cricket games
-
అలరించిన డెమో షో..
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని క్రికెట్ ఆట శాసిస్తుందంటే అతిశయోక్తి కాదు. నేడు చిన్న పిల్లల నుంచి వృద్ధులకు వరకు టీవీల్లో క్రికెట్ వస్తుందంటే బయట అడుగుపెట్టకుండా టీవీలకే అత్తుకుపోతారు. అంతటి క్రేజ్ గల క్రికెట్ ఆటకు నూతన ఓరవడినందిస్తూ సరికొత్తగా వర్చువల్ రియాల్టీ (కాల్పనిక) క్రికెట్‌కు రూపకల్పన చేశారు. ఐఐటీ ఢీల్లీలో విద్యను పూర్తి చేసిన సిద్దిపేటకు చెందిన త్రివిక్రం, హైదరాబాద్‌కు చెందిన వసంతసాయి సాంకేతిక విద్యనభ్యసించి ప్రోయుగా అనే సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ప్రోయుగా కంపెనీకి సీఈఓగా భాద్యతలు నిర్వర్తిస్తున్న త్రివిక్రం రూ.కోటి జీతాన్ని అందించే కొలువును సైతం వదులుకుని ప్రపంచానికి తన మేధా శక్తి అందించాలనే తపనతో తొమ్మిది నెలలు శ్రమించి ‘ఇంపాక్ట్ బిలియన్’ అనే సందేశంతో వర్చువల్ రియాల్టీ క్రికెట్‌ను ఆవిష్కరించాడు. ఆడుతున్న అనుభూతి... ప్రోయుగా కంపెనీ ద్వారా రూపొందించిన స్టార్టప్ ఐబీ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో ఆహ్లాదకరమైన మైదానంలో చుట్టూ ప్రేక్షకులు, బరిలో క్రీడాకారులు, బంతిని విసురుతున్న బౌలర్‌ను తలపిస్తూ బ్యాటింగ్ చేస్తున్న అనుభూతిని అందిస్తుంది. కళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెడ్సెట్, కస్టమ్ బ్యాట్, సెన్సార్లను ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సాప్ట్వేర్ల అనుసందానంతో హెడ్‌సెట్‌ను ధరించినప్పుడు దానికి అనుసంధానంగా ఉన్న మానీటర్లో కనిపించే అంతర్జాతీయ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న అనుభూతితో క్రికెట్లో లోకంలో విహరిస్తారు. నిజంగా బౌలింగ్‌కు ఎదురొడ్డి బ్యాటింగ్ చేస్తున్నట్లుగా సిక్సర్లు కొడుతారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ప్రోయుగా తన స్టార్టప్ వీఆర్ క్రికెట్ విశేషంగా అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆసక్తిగా ఐబీ క్రికెట్‌ను ఆడేందుకు ఉత్సాహాన్ని చూపారు. వీస్పోర్ట్గా ప్రపంచానికి వర్చుయల్ క్రికెట్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను ఏప్రిల్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాబోవు రోజుల్లో ప్రస్తుతం ఆదరణ పొందుతున్న క్రీడల మాదిరిగా వర్చుయల్ క్రికెట్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రోయుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం... ఫిబ్రవరి 22న లక్నోలో నిర్వహించిన ఐటీ ఇన్వెస్టర్స్ సమీట్లో భాగంగా ప్రోయుగా రూపొందించిన ఐబీ క్రికెట్‌ను రాష్ట్రపతి రాంనా«థ్ కోవింద్ తొలి బ్యాటింగ్‌తో ప్రారంభించారు. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, యూనియన్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ బ్యాట్‌పై తొలి సంతకం చేశారు. వీస్పోర్ట్స్‌గా ప్రపంచానికి... ప్రోయుగా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ఐబీ క్రికెట్‌ను వీస్పోర్ట్స్‌గా ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు కృషిచేస్తున్నాం. ప్రఖ్యాత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంచి ఆదరణ సాధిస్తుందని అభినందించా రు. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వీస్పోర్ట్స్‌గా ఐబీ క్రికెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఏప్రిల్‌లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. – నీరధ్, వినోద్కర్, పంకజ్,ఐబీ క్రికెట్ నిర్వాహకులు -
నేటి నుంచి అండర్–19 క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీల్లో అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అండర్–19 బాలికల జట్లు తలపడతాయన్నారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలోని బీ క్రీడా మైదానం, విన్సెంట్ క్రీడా మైదానాల్లో నిర్వహిస్తామని తెలిపారు. అనంత క్రీడా గ్రామానికి ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన బాలికల జట్లు చేరుకున్నాయన్నారు. మ్యాచ్‌ల వివరాలు తేది తలపడే జట్లు 15–07–2017 కడప–కర్నూలు 15–07–2017 అనంతపురం–నెల్లూరు 16–07–2017 చిత్తూరు–నెల్లూరు 16–07–2017 అనంతపురం–కర్నూలు 18–07–2017 అనంతపురం–కడప 18–07–2017 చిత్తూరు–కర్నూలు 19–07–2017 నెల్లూరు–కర్నూలు 19–07–2017 కడప–చిత్తూరు 20–07–2017 చిత్తూరు–అనంతపురం 20–07–2017 కడప–నెల్లూరు -
హోరా హోరీగా ఉద్యోగుల క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఉద్యోగుల క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జ్ఞాపకార్థం ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంతో పాటు నీలం సంజీవరెడ్డి స్టేడియంలో పోటీలు జరిగాయి. హాకీ మైదానంలో ఏపీ ట్రాన్స్‌కో, న్యాయవాదుల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించగా... ట్రాన్స్‌కో జట్టు 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నీలం సంజీవరెడ్డి మైదానంలో పోలీస్, మెడికల్ రెప్రజెంటేటివ్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన మెడికల్ రెప్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 ఓవర్లలో 175 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో 176 పరుగులు చేసింది. విన్సెంట్ క్రీడా మైదానంలో ఉపాధ్యాయులు, రెవిన్యూ ఉద్యోగుల జట్లు తలపడ్డాయి.రెవిన్యూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఉపాధ్యాయుల జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది. విన్సెంట్ క్రీడా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో గుంతకల్లు రైల్వేస్, ఎస్కేయూ నాన్ టీచింగ్ జట్లు తలపడ్డాయి. గుంతకల్లు రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్కేయూ నాన్ టీచింగ్ జట్టు కేవలం 68 పరుగులకే కుప్పకూలింది. ఉద్యోగుల క్రికెట్ క్రీడా పోటీలు వచ్చే ఆదివారం కూడా కొనసాగుతాయని టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్ చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి అలీలు తెలిపారు.