crash-land
-
విషాదం: కుప్పకూలిన హెలికాప్టర్
శ్రీనగర్: దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన దుర్ఘటన విషాదాన్ని నింపింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్‌పూర్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఒక పైలట్ మృతిచెందగా, గాయపడిన మరో పైలట్‌ను మిలటరీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. చదవండి: చైనాతో మళ్లీ ఘర్షణ; ఇరు దేశాల జవాన్ల బాహాబాహీ -
తప్పిన ప్రమాదం..ఒకరు మృతి
రష్యాలోని సోచి విమానాశ్రయంలో దిగబోతూ రన్‌వే నుంచి పక్కకు జారి నదీ తీరంలో పడిపోయిన బోయింగ్ విమానం. ఈ ప్రమాదంలో ఒక సూపర్వైజర్ మృతిచెందగా, 164 మంది సురక్షితంగా బయటపడ్డారు. -
జపాన్‌లో కుప్పకూలిన రాకెట్
-
ఎగిరింది 60 అడుగులే.. కుప్పకూలిన రాకెట్..
టోక్యో, జపాన్ : ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తయారు చేసిన రాకెట్ తారాజువ్వలా 60 అడుగులు ఎగిరి అక్కడే కుప్పకూలింది. జపాన్‌కు చెందిన ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ మోమో-2 పేరుతో దాదాపు 2.7 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి రాకెట్‌ను తయారు చేసింది. దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దాదాపు 10 మీటర్ల పొడవున్న మోమో-2 రాకెట్ లాంచింగ్ పాడ్ నుంచి గాలిలోకి 60 అడుగుల ఎత్తు ఎగిరి కుప్పకూలింది. గతేడాది మోమో రాకెట్ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలం చెందింది. ఈ ఘటనలో లాంచింగ్ పాడ్ కొద్దిగా దెబ్బతింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని ఇంటర్స్టెల్లార్ వ్యవస్థాపకుడు టకఫుమి హొరీ తెలిపారు. ప్రయోగ విఫలానికి గల కారణాలను అన్వేషించి మళ్లీ ప్రయోగం చేపడతామని ఆయన వెల్లడించారు. -
కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం
-
విమానం క్రాష్‌ల్యాండ్: 50 మంది మృతి
కఠ్మాండు : నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్టు సమాచారం. మరో 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఢాకా నుంచి వచ్చిన విమానం.. ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిన మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని, మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్ ఆర్మీ తెలిపింది. నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. వారిలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. సహాయకర చర్యలు కొనసాగుతున్నాయని, కూలిన విమానంలో ప్రాణాలతో ఉన్న కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నదిలో పడిన విమానం
తైపీ: తైవాన్‌లో బుధవారం ఒళ్లు గగుర్పొడిచేలా జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 26 మంది మృతిచెందగా, 17 మంది గల్లంతయ్యారు. ట్రాన్స్ ఏసియా ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం తైవాన్ రాజధాని తైపీలో ఓ ఫ్లైఓవర్‌ను ఢీకొని పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. అంతకుముందు దాని రెక్క రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాక్సీని ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ట్రాన్స్ ఏసియా విమానం 'ఫ్లైట్ జీఈ235' ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మందితో ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి 10.53 గంటలకు కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. 11.00 గంటల ప్రాంతంలో ఓ పక్కకు ఒరిగి ఫ్లైఓవర్‌ను ఢీకొని ముందుకెళ్లి ముక్కచెక్కలవుతూ నదిలో పడిపోయింది. శకలాల నుంచి సహాయక సిబ్బంది 15 మందిని రక్షించారు. ప్రయాణికుల్లో 31మంది చైనీయులు ఉన్నారు. క్రేన్ల సాయంతో విమానం వెనుక భాగాన్ని వెలికి తీయగా అందులో ఒక ప్రయాణికుడి మృతదేహం లభించింది. గల్లంతైన 17 మంది నదిలో మునిగిన విమానం ముందు భాగంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. నీటి మట్టం పెరగడం, రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. విమానం బ్లాక్ బాక్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'విమానం ఢీకొన్న ట్యాక్సీ నాకు కొన్ని మీటర్ల ముందే ఉంది. విమానం నాకు దగ్గరగా వచ్చింది. ఇప్పటికీ భయం పోలేదు' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాగా, విమాన సిబ్బంది సందేశంగా పేర్కొంటూ టీవీ చానళ్లలో ఒక సంభాషణ ప్రసారమైంది. అందులో.. 'మేడే! మేడే! ఇంజిన్ మండిపోతోంది! అని అరుస్తున్నట్లు ఉంది. ట్రాన్స్ ఏసియా విమానమొకటి ప్రమాదానికి గురికావడం ఏడు నెలల్లో ఇది రెండోసారి. -
ట్రాన్స్ ఏషియా విమానం నదిలో కూలిందిలా..
-
నదిలో కూలిన ట్రాన్స్ ఏషియా విమానం