PC: IPL.com
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది.
ఢిల్లీ ఆటగాళ్ల కిట్స్ చోరీ..
ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్‌లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. కాగా కేకేఆర్‌తో మ్యాచ్ కోసం వార్నర్ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం(ఏప్రిల్16) ఢిల్లీకు చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాక తమ కిట్లు కనిపించకుండా పోయినట్లు ఆటగాళ్లు గుర్తించారు. కాగా చోరికి గురైన వస్తువులలో 16 బ్యాట్‌లు, బూట్లు, ప్యాడ్‌లు, గ్లోవ్‌లు ఉన్నాయి.
అందులో మూడు బ్యాట్‌లు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు సంబంధించినవి కాగా.. రెండు మిచెల్ మార్ష్, మూడు ఫిల్ సాల్ట్, ఐదు బ్యాట్లు యష్ ధుల్‌కి చెందినవి. దీనిపై ఫ్రాంఛైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
"ప్రతీ ఒక్క ప్లేయర్ తమ కిట్ బ్యాగ్‌ల నుంచి ఎదో ఒక వస్తువును పొగట్టుకున్నారు. ఇది విని మేము షాకయ్యాం. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. మేము దీనిపై ఎయిర్‌పోర్ట్ లాజిస్టిక్స్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఓ వ్యక్తి మీడియాతో పేర్కొన్నాడు.
చదవండి: Mohammed Siraj: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! ఊహించని ట్విస్ట్.. అతడెవరంటే..
Comments
Please login to add a commentAdd a comment