cricket kits
-
ఢిల్లీకి భారీ షాక్ ఐపీల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్
-
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్..! పాపం వార్నర్..
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ ఆటగాళ్ల కిట్స్ చోరీ.. ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. కాగా కేకేఆర్‌తో మ్యాచ్ కోసం వార్నర్ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం(ఏప్రిల్16) ఢిల్లీకు చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాక తమ కిట్లు కనిపించకుండా పోయినట్లు ఆటగాళ్లు గుర్తించారు. కాగా చోరికి గురైన వస్తువులలో 16 బ్యాట్లు, బూట్లు, ప్యాడ్లు, గ్లోవ్‌లు ఉన్నాయి. అందులో మూడు బ్యాట్లు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు సంబంధించినవి కాగా.. రెండు మిచెల్ మార్ష్, మూడు ఫిల్ సాల్ట్, ఐదు బ్యాట్లు యష్ ధుల్కి చెందినవి. దీనిపై ఫ్రాంఛైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. "ప్రతీ ఒక్క ప్లేయర్ తమ కిట్ బ్యాగ్‌ల నుంచి ఎదో ఒక వస్తువును పొగట్టుకున్నారు. ఇది విని మేము షాకయ్యాం. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. మేము దీనిపై ఎయిర్పోర్ట్ లాజిస్టిక్స్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఓ వ్యక్తి మీడియాతో పేర్కొన్నాడు. చదవండి: Mohammed Siraj: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! ఊహించని ట్విస్ట్.. అతడెవరంటే.. -
క్రికెటర్ల బస్సుపై దుండగులు దాడి.. కిట్లు, జెర్సీలు దోపిడీ..!
ఇటలీ దేశీవాళీ క్రికెట్ జట్టు స్టార్ క్రికెట్ సీసీ ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది దుండగలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో ఆటగాళ్ల క్రికెట్ కిట్లు, జెర్సీలు, షూలు, ఇతర క్రికెట్ ఉపకరణాలను దుండగలు అపహరించినట్లు తెలుస్తోంది. ఈసీఎస్ ఇటలీ సూపర్ సిరీస్‌లో భాగంగా మంగళవారం రోమా సీసీ జట్టుతో స్టార్ క్రికెట్ సీసీ తలపడాల్సింది. హోటల్ నుంచి రోమ్‌లోని రోమా స్పినాసెటో క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకునే క్రమంలో ఈ దాడి జరిగనట్లు సమాచారం. దీంతో ఇరు జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్ రీ షెడ్యూల్ చేయబడింది. ఇక ఈ విషయాన్ని యూరోపియన్ క్రికెట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "క్రికెట్ స్టార్స్ సీసీ బస్సుపై కొంతమంది అగంతుకులు దాడి చేసి కిట్లు, జర్సీలు దోపిడీ చేశారు. మంగళవారం క్రికెట్ స్టార్స్ సీసీ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లను రీషెఢ్యూల్ చేశాం" అని యూరోపియన్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Ravi Shastri: వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..! 🚨Breaking News🚨Cricket Stars CC have had their team bus broken in to, kit, clothes and shoes all stolen. Their two matches this morning will be rescheduled. For now, they need new kit, and @EuropeanCricket is helping today to make that happen! — European Cricket (@EuropeanCricket) July 26, 2022 -
క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్
Queensland Cricketer Jimmy peirson Cricket Kit Stolen: క్రికెట్ జట్టుపై దొంగలు దాడి చేసి, అందులోని క్రికెట్ సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో చోటుచేసుకుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియాతో మ్యాచ్‌కు ముందు క్వీన్స్‌ల్యాండ్ జట్టు వాహనంపై దొంగలు దాడి చేసి క్రికెట్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని అపహరించారు. క్వీన్స్‌ల్యాండ్ జట్టు బస చేసే హోటల్ పార్కింగ్‌లో ఉన్న వాహనం అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. ఆ జట్టు వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్కు చెందిన రెండు బ్యాట్లతో పాటు ఇతర క్రికెట్ సామాగ్రిని దొంగిలించారు. View this post on Instagram A post shared by Jimmy Peirson (@jimmypeirson) ఈ విషయాన్ని పియర్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. తన సరికొత్త గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్లు చోరీ అయ్యాయని, ఎవరికైనా దొరికితే తనకు తెలియజేయాలంటూ రాసుకొచ్చాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు.. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్వీన్స్‌ల్యాండ్-టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 30న బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉండింది. అయితే, బ్రిస్బేన్ నగరంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. చదవండి: విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..! -
విజయనగరంలో ప్రలోభాలకు తెరలేపిన టీడీపీ
విజయనగరం: కార్పొరేషన్ హోదా.. తొలిసారి మేయర్ పీఠం.. ఈ అవకాశం ఎలాగైనా దక్కించుకోవాలి. ఇదీ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతిపక్ష టీడీపీ నేతల తీరు. దీంతో ప్రలోభాలకు తెరతీశారు. కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ బీసీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో స్థానిక యువతకు ఆదివారం ఉదయం 9.30 గంటలకు టీడీపీ అభ్యర్థి కంది మురళీనాయుడు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పచ్చనేతలు ఇటువంటి చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ -
గిఫ్ట్‌ప్యాక్
ఓటర్లకు సరికొత్త తాయిలాలు అందరికీ బహుమతులు అభ్యర్థుల ‘ఓటు’ రూట్లు ఎన్నికల ప్రచారంలో.. ప్రలోభాల పర్వం మొదలైంది. ‘ఓటే ముఖ్యం...గెలుపే లక్ష్యం’. ఎంతైనా సరే.. ఏదైనా సరే. నగానట్రా.. మందు.. విందు.. చిందు.. దేనికైనా రెడీ. ‘సింగిల్’గానైనా.. ‘ఫ్యామిలీ’ ప్యాకేజీగానైనా ఓకే. ‘ఓటు మాకు.. నజరానా మీకు’... ఇదీ అభ్యర్థుల నినాదం. - సాక్షి,సిటీబ్యూరో మహిళలకు గాజులు... చీరెలు.. పురుషులకు మందు... విందు... చిందు.. ఇదేదో శుభకార్యాల్లో కనిపించే తంతు అనుకుంటున్నారా? కాదు... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ‘గిఫ్ట్ ప్యాక్’. అంతే కాదు... యువతకు క్యారమ్స్, క్రికెట్ కిట్లు కూడా ఉన్నాయి. ‘మీ అమూల్యమైన ఓటు మాకు.. ప్యాకేజీ మీకు’ అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇంటిల్లిపాదినీ ఖుషీ చేసి గంపగుత్తగా ఓట్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేదు. అన్నిటిదీ ఒకేబాట. ఇదే పాట. సెంటిమెంట్‌తో... మహిళల సెంటిమెంట్‌ను ఓట్లుగా మలచుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం 75 స్థానాల్లో మహిళా అభ్యర్థులే ఉండడంతో.. ప్రధాన పార్టీలు వారి ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాయి. మహిళా సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకుంటున్నాయి. వెండి కుంకుమ భరిణెలు, కంచాలు, చీరెలు, డిన్నర్ సెట్లు, వంట పాత్రలు, గాజులు, తిరుమల, యాదాద్రి లడ్డూల పంపిణీతో వారి మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బహుమతులతో వారిని కట్టిపడేస్తున్నాయి. ఆ తర్వాత ‘మీ ఓటు మాకే..’ అంటూ చేతిలో చేయి వేయించుకొంటున్నాయి. శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారం ఇప్పుడిప్పుడే జోరందుకుంటోం ది. ఓట్ల కొనుగోలుకు అభ్యర్థులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పంపిణీ కూడా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఉదయం ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ, కరపత్రాలు పంచుతూ సాదాసీదాగా ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తున్న అభ్యర్థులు... మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో తాయిలాలు అందించే పనిలో పడ్డారు. దీనికి భారీగా ఖర్చవుతున్నా వెనుకాడడం లేదు. ఖర్చు పరిమితికి మించిపోతుం దన్న భయం వెంటాడుతున్నా.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనివ్వాలంటే ‘బహుమతి ప్రదానం’ తప్పదని చెబుతుండడం గమనార్హం. మందు.. విందు.. ఓట్ల పసందు అభ్యర్థులు మందు పార్టీలతో పురుషుల ఓట్లకు గాలం వేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, బస్తీ, కాల నీల వాసులకు మస్తు పసందు చేస్తున్నారు. ఉద యం, సాయంత్రం ప్రచారం.. రాత్రికి ‘సిట్టింగ్ ’లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ బాధ్యతను బస్తీలు, కాలనీల సంక్షేమ సంఘాలకు అప్పగిస్తున్నారు అభ్యర్థులు. మందు, ఇతర ఆహార పదార్థాలు వారే కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన ఖర్చులను రహస్యంగా ఇస్తున్నారు. పార్టీల స్థానిక కార్యాలయాల్లో రోజువారీగా ఏ కాలనీ లేదా బస్తీ వారికి ఎక్కడ పార్టీ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. పార్టీ ఎలా జరుగుతోంది..? ఏమైనా లోటుపాట్లున్నాయా? అని అభ్యర్థులు ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకుం టూ ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఇక యువ ఓటర్ల కు క్రీడా పరికరాలతో ఎర వే స్తున్నారు. యువతను తమవైపు తిప్పుకునేందుకు క్రికెట్ కిట్లు, క్యారమ్స్, చెస్ బోర్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ‘పార్టీ’ రూటు.. సెపెరేట్ బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో ఆర్భాటంగా పార్టీలు నిర్వహిస్తే ఈసీ డేగకన్నుకు దొరికిపోతామ న్న భయంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కాలనీ, బస్తీల్లోని పురాతన షెడ్లు, ఖాళీ ఫ్లాట్లు లేదా సంక్షేమ సంఘాల అధ్యక్షుల నివాసాలు మందు పార్టీలకు వేదికలుగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా ఏం పార్టీ అని ప్రశ్నిస్తే ‘మా కూతురు లేదా బాబు పుట్టిన రోజు... లేదా బస్తీ నాయకుడి పెళ్లి రోజని’ చెబుతూ అభ్యర్థుల గుట్టురట్టు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. -
ఖమ్మంలో కాంగ్రెస్ నేతల ప్రలోభాలు
-
ఖమ్మంలో భారీగా మద్యం, క్రికెట్ కిట్ల పట్టివేత
ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ కాంగ్రెస్ నాయకుల ప్రలోభాల పర్వం బాగా ఎక్కువైంది. ఖమ్మం పట్టణం లోని ఓ గోడౌన్లో భారీగా క్రికెట్ కిట్లు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన గోడౌన్‌గా గుర్తించారు. అక్కడ ఇంకా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో విజయం సాధ్యం కాదన్న అనుమానాలు రావడం వల్లే కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇలా మద్యాన్ని, క్రికెట్ కిట్లను సిద్ధం చేసుకుని ఉంటారని అక్కడ ఇతర పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారు. -
సార్వత్రిక జోరు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం 6గంటలకే బయలుదేరి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రచారంలోనే టీ, టిఫిన్, భోజనాలు చేస్తూ రాత్రి పది గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అంశాలపై అనుచరులతో సమాలోచనలు సాగిస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు కంటిమీద కునుకు లేకుండా ఓట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. మరికొంత మంది అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు, ఇలా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మాజీ అభ్యర్థులు తాము గతంలో చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకు సాగుతుండగా, మరి కొంత మంది తాము గెలిస్తే ఏ అభివృద్ధి పనులు చేస్తామో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు తమ నేతలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ...తాము గెలిచి..తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తున్నారు. ఏది ఏమైనా అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గెలుపుకోసం అడ్డదారులు.... పలు పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం, డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు క్రికెట్ కిట్లు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా గ్రామాల్లో ఉన్న నాయకులను సమన్వయం చేసుకుని వారికే ఈ ‘పంపిణీ’ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తీవ్ర పోటీ ఉన్న చోట ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీస్థాయిలో తాయిలాలు అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోపక్క ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ సందడి.. నిన్నటి వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన గ్రామాల్లో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల జిల్లా స్థాయి నేతలు గ్రామాల్లో మకాం వేసి ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రెబల్ అభ్యర్థులపైన దృష్టిసారిస్తున్నారు. వారిని ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే దానికి తగిన ప్రతిఫలం వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.. తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో కాంట్రాక్టులు ఇస్తామని, తమ పార్టీ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి అంటు మాయమాటాలు చెబుతున్నారు. ముఖ్యనేతల ప్రచారంలో కేడర్‌లో ఉత్సాహం.. అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుంటే వారి తరఫున ఆయా పార్టీల రాష్ట్రస్థాయి నేతలు కూడా జిల్లాలో పర్యటించి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఒకసారి ఖమ్మంలో ‘జయభేరి’ మోగించగా.. మరోసారి ఎన్నికల ప్రచారం నిమిత్తం శనివారం జిల్లాకు వస్తున్నారు. అలాగే పార్టీ నాయకురాలు షర్మిల నాలుగురోజుల ఎన్నికల ప్రచార యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నేతల పర్యటనలు విజయవంతం కావడంతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తమ గెలుపునకు ఢోకాలేదని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరోజులోనే ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇక కాంగ్రెస్ తరుఫున కేంద్రమంత్రి జైరాంరమేష్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ తరపున సురవరం సుధాకర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహించారు. -
ఓట్ల కోసం పాట్లు!
అపార్టుమెంట్లపై అభ్యర్థుల దృష్టి ‘ఇంటింటికీ బొట్టు’ కార్యక్రమం కాలనీ సంఘాలకు కాసుల ఎర! సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రోడ్డు షోలు, పాదయాత్రలు, ర్యాలీలతో ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు జోరు మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఓ చుట్టు చుట్టిన అభ్యర్థులు మలిదశలో ఓటర్లను నేరుగా కలుసుకొనేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, గ్రూపు హౌస్‌లపై దృష్టి పెట్టారు. ఒక్కో అపార్టుమెంట్లో సుమారు 150 నుంచి 300 వరకు ఓటర్లు ఉండటతో అభ్యర్థుల చూపు వాటిపై పడింది. వీరందరినీ నేరుగా కలుసుకోవడం వల్ల వారి అభిమానం చూరగొనడమేగాక పేరుపేరునా పలకరించి ఓట్లను రాబట్టుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల్లో ఉండే సంక్షేమ సంఘాలు, అపార్టుమెట్ కమిటీలు, వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులతో మంతనాలు జరుపుతున్నారు. అవసరమైతే కాసులు ఎరగా వేస్తూ తమకు పక్కాగా ఓట్లు వేయించే లా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొనేందుకు స్థానిక నాయకులను రంగంలోకి దించారు. కొన్నిచోట్ల ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరింస్తానమి హామీ ఇస్తున్నారు. కాలనీల్లో సౌకర్యాలు కల్పిస్తామంటూ.. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్ వాసులు తాగునీటికి సమస్యతో సతమతమవుతున్నారు. అలాంటి చోట్ల బోర్లు వేయించేందుకు కూడా పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. భూగర్భ జలాలులేక సాధ్యంకానిచోట మాత్రం ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆయా కమిటీ, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులతో స్థానిక నాయకుల చేత చర్చలు జరిపి డీల్ ఓకే అయ్యాక.. అక్కడ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే అపార్టుమెంట్లలోని యువకులను ఆకట్టుకొనేందుకు పలువురు అభ్యర్థులు వారికి క్రికెట్ కిట్లను ఎరగా వేస్తున్నారు. వీటిని నేరుగా పంపిణీ చేస్తే పట్టుబడే ప్రమాదం ఉండటంతో ఫలానా దుఖాణానికి వెళ్లి తీసుకోవాలని, బిల్ తాము చెల్లిస్తామంటూ కోడ్ భాషతో ఉన్న చీటీలు ఇస్తున్నారు. అయితే... ఓట్లు మాత్రం గంపగుత్తగా తమకే పడాలన్న ఒప్పందంతోనే అభ్యర్థులు ఈరకమైన ఏర్పాట్లు చేసుకొంటున్నారు. బొట్టు పెట్టి అభ్యర్థన.. డబ్బు వెచ్చించేందుకు అంతగా ఇష్టపడని అభ్యర్థుల సతీమణులు మాత్రం కొందరు మహిళా కార్యకర్తలను వెంటేసుకొని సాయంత్రం వేళల్లో కాలనీలు, అపార్టుమెంట్లలో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పతిని గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను దగ్గరుండి మరీ పరిష్కరింపజేస్తానని చెబుతున్నారు. పగటి పూట ఎండ తీవ్రంగా ఉంటుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి మలక్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్‌పేట, మల్కాజిగిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కార్వాన్, గోషామహల్, సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారం జోరుగా సాగుతోంది. -
‘రెండో విడత’ టీడీపీ డబ్బు పంపిణీ
సాక్షి, తిరుపతి: రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడటంతో ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునేందు కు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. పోలింగ్ కు 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో డబ్బు పంపిణీతో పాటు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. తొలివిడతలో భారీగా డబ్బు పంపిణీ చేసినా ఓటింగ్ సరళి అనుకూలంగా లేకపోవడంతో రెండో విడత మరింత ఎక్కువగా పంపిణీ చే స్తున్నారు. ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థులు పోటీలు పడి ఎంపీటీసీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీ అభ్యర్థులు డబ్బుతో పాటు తాయిలాల పం పిణీలో తలమునకలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో టీడీపీ వారు రూ.కోటి వరకు పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. సత్యవేడు మండలం లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి పది లక్షల రూపాయలు అందజేశారు. ఇక్కడ ఓట్ల సంఖ్యతో పనిలేకుండా ఇంటికి రెండు వేల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు. పుత్తూరు మండలంలో మహిళలకు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, యువకులకు క్రికెట్ కిట్లు అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ నమూనాలు చూపించి తాయిలాలు ఇస్తున్నారు. ఇక్కడ మద్యం కూడా భారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయలు వంతున పం పిణీ చేస్తున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో గురువారం డబ్బు పంపిణీ చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.