cricket commentry
-
IPL 2023: క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించనున్న బాలయ్య
Nandamuri Balakrishna: నటసింహం బాలయ్య మరో కొత్త అవతారమెత్తనున్నాడు. సినిమాలు, రాజకీయాలు, ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో బిజీగా ఉండే బాలకృష్ణ.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్‌తో వ్యాఖ్యాతగా మారనున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఐపీఎల్ 16వ ఎడిషన్ కోసం బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కామెంట్రీ బాక్స్‌లో బాలయ్య.. వేణుగోపాల్ రావు, ఎంఎస్కే ప్రసాద్, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, టి సుమన్‌లతో కలిసి వ్యాఖ్యానించనున్నాడు. బాలయ్య తనదైన శైలిలో సినిమాకు, క్రికెట్‌ను అనుసంధానించి ఎలా వ్యాఖ్యానిస్తాడోనని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నతనం నుంచి క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే బాలయ్య, కాలేజీ రోజుల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడేవారట. గతంలో బాలయ్య సినీ తారలు ఆడే సెలబ్రిటీ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు సారధ్యం వహించాడు. బాలయ్య సమయం దొరికినప్పుడల్లా సెట్స్‌లో కూడా క్రికెట్ ఆడేవారని జనాలు చెబుతుంటారు. ఇలా బాలయ్య ప్రతి దశలోనూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించాడు. క్రికెట్‌పై ఉన్న అమితాసక్తితోనే బాలయ్య స్టార్ స్పోర్ట్స్ తెలుగు వారి ఆఫర్‌ను కాదనలేకపోయారని తెలుస్తోంది. కాగా, మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్- ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
'భయ్యా నేనంత సోమరిని కాదు.. కావాలంటే చెక్ చేసుకో'
ఆటలో కామెంటరీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న అభిమానులకు తమ పదునైన మాటలు.. క్రీడా విశ్లేషణలతో మరింత రసవత్తరంగా మార్చడం కామెంటేటర్ల పని. అయితే కొన్ని సందర్భాల్లో కామెంటేటర్లు కూడా తమకు తెలియకుండానే నోరు జారడం చూస్తుంటాం. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ బంగర్ అదే తప్పు చేశాడు. ఆట బ్రేక్ సమయంలో మైక్ ఆఫ్ చేయడం మరిచిపోయిన సంజయ్ మైక్ రికార్డర్లో అడ్డంగా దొరికిపోయాడు. టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. చదవండి: జింబాబ్వే బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు టీమిండియా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 39వ ఓవర్ పూర్తైన తర్వాత బ్రాడ్‌కాస్టర్ బ్రేక్ ఇవ్వాలి. కానీ స్కోర్ కార్డ్ చూపించడం.. అదే సమయంలో బ్రేక్ అని భావించిన బంగర్ మైక్ ఆఫ్ చేయకుండానే బ్యాక్ఎండ్ టీంతో పర్సనల్ విషయాలు మాట్లాడాడు. ''నేనంత సోమరిని కాదు భయ్యా.. కావాలంటే చెక్ చేసుకో'' అంటూ పేర్కొన్నాడు. అయితే బ్రేక్ తర్వాత అసలు విషయం తెలుసుకున్న బంగర్ తన పొరపాటును గుర్తించి నవ్వుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ బంగర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్ #SAvsIND pic.twitter.com/HYgiAx7VkJ — Amanpreet Singh (@AmanPreet0207) January 20, 2022 -
కామెంటేటర్ అవతారంలో అమితాబ్!
ప్రపంచకప్ పోటీలలో భాగంగా అడిలైడ్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఈనెల 15న ఓ మ్యాచ్ జరగనుంది. అందులో క్రికెటర్ల మాటేమో గానీ, మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోజు మ్యాచ్‌కి వెళ్తున్నారు. అదికూడా సాధారణ ప్రేక్షకుడిలా కాదు.. కామెంటేటర్‌గా కనిపించబోతున్నారు. ఆరోజు కపిల్ దేవ్, హర్షా భోగ్లేతో కలిసి కామెంట్రీ చెబుతారు. తనదైన శైలిలో అమితాబ్ గంభీరమైన స్వరంతో కామెంట్రీ చెబుతుంటే వినాలని ఇటీవలే అమితాబ్ నటించిన షమితాబ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్ బాల్కి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. షమితాబ్ సినిమాకు, స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌కు మధ్య ఒప్పందంలో భాగంగానే అమితాబ్ కామెంట్రీ చెబుతారట. తన సినిమా మొత్తానికి అమితాబ్ గొంతే కీలకమని, ఇప్పుడు అదే గొంతు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్, బాలీవుడ్ అభిమానులు అందరికీ అందడం సంతోషంగా ఉందని బాల్కి అన్నారు. ఇప్పటివరకు రకరకాల డాక్యుమెంటరీలకు, సామాజిక అంశాలకు కూడా గొంతునిచ్చిన అమితాబ్.. ఇంతవరకు అడుగుపెట్టని రంగం క్రికెట్టే. ఇప్పుడు ఆలోటు కూడా తీరిపోతోంది. అమితాబ్, లతా మంగేష్కర్‌ల గొంతులు భారత పాకిస్థాన్‌ల మధ్య స్నేహభావాన్ని కలిగిస్తాయని కూడా బాల్కి అన్నారు. శుక్రవారం విడుదలవుతున్న షమితాబ్ సినిమాలో అమితాబ్‌తో పాటు ధనుష్, అక్షరాహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.