Cricket Allstars
-
యువర్స్ లవింగ్లీ..
-
క్రికెటర్లకు జన్యు పరీక్షలు!
ముంబై: స్కిన్‌ఫోల్డ్ టెస్ట్... డెక్సా టెస్ట్... యోయో టెస్ట్... అన్నీ అయిపోయాయి. ఇప్పుడు క్రికెటర్ల జన్యు రహస్యాలు కూడా తెలుసుకునే పనిలో బీసీసీఐ పడింది! ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్న బోర్డు, ఇందులో భాగంగా భారత ఆటగాళ్లందరికీ డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తోంది. దీని ద్వారా ఆటగాడు శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు, కండరాల పటిష్టతకు అవకాశం ఏర్పడటంతో పాటు వేగం పెంచుకునేందుకు, కోలుకునే సమయం గురించి మరింత స్పష్టత వచ్చేందుకు కూడా ఈ టెస్టు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత జట్టులో సభ్యుడైన ఆటగాడి శరీరంలో 23 శాతానికి మించి కొవ్వు ఉండరాదు. జనెటిక్ ఫిట్నెస్ టెస్టుగా కూడా పిలుచుకునే ఈ పరీక్షతో ఆటగాడి శరీరానికి సంబంధించి 40 రకాల జీన్స్ గురించి సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. టీమ్ ట్రైనర్ శంకర్ బసు సూచన మేరకు దీనిని తీసుకొచ్చారు. దీనిని నిర్ధారించిన బీసీసీఐ అధికారి ఒకరు ఈ పరీక్ష కోసం ఒక్కో ఆటగాడికి గరిష్టంగా రూ.30 వేలు అవసరమవుతుందని, అది పెద్ద మొత్తమేమీ కాదని చెప్పారు. ప్రఖ్యాత ఎన్బీఏ, ఎన్‌ఎఫ్‌ఎల్‌లలో కూడా డీఎన్ఏ టెస్టు అమల్లో ఉంది. -
ఆల్‌స్టార్స్ జట్ల ప్రకటన
న్యూయార్క్: సచిన్ టెండూల్కర్, షేన్‌వార్న్ నిర్వహిస్తున్న క్రికెట్ ఆల్‌స్టార్స్ టి20 సిరీస్‌కు జట్లను ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం (రేపు) రాత్రి గం. 11 నుంచి (భారత కాలమానం ప్రకారం) న్యూయార్క్ సిటీఫీల్డ్ స్టేడియంలో జరుగుతుంది. సచిన్ బ్లాస్టర్స్ జట్టు: సచిన్, లక్ష్మణ్, గంగూలీ, సెహ్వాగ్, లారా, జయవర్ధనే, మొయిన్‌ఖాన్, మురళీధరన్, పొలాక్, మెక్‌గ్రాత్, అక్తర్, కార్ల్ హూపర్, గ్రేమ్‌స్వాన్, ఆంబ్రోస్, క్లూస్నర్. వార్న్ వారియర్స్ జట్టు: షేన్‌వార్న్, హేడెన్, పాం టింగ్, కలిస్, రోడ్స్, సైమండ్స్, సంగక్కర, అక్రమ్, డొనాల్డ్, వెటోరీ, వాల్ష్, అగార్కర్, సక్లయిన్, వాన్.