విజయవాడ (లబ్బీపేట) : రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించేందుకు వ్యాధి లక్షణాలపై మహిళలకు అవగాహన అవసరమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. వ్యాధిపై చైతన్యం తీసుకువచ్చేందుకు నగరంలో నిర్వహిస్తున్న పింక్ రిబ్బన్ ర్యాలీకి అనూహ్యంగా స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, నగరంలోని ఆంధ్రా ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీస్ శాఖతో పాటు భారతీయ స్టేట్‌బ్యాంక్ సహకారం అందించింది. ర్యాలీని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద సీపీ గౌతమ్ సవాంగ్, సినీïß రో సుమంత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి హోటల్æడీవీ మనార్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ యూఎన్ఎన్ మయీయ, ఆంధ్రా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ పద్మ పాతూరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమంత్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులతోనే బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుందని, దానిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ యువతను చైతన్య పరిచారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనన్నారు. వ్యాధి లక్షణాలు, సెల్ఫ్ చెకప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏటా హైదరాబాద్‌లో పింక్ ర్యాలీ నిర్వహించేవారమని, తొలిసారిగా నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన రెండువేల మందికిపైగా విద్యార్థులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.